Genesis - ఆదికాండము 18 | View All

1. మరియమమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
హెబ్రీయులకు 13:2

1. And the LORD appeared to him by the oaks of Mamre, as he sat at the door of his tent in the heat of the day.

2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి

2. He lifted up his eyes and looked, and behold, three men were standing in front of him. When he saw them, he ran from the tent door to meet them and bowed himself to the earth

3. ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు.

3. and said, 'O Lord, if I have found favor in your sight, do not pass by your servant.

4. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.
లూకా 7:44

4. Let a little water be brought, and wash your feet, and rest yourselves under the tree,

5. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా

5. while I bring a morsel of bread, that you may refresh yourselves, and after that you may pass on- since you have come to your servant.' So they said, 'Do as you have said.'

6. అబ్రాహాము గుడారములో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.

6. And Abraham went quickly into the tent to Sarah and said, 'Quick! Three seahs of fine flour! Knead it, and make cakes.'

7. మరియఅబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను.

7. And Abraham ran to the herd and took a calf, tender and good, and gave it to a young man, who prepared it quickly.

8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి యెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.

8. Then he took curds and milk and the calf that he had prepared, and set it before them. And he stood by them under the tree while they ate.

9. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.

9. They said to him, 'Where is Sarah your wife?' And he said, 'She is in the tent.'

10. అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
రోమీయులకు 9:9

10. The LORD said, 'I will surely return to you about this time next year, and Sarah your wife shall have a son.' And Sarah was listening at the tent door behind him.

11. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక
లూకా 1:18, హెబ్రీయులకు 11:11

11. Now Abraham and Sarah were old, advanced in years. The way of women had ceased to be with Sarah.

12. శారా - నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
1 పేతురు 3:6

12. So Sarah laughed to herself, saying, 'After I am worn out, and my lord is old, shall I have pleasure?'

13. అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?

13. The LORD said to Abraham, 'Why did Sarah laugh and say, 'Shall I indeed bear a child, now that I am old?'

14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.
మత్తయి 19:26, మార్కు 10:27, లూకా 1:37, రోమీయులకు 9:9

14. Is anything too hard for the LORD? At the appointed time I will return to you about this time next year, and Sarah shall have a son.'

15. శారా భయపడి - నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.
1 పేతురు 3:6

15. But Sarah denied it, saying, 'I did not laugh,' for she was afraid. He said, 'No, but you did laugh.'

16. అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.

16. Then the men set out from there, and they looked down toward Sodom. And Abraham went with them to set them on their way.

17. అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?

17. The LORD said, 'Shall I hide from Abraham what I am about to do,

18. అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.
అపో. కార్యములు 3:25, రోమీయులకు 4:13, గలతియులకు 3:8

18. seeing that Abraham shall surely become a great and mighty nation, and all the nations of the earth shall be blessed in him?

19. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

19. For I have chosen him, that he may command his children and his household after him to keep the way of the LORD by doing righteousness and justice, so that the LORD may bring to Abraham what he has promised him.'

20. మరియయెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను
లూకా 17:28, మత్తయి 10:15

20. Then the LORD said, 'Because the outcry against Sodom and Gomorrah is great and their sin is very grave,

21. నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.
ప్రకటన గ్రంథం 18:5, లూకా 17:28

21. I will go down to see whether they have done altogether according to the outcry that has come to me. And if not, I will know.'

22. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.

22. So the men turned from there and went toward Sodom, but Abraham still stood before the LORD.

23. అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా?

23. Then Abraham drew near and said, 'Will you indeed sweep away the righteous with the wicked?

24. ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?

24. Suppose there are fifty righteous within the city. Will you then sweep away the place and not spare it for the fifty righteous who are in it?

25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
హెబ్రీయులకు 12:23

25. Far be it from you to do such a thing, to put the righteous to death with the wicked, so that the righteous fare as the wicked! Far be that from you! Shall not the Judge of all the earth do what is just?'

26. యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను

26. And the LORD said, 'If I find at Sodom fifty righteous in the city, I will spare the whole place for their sake.'

27. అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.

27. Abraham answered and said, 'Behold, I have undertaken to speak to the Lord, I who am but dust and ashes.

28. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;

28. Suppose five of the fifty righteous are lacking. Will you destroy the whole city for lack of five?' And he said, 'I will not destroy it if I find forty-five there.'

29. అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా

29. Again he spoke to him and said, 'Suppose forty are found there.' He answered, 'For the sake of forty I will not do it.'

30. అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.

30. Then he said, 'Oh let not the Lord be angry, and I will speak. Suppose thirty are found there.' He answered, 'I will not do it, if I find thirty there.'

31. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా

31. He said, 'Behold, I have undertaken to speak to the Lord. Suppose twenty are found there.' He answered, 'For the sake of twenty I will not destroy it.'

32. అతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.

32. Then he said, 'Oh let not the Lord be angry, and I will speak again but this once. Suppose ten are found there.' He answered, 'For the sake of ten I will not destroy it.'

33. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.

33. And the LORD went his way, when he had finished speaking to Abraham, and Abraham returned to his place.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ప్రభువు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. (1-8) 
అబ్రాహాము అలసిపోయి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలం అవసరమైన ప్రజలకు మంచిగా ఉండేందుకు వేచి ఉన్నాడు. అతను ముగ్గురు వ్యక్తులు రావడం చూశాడు, కాని వారు నిజానికి దేవదూతలుగా నటిస్తున్నారు. మర్యాదగా ఉండేందుకు అబ్రాహాము వారి పాదాలను కడిగాడు. అపరిచితుల పట్ల దయ చూపడం చాలా ముఖ్యం ఎందుకంటే వారు మారువేషంలో ఉన్న దేవదూతలు కావచ్చు. ప్రకటన గ్రంథం 3:20 

శారా యొక్క అవిశ్వాసం ఖండించబడింది. (9-15) 
శారా ఎక్కడ అని ఎవరో అడిగారు, మరియు ఆమె తన డేరాలో తన పని చేసుకుంటూ ఉందని సమాధానం వచ్చింది. మన సరైన స్థలంలో ఉంటూ మన విధులను నిర్వహించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అప్పుడే మనం దేవుని నుండి ఓదార్పును పొందగలము. అయితే, మన నిజమైన భావాలు మరియు ఆలోచనలు దేవునికి తెలుసు. శారా అబద్ధం చెప్పింది మరియు ఆమె నవ్వలేదు, ఇది పాపం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మరియు మన తప్పులను చూసి పశ్చాత్తాపపడడానికి సహాయం చేస్తాడు.

సొదొమ నాశనాన్ని దేవుడు అబ్రాహాముకు వెల్లడిచేశాడు. (16-22) 
ఒకప్పుడు ఇద్దరు దేవదూతలు సొదొమ అనే ప్రాంతానికి వెళ్లారు. యెహోవా అని పిలువబడే మరో ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రాహాము అనే వ్యక్తితో ఉంటూ తన ప్రణాళికల గురించి చెప్పాడు. చెడ్డ పనులు చేసే వ్యక్తుల పట్ల దేవుడు సహనం చూపినప్పటికీ, చివరికి వారిని శిక్షిస్తాడు. కానీ దేవుడు అబ్రాహామును ప్రశ్నలు అడగడానికి మరియు అతని కారణాలను వివరించడానికి అవకాశం ఇచ్చాడు. అబ్రాహాము ఒక మంచి ఉదాహరణ, ఎందుకంటే అతను తన కుటుంబంతో కలిసి ప్రార్థించడమే కాకుండా మంచి మరియు నిజాయితీ గల వ్యక్తులుగా ఉండాలని వారికి నేర్పించాడు. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో చాలా మంది దీన్ని చేయరు. తల్లిదండ్రులు మరియు నాయకులు వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో శ్రద్ధ వహించాలి మరియు దేవునిని అనుసరించే మంచి వ్యక్తులుగా మారడానికి వారికి సహాయం చేయాలి.

సొదొమ కొరకు అబ్రహం యొక్క మధ్యవర్తిత్వం. (23-33)
సొదొమ అనే నగరాన్ని నాశనం చేయకుండా కాపాడమని దేవుడిని ప్రార్థించిన అబ్రహం అనే వ్యక్తికి సంబంధించిన కథ ఇది. అక్కడ కొంతమంది మంచి వ్యక్తులు నివసిస్తున్నట్లయితే, ఆ నగరాన్ని రక్షించమని దేవుడిని కోరాడు. తప్పులు చేసే వ్యక్తుల పట్ల మనం కనికరం చూపాలని మరియు వారు బాగా చేయమని ప్రార్థించాలని అబ్రాహాము నుండి మనం నేర్చుకోవచ్చు. అబ్రాహాము ప్రార్థన మొత్తం నగరాన్ని రక్షించనప్పటికీ, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. మనం మన కుటుంబాలు, స్నేహితులు మరియు పొరుగువారి కోసం కూడా ప్రార్థించాలి మరియు సరైనది చేయడం ద్వారా అబ్రాహాములా ఉండేందుకు ప్రయత్నించాలి. దేవుడు న్యాయమైన మరియు న్యాయమైన దానిని చేస్తాడని అబ్రాహాము నమ్మాడు. తప్పు చేసిన వ్యక్తుల కోసం కూడా యేసు ప్రార్థించాడు, కానీ వారి ప్రవర్తనకు సాకులు చెప్పలేదు. బదులుగా, అతను వారిని క్షమించమని దేవుణ్ణి కోరాడు మరియు వారి కోసం తన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |