Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.హెబ్రీయులకు 13:2
దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షమైన సందర్భం ఇది. ఆదికాండము 12:7 ఆదికాండము 16:7 చూడండి. అబ్రాహాముకు కనిపించిన మిగతా ఇద్దరు వ్యక్తులు దేవదూతలు (16, 22వచనాలు, ఆదికాండము 19:1).
2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
3. ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు.
4. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.లూకా 7:44
5. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా
6. అబ్రాహాము గుడారములో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.
7. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను.
8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి యెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.
అబ్రాహాము భోజన సన్నాహాలకు కొంత సమయం పట్టింది. యెహోవా, ఆయన దూతలు ఓపిగ్గా కూర్చున్నారు. న్యాయాధిపతులు 6:18 చూడండి.
9. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.
10. అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.రోమీయులకు 9:9
11. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుకలూకా 1:18, హెబ్రీయులకు 11:11
12. శారా - నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.1 పేతురు 3:6
ఆదికాండము 17:17 చూడండి. కానీ అబ్రాహాములాగానే శారా కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మింది – హెబ్రీయులకు 11:11-12.
13. అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?
14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.మత్తయి 19:26, మార్కు 10:27, లూకా 1:37, రోమీయులకు 9:9
“చేయలేనిది”– యిర్మియా 32:17 యిర్మియా 32:27 మత్తయి 19:25-26 లూకా 1:37.
15. శారా భయపడి - నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.1 పేతురు 3:6
దేవునితో అబద్ధం ఆడడంద్వారా శారా తన భ్రష్ట స్వభావాన్ని కనబరచుకుంటున్నది. ఆదికాండము 12:13 చూడండి. చాలా సార్లు అనవసరమైన తగని భయాల కారణంగా మంచివాళ్ళు కూడా పాపం చేస్తుంటారు. దేవునిపట్ల సవ్యమైన భయం మనిషిని పాపం చేయకుండేలా కాపాడుతుంది (ఆదికాండము 20:11 నిర్గమకాండము 20:20). అందు
16. అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.
“సొదొమ”– ఆదికాండము 13:12-13.
17. అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
కీర్తనల గ్రంథము 25:14 సామెతలు 3:32 ఆమోసు 3:7 యోహాను 7:17 యెషయా 41:8.
18. అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.అపో. కార్యములు 3:25, రోమీయులకు 4:13, గలతియులకు 3:8
ఆదికాండము 12:3 ఆదికాండము 22:18 అపో. కార్యములు 3:25 గలతియులకు 3:8.
19. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
“సంతతివారు”– ద్వితీయోపదేశకాండము 4:9 ద్వితీయోపదేశకాండము 6:6-7 ద్వితీయోపదేశకాండము 11:9 సామెతలు 78:4 సామెతలు 22:6 ఎఫెసీయులకు 6:4 2 తిమోతికి 3:15. దేవుడు తనకు చేసిన ప్రమాణాలు నెరవేర్చేలా ప్రవర్తన విషయంలో అబ్రాహాము బాధ్యుడని ఇక్కడ చూడండి. తన భవిష్యత్ జ్ఞానంతో దేవుడు ఈ కారణంచేతనే అతణ్ణి ఎన్నుకున్నాడు.
20. మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకనులూకా 17:28, మత్తయి 10:15
21. నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.ప్రకటన గ్రంథం 18:5, లూకా 17:28
“తెలుసుకొంటాను”– సర్వ జ్ఞానంగల యెహోవాకు సొదొమ వాస్తవ స్థితి తెలియదా? దేవుడు దిగివెళ్ళి చూడవలసిన అవసరం ఏముంది? ఆయనకా అవసరం లేదు. ఉన్నచోటనుంచి కదలకుండానే ఆయన అన్నీ తెలుసుకోగలడు – యోహాను 21:17 హెబ్రీయులకు 4:13. అందువల్ల దేవునికి తెలియకుండా దేన్నైనా దాచిపెట్టగలమని ఎ
22. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.
సొదొమను ధ్వంసం చెయ్యాలన్న దేవుని నిర్ణయాన్ని అబ్రాహాము అర్థం చేసుకున్నాడు. అతని అన్న కొడుకైన లోత్ అక్కడ నివసిస్తున్నాడు. సొదొమ విధ్వంసంలో లోత్ కూడా అంతరించిపోతాడని అబ్రాహాము భయం. అంతేగాక సొదొమవాళ్ళు దుర్మార్గులైనప్పటికీ వాళ్ళ విషయం అతనికి జాలి వేసి ఉండవచ్
23. అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా?
24. ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?
25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడుహెబ్రీయులకు 12:23
“న్యాయమూర్తి”– కీర్తనల గ్రంథము 9:7-8 కీర్తనల గ్రంథము 58:11 కీర్తనల గ్రంథము 94:2 కీర్తనల గ్రంథము 96:13 ప్రసంగి 12:4 అపో. కార్యములు 17:30-31 రోమీయులకు 2:16 2 కోరింథీయులకు 5:10 ప్రకటన గ్రంథం 20:11-15. “న్యాయంగా...తీర్చడా”– ద్వితీయోపదేశకాండము 32:4 2 దినవృత్తాంతములు 19:7 యోబు 34:10 యోబు 34:12 యోబు 37:23 కీర్తనల గ్రంథము 89:14 కీర్తనల గ్రంథము 97:2 యిర్మియా 9:24.
26. యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను
27. అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.
“ధూళి, బూడిదె”– ఆదికాండము 3:19. మహోన్నతుడైన సృష్టికర్త, ప్రపంచాల ప్రభువు ఎదుట అబ్రాహాము ఒక దుర్బలుడైన మర్త్యజీవిగా తనకు తగిన స్థానంలో నిలబడుతున్నాడు. ఏకైక నిజ దేవుణ్ణి ప్రార్థించేందుకు ఇంతకంటే యోగ్యమైన దారి మనుషులకు లేదు.
28. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;
29. అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా
30. అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.
“కోపం”– మనుషులు వినయంగా ప్రార్థిస్తూ ఇతరులకోసం బ్రతిమాలుతుంటే దేవుడు కోపగించుకోడు. దేవునికి నిజంగా కోపం తెప్పించే విషయాలను సంఖ్యాకాండము 25:3 నోటులో చూడండి.
31. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా
32. అతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.
అబ్రాహాము పది దగ్గర చాలించాడు. లోత్ కనీసం తన కుటుంబాన్నీ మరి కొద్దిమందినీ నీతిన్యాయాల మార్గంలోకి తెచ్చి ఉంటాడని బహుశా అబ్రాహాము అనుకొనివుండవచ్చు. కానీ నిజానికి సొదొమ నగరమంతట్లో న్యాయవంతుడు ఒక్కడే. అతడు లోత్ (2 పేతురు 2:6-8). అతడు సహా తప్పించుకోవడానికి అబ్రా
33. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.