Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.
2. మోయాబీయురాలైన రూతు నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కూమారీ పొమ్మనెను.
“పరిగె”– లేవీయకాండము 19:9-10 లేవీయకాండము 23:22 ద్వితీయోపదేశకాండము 24:19-21. పేదలను దేవుడు జాలితో చూస్తాడు గనుక తన ధర్మశాస్త్రంలో ఈ సూచనలు విధించాడు (నిర్గమకాండము 22:25 కీర్తనల గ్రంథము 41:1 కీర్తనల గ్రంథము 82:3-4 సామెతలు 14:21 లూకా 6:20 యాకోబు 2:5). రూతు ఇలా చెప్పినందువల్ల ఆమెకూ నయోమికీ బ్రతుకుదెరువు కోసం ఎలాంటి ఆధారం లేదని తెలుస్తున్నది. అంతేగాక తన అత్త కోసం ఆమె ఎలాంటి కూలి పని చేసేందుకైనా సిద్ధమేననీ తెలుస్తున్నది. ఇది ఈ లోకంలో చాలా అరుదు.
3. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.
“ఆమె...చేరి”– దేవుడామెను అక్కడికి నడిపించాడు. ఇది విన్నప్పుడు నయోమి ఈ సంగతి గ్రహించింది (వ 19,20). రూతు 1:8 లో నయోమి చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడన్నమాట.
4. బోయజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి.
ఇది న్యాయాధిపతులు ఏలిన కాలం. ఇస్రాయేల్వారు తరచుగా పాపంలో, అపజయం, భ్రష్టత్వంలో మునిగివున్న కాలం (న్యాయాధిపతులు 2:16-19). అయితే ఆ కారుచీకటిలో బోయజు వంటి కాంతి రేఖలున్నారు. ప్రతి విశ్వాసీ ఇలా ఉండాలి (మత్తయి 5:14-15 ఫిలిప్పీయులకు 2:15). బోయజు దేవుని పట్ల భయభక్తులు చూపేవాడనీ తన పనివాళ్ళు, సాటి రైతుల గౌరవాన్ని చూరగొన్నవాడనీ అర్థమౌతున్నది (రూతు 4:11-12).
5. అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా
6. కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబుదేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన¸యౌవనురాలు.
7. ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.
8. అప్పుడు బోయజు రూతుతో నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.
9. వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని ¸యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.
10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.
11. నీవు నీ తలిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.
రూతు 1:8.
12. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.
“ప్రతిఫలం”– 1 సమూయేలు 24:19 1 సమూయేలు 26:23 సామెతలు 25:21-22 సామెతలు 10:32 లూకా 6:38 హెబ్రీయులకు 6:10. “రెక్కలు”– రూతు 1:16 కీర్తనల గ్రంథము 17:8 కీర్తనల గ్రంథము 36:7 కీర్తనల గ్రంథము 57:1 కీర్తనల గ్రంథము 61:4 కీర్తనల గ్రంథము 63:7 కీర్తనల గ్రంథము 91:4 మత్తయి 23:37.
13. అందుకు ఆమెనా యేలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.
14. బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.
15. ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి
బోయజు దయాపరుడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన దానికంటే ఎక్కువగానే పేదలకూ అక్కరలో ఉన్నవారికీ ఇచ్చేందుకు అతడు సిద్ధం (వ 2). ప్రతి ధాన్యం గింజా తమకే ఉంచుకోవాలనుకునే కొందరు వ్యక్తులకు ఇతడు పూర్తి వ్యతిరేకం.
16. మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను.
17. కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.
18. ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను.
19. అంతట ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.
రూతు పరిగె ఏరుకునేందుకు పొలం కామందు ఎక్కువ ధాన్యాన్ని వదిలిపెట్టాడని నయోమి గ్రహించింది.
20. నయోమి బ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా
“కృప”– రూతు 1:8.
21. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.
22. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.
23. కాబట్టి యవలకోతయు గోధుమలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.