Samuel I- 1 సమూయేలు 30 | View All
Study Bible (Beta)

1. దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,

1. And it came to pass, when David and his men were come to Ziklag on the third day, that the Amalekites had invaded the south, and Ziklag, and smitten Ziklag, and burned it with fire;

2. ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.

2. And had taken the women captives, that were therein: they slew not any, either great or small, but carried them away, and went on their way.

3. దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి

3. So David and his men came to the city, and, behold, it was burned with fire; and their wives, and their sons, and their daughters, were taken captives.

4. ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.

4. Then David and the people that were with him lifted up their voice and wept, until they had no more power to weep.

5. యజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి

5. And David's two wives were taken captives, Ahinoam the Jezreelitess, and Abigail the wife of Nabal the Carmelite.

6. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువి్వ దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.

6. And David was greatly distressed; for the people spoke of stoning him, because the soul of all the people was grieved, every man for his sons and for his daughters: but David encouraged himself in the LORD his God.

7. పమ్మట దావీదుఏఫోదు తెమ్మని యాజ కుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.

7. And David said to Abiathar the priest, Ahimelech's son, I pray you, bring me here the ephod. And Abiathar brought thither the ephod to David.

8. నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవాతరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెల విచ్చెను.

8. And David inquired at the LORD, saying, Shall I pursue after this troop? shall I overtake them? And he answered him, Pursue: for you shall surely overtake them, and without fail recover all.

9. కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందల మంది యును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.

9. So David went, he and the six hundred men that were with him, and came to the brook Besor, where those that were left behind stayed.

10. దావీదును నాలుగువందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవు చుండగా

10. But David pursued, he and four hundred men: for two hundred stayed behind, which were so faint that they could not go over the brook Besor.

11. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.

11. And they found an Egyptian in the field, and brought him to David, and gave him bread, and he did eat; and they made him drink water;

12. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

12. And they gave him a piece of a cake of figs, and two clusters of raisins: and when he had eaten, his spirit came again to him: for he had eaten no bread, nor drunk any water, three days and three nights.

13. దావీదు నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడునేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.

13. And David said to him, To whom belong you? and from where are you? And he said, I am a young man of Egypt, servant to an Amalekite; and my master left me, because three days ago I fell sick.

14. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.

14. We made an invasion on the south of the Cherethites, and on the coast which belongs to Judah, and on the south of Caleb; and we burned Ziklag with fire.

15. ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాని నడుగగా వాడునేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.

15. And David said to him, Can you bring me down to this company? And he said, Swear to me by God, that you will neither kill me, nor deliver me into the hands of my master, and I will bring you down to this company.

16. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశము లోనుండియు యూదా దేశములోనుండియు తాముదోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.

16. And when he had brought him down, behold, they were spread abroad on all the earth, eating and drinking, and dancing, because of all the great spoil that they had taken out of the land of the Philistines, and out of the land of Judah.

17. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కిపారి పోయిన నాలుగువందల మంది ¸యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

17. And David smote them from the twilight even to the evening of the next day: and there escaped not a man of them, save four hundred young men, which rode on camels, and fled.

18. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.

18. And David recovered all that the Amalekites had carried away: and David rescued his two wives.

19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.

19. And there was nothing lacking to them, neither small nor great, neither sons nor daughters, neither spoil, nor any thing that they had taken to them: David recovered all.

20. మరియదావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

20. And David took all the flocks and the herds, which they drove before those other cattle, and said, This is David's spoil.

21. అలసటచేత దావీ దును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీ దును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలు దేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా

21. And David came to the two hundred men, which were so faint that they could not follow David, whom they had made also to abide at the brook Besor: and they went forth to meet David, and to meet the people that were with him: and when David came near to the people, he saluted them.

22. దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరువీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు స ొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.

22. Then answered all the wicked men and men of Belial, of those that went with David, and said, Because they went not with us, we will not give them ought of the spoil that we have recovered, save to every man his wife and his children, that they may lead them away, and depart.

23. అందుకు దావీదు వారితో ఇట్లనెనునా సహోదరు లారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయ కూడదు.

23. Then said David, You shall not do so, my brothers, with that which the LORD has given us, who has preserved us, and delivered the company that came against us into our hand.

24. మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా

24. For who will listen to you in this matter? but as his part is that goes down to the battle, so shall his part be that tarries by the stuff: they shall part alike.

25. కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించెను.

25. And it was so from that day forward, that he made it a statute and an ordinance for Israel to this day.

26. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచియెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.

26. And when David came to Ziklag, he sent of the spoil to the elders of Judah, even to his friends, saying, Behold a present for you of the spoil of the enemies of the LORD;

27. బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను

27. To them which were in Bethel, and to them which were in south Ramoth, and to them which were in Jattir,

28. అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను

28. And to them which were in Aroer, and to them which were in Siphmoth, and to them which were in Eshtemoa,

29. రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను

29. And to them which were in Rachal, and to them which were in the cities of the Jerahmeelites, and to them which were in the cities of the Kenites,

30. హోర్మాలోను కోరాషానులోను అతాకులోను

30. And to them which were in Hormah, and to them which were in Chorashan, and to them which were in Athach,

31. హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.

31. And to them which were in Hebron, and to all the places where David himself and his men were wont to haunt.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel I- 1 సమూయేలు 30 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సిక్లగు అమాలేకీయులచే చెడిపోయింది. (1-6) 
మనం విదేశాల్లో మన విధులను నిర్వర్తించినప్పుడు, మనం లేని సమయంలో దేవుడు మన కుటుంబాలను చూస్తాడని నమ్మకంగా విశ్వసించవచ్చు. అయితే, మనం మన బాధ్యతలను విస్మరించి, కారణం లేకుండా దూరంగా ఉంటే, అదే దైవిక రక్షణను మనం ఆశించలేము. మన ప్రయాణాల నుండి తిరిగి వచ్చి, శిథిలావస్థలో కాకుండా ప్రశాంతంగా ఉన్న మన గృహాలను కనుగొన్నప్పుడు, మనము ప్రభువుకు స్తుతులు మరియు కృతజ్ఞతలు తెలియజేయాలి.
దావీదు విషయంలో, అతను తన మనుషుల నుండి గొణుగుడు మరియు ఫిర్యాదులను ఎదుర్కొన్నాడు. గొప్ప విశ్వాసం తరచుగా అలాంటి తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొంటుంది. ఆసక్తికరంగా, అతను సింహాసనాన్ని అధిరోహించే ముందు దావీదు యొక్క అత్యల్ప స్థానం వచ్చింది. చర్చికి మరియు దేవుని ప్రజలకు పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు, సరిగ్గా ఆటుపోట్లు మంచిగా మారడం ప్రారంభించినట్లు అనిపిస్తుంది.
అతని పురుషుల అసంతృప్తి మరియు చేదు ఉన్నప్పటికీ, దావీదు పరిస్థితిని భిన్నంగా నిర్వహించాడు. అతను తన దేవుడైన ప్రభువులో ప్రోత్సాహాన్ని కోరాడు. అతని సహచరులు తమ ప్రతికూల భావావేశాలను అణచివేసేందుకు అనుమతించినప్పటికీ, దావీదు తన విశ్వాసంపై ఆధారపడ్డాడు మరియు ప్రశాంతమైన స్ఫూర్తిని కొనసాగించాడు. అతను విలపించడానికి ప్రతి కారణం ఉన్నప్పటికీ, అతను నిరాశకు లోను కాకుండా తన ధర్మాలను సక్రియం చేయడానికి ఎంచుకున్నాడు. ప్రభువును తమ దేవుడిగా చేసుకున్న వారికి ఇది ఒక విలువైన పాఠంగా ఉపయోగపడుతుంది - అత్యంత సవాలుగా ఉన్న సమయాల్లో కూడా, వారు ఆయన నుండి బలాన్ని మరియు నిరీక్షణను పొందగలరు.

దావీదు అమాలేకీయులను అధిగమించాడు. (7-15) 
మన ప్రయత్నాలన్నింటిలో దేవుణ్ణి గుర్తించినప్పుడు, వారి నీతి గురించి ఎటువంటి సందేహం లేని పరిస్థితుల్లో కూడా, అతను దావీదు కోసం చేసినట్లే మన మార్గాలను నడిపిస్తాడని మనం ఆశించవచ్చు. దావీదు, తన మనుష్యుల పట్ల కనికరం చూపిస్తూ, వారి పరిమితులను దాటి వారిని నెట్టలేదు. అదేవిధంగా, దావీదు కుమారుడైన యేసు, తన అనుచరుల విభిన్న ఆధ్యాత్మిక బలాలు మరియు పోరాటాలను పరిగణనలోకి తీసుకుంటాడు. మనం బలహీనంగా ఉన్న చోట, ఆయన దయ చూపిస్తాడు మరియు నిజానికి బలాన్ని ప్రదర్శిస్తాడు 2 కోరింథీయులకు 12:9-10 లో చెప్పబడినట్లుగా).
పేద ఈజిప్షియన్ బాలుడి కథ, కేవలం సజీవంగా ఉంది, దావీదు జీవితంలో గణనీయమైన సానుకూల ప్రభావాన్ని తీసుకురావడానికి దేవుడు అవకాశం లేని మరియు వెనుకబడిన వ్యక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో వివరిస్తుంది. అమాలేకీయుల నాశనానికి దుర్వినియోగం చేయబడిన సేవకుడు కీలక పాత్ర పోషించేలా ప్రొవిడెన్స్ ఈ క్షణాన్ని నిర్వహించాడు, ఎందుకంటే దేవుడు అణగారిన వారి మొరలను వింటాడు. దేవుని నిజమైన అనుచరులు ఆపదలో ఉన్నవారి నుండి తమ కనికరాన్ని ఎన్నటికీ నిలిపివేయకూడదు. ప్రతి ఒక్కరినీ న్యాయంగా మరియు దయతో వ్యవహరించడం చాలా అవసరం, ఎందుకంటే కనీసం ఆశించిన వ్యక్తికి దయ లేదా గాయం కోసం ప్రతిస్పందించే అవకాశం ఎప్పుడు ఉంటుందో మాకు ఎప్పటికీ తెలియదు.

అతను కోల్పోయిన దానిని తిరిగి పొందుతాడు. (16-20) 
పాపంలో జీవిస్తున్న వారు "శాంతి మరియు భద్రత" అని ప్రకటించి, వారి చర్యల యొక్క రాబోయే పరిణామాలను విస్మరించినప్పుడు తరచుగా వారి పతనానికి దగ్గరగా ఉంటారు. ఇంద్రియాలు మరియు తృప్తి మన ఆధ్యాత్మిక శత్రువులు దోపిడీ చేయడానికి సారవంతమైన నేలను అందిస్తాయి. చాలా మంది వ్యక్తులు విందులు, మద్యపానం మరియు ఉల్లాసం యొక్క ఆకర్షణ ద్వారా చిక్కుకున్నారు, చివరికి వారిని విధ్వంసం మరియు నిరాశతో ముగిసే మార్గంలో నడిపించారు.
కృతజ్ఞతగా, విముక్తి కోసం ఆశ ఉంది. ఈ పరిస్థితిలో చూసినట్లుగా, పాపం యొక్క దోపిడీని తిరిగి పొందవచ్చు మరియు పునరుద్ధరించవచ్చు. ఏదీ కోలుకోలేని విధంగా కోల్పోలేదు మరియు పశ్చాత్తాపం మరియు పరివర్తన ద్వారా చాలా ఎక్కువ పొందవచ్చు.

దావీదు దోపిడిని పంపిణీ చేయడం. (21-31)
దేవుడు తన బహుమతులతో మనలను ఆశీర్వదిస్తాడు, మనం వాటిని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో. దావీదు దోపిడిని పంచినప్పుడు, అతను న్యాయం మరియు దయ రెండింటికి ఉదాహరణగా నిలిచాడు. దీనికి విరుద్ధంగా, తమ సొంత కోరికలను తీర్చుకోగలిగినంత కాలం ఇతరుల బాధల పట్ల శ్రద్ధ చూపకుండా, తోటి సోదరులను అణచివేయడంలో ఆనందం పొందే వ్యక్తులు నిజంగా దుర్మార్గులు.
మరోవైపు, దావీదు తన స్నేహితులందరి పట్ల ఉదారతను మరియు దయను ప్రదర్శించాడు. ప్రభువును తమ సమృద్ధికి మూలంగా గుర్తించే వారు తమ ఆశీర్వాదాలను నిజాయితీగా మరియు ఉదారతతో నిర్వహిస్తారు.



Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |