1. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో - నాకు గర్భఫలమునిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.
1. Rachel saw that she couldn't have any children by Jacob. So she became jealous of her sister. She said to Jacob, 'Give me children, or I'll die!'
2. యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు - నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.
2. Jacob became angry with her. He said, 'Do you think I'm God? He's the one who has kept you from having children.'
3. అందుకామె - నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి
3. Then she said, 'Here's my servant Bilhah. Make love to her so that she can have children for me. Then I too can have a family through her.'
4. తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
4. So she gave him her servant Bilhah as a wife. Jacob made love to her.
5. And Bilhah became pregnant. She had a son by him.
6. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
6. Then Rachel said, 'God has stood up for my rights. He has listened to my prayer and given me a son.' So she named him Dan.
7. Rachel's servant Bilhah became pregnant again. She had a second son by Jacob.
8. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
8. Then Rachel said, 'I've had a great struggle with my sister. Now I've won.' So she named him Naphtali.
9. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
9. Leah saw that she had stopped having children. So she gave her servant Zilpah to Jacob as a wife.
10. Leah's servant Zilpah had a son by Jacob.
11. లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
11. Then Leah said, 'What good fortune!' So she named him Gad.
12. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
12. Leah's servant Zilpah had a second son by Jacob.
13. లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
13. Then Leah said, 'I'm so happy! The women will call me happy.' So she named him Asher.
14. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు - నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
14. While the wheat harvest was being gathered, Reuben went out into the fields. He found some mandrake plants. He brought them to his mother Leah. Rachel said to Leah, 'Please give me some of your son's mandrakes.'
15. ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
15. But Leah said to her, 'Isn't it enough that you took my husband away? Are you going to take my son's mandrakes too?' Rachel said, 'All right. Jacob can make love to you tonight if you give me your son's mandrakes.'
16. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
16. Jacob came in from the fields that evening. Leah went out to meet him. 'You have to sleep with me tonight,' she said. 'I've bought you with my son's mandrakes.' So he made love to her that night.
17. God listened to Leah. She became pregnant and had a fifth son by Jacob.
18. లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
18. Then Leah said, 'God has rewarded me because I gave my female servant to my husband.' So she named the boy Issachar.
19. లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
19. Leah became pregnant again. She had a sixth son by Jacob.
20. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
20. Then Leah said, 'God has given me a priceless gift. This time my husband will treat me with honor. I've had six sons by him.' So she named the boy Zebulun.
21. ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
21. Some time later she had a daughter. She named her Dinah.
22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
22. Then God listened to Rachel. He showed concern for her. He made it possible for her to have children.
23. అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
లూకా 1:25
23. She became pregnant. She had a son. She said, 'God has taken my shame away.'
24. She continued, 'May the Lord give me another son.' So she named him Joseph.
25. After Rachel had Joseph, Jacob spoke to Laban. He said, 'Send me on my way. I want to go back to my own home and country.
26. నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
26. Give me my wives and children. I worked for you to get them. So I'll be on my way. You know how much work I've done for you.'
27. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.
27. But Laban said to him, 'If you are pleased with me, stay here. I've discovered that the Lord has blessed me because of you.'
28. మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
28. He continued, 'Name your pay. I'll give it to you.'
29. అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;
29. Jacob said to him, 'You know how hard I've worked for you. You know that your livestock has done better under my care.
30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.
30. You had only a little before I came. But that little has become a lot. The Lord has blessed you everywhere I've been. But when can I do something for my own family?'
31. అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.
31. 'What should I give you?' Laban asked. 'Don't give me anything,' Jacob replied. 'Just do one thing for me. Then I'll go on taking care of your flocks and watching over them.
32. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.
32. Let me go through all of your flocks today. Let me remove every sheep that has speckles or spots on it. Let me remove every dark-colored lamb. Let me remove every goat that has spots or speckles on it. They will be my pay.
33. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.
33. 'My honesty will give witness about me in days to come. It will give witness every time you check on what you have paid me. Suppose I have a goat that doesn't have speckles or spots. Or suppose I have a lamb that isn't dark-colored. Then it will be considered stolen.'
34. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
34. 'I agree,' said Laban. 'Let's do what you have said.'
35. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి
35. That same day Laban removed all of the male goats that had stripes or spots. He removed all of the female goats that had speckles or spots. They were the ones that had white on them. He also removed all of the dark-colored lambs. He had his sons take care of them.
36. తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
36. Then he put a journey of three days between himself and Jacob. But Jacob continued to take care of the rest of Laban's flocks.
37. యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
37. Jacob took branches that were freshly cut from poplar, almond and plane trees. He made white stripes on them by peeling off the bark. He uncovered the white wood inside the branches.
38. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా
38. Then he placed the peeled branches in all of the stone tubs where the animals drank water. He placed them so they would be right in front of the flocks when they came to drink. The flocks were ready to mate when they came to drink.
39. మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.
39. So they mated in front of the branches. And they had little ones that were striped or speckled or spotted.
40. యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.
40. Jacob put the little ones of the flock to one side by themselves. But he made the older ones face the striped and dark-colored animals that belonged to Laban. In that way, he made separate flocks for himself. He didn't put them with Laban's animals.
41. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.
41. Every time the stronger females were ready to mate, Jacob would place the branches in the stone tubs. He would place them in front of the animals so they would mate near the branches.
42. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబు నకును వచ్చెను.
42. But if the animals were weak, he wouldn't place the branches there. So the weak animals went to Laban. And the strong ones went to Jacob.
43. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.
43. In this way, Jacob became very rich. He became the owner of large flocks. He also had many male and female servants. And he had many camels and donkeys.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 30 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
యాకోబు కుటుంబం గురించి మరింత సమాచారం. (1-13)
రాచెల్ తన సోదరిని చూసి అసూయ చెందింది, అంటే తన సోదరి వద్ద మంచి విషయాలు ఉన్నాయని మరియు అవి తన వద్ద లేవని ఆమె బాధపడింది. ఇది చెడ్డ పని ఎందుకంటే ఇది దేవునికి సంతోషాన్ని కలిగించదు మరియు ఇది ఇతరులను మరియు మనలను బాధిస్తుంది. దేవుడు అందరినీ వేర్వేరుగా చేశాడనీ, తనకు కూడా మంచి విషయాలు ఉన్నాయని రాహేలు గ్రహించలేదు. ఇతరులను చూసి అసూయపడకుండా జాగ్రత్తపడాలి. యాకోబు రాహేలును ప్రేమించాడు మరియు ఆమె ఏదైనా తప్పు చేసినప్పుడు అతను ఆమెకు చెప్పాడు. మీరు శ్రద్ధ వహిస్తున్నట్లు చూపించడానికి ఇది మంచి మార్గం. మనం దేవుణ్ణి నమ్మడం కంటే ఎవరినీ లేదా దేనినీ ఎక్కువగా విశ్వసించకూడదు. రాహేలు తన సేవకుడైన బిల్హాను వివాహం చేసుకోమని యాకోబును ఒప్పించింది, తద్వారా బిల్హాకు ఉన్న పిల్లలు రాహేలుకు చెందుతారు. ఇది అప్పట్లో ఆచారం. రాహేలు చెడు భావాలచే ప్రభావితమై ఉండకపోతే, ఆమె బిల్హా పిల్లల కంటే తన సోదరి పిల్లలను ఎక్కువగా చూసుకునేది. కానీ రాచెల్ పిల్లలను ఆమె అంతగా ప్రేమించనప్పటికీ, ఆమె నియంత్రించగలిగేలా పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంది. రాచెల్ తన సోదరితో పోటీపడుతున్నట్లు చూపించే బిల్హా పిల్లలకు పేర్లు కూడా పెట్టింది. అసూయ మరియు తగాదాలు కుటుంబాలలో ఎలా సమస్యలను కలిగిస్తాయో ఇది చూపిస్తుంది. లేయా తన సహాయకురాలు జిల్పాను వివాహం చేసుకోమని యాకోబును ఒప్పించింది. అసూయ మరియు పోటీ ఎలా సమస్యలను కలిగిస్తుందో ఇది చూపిస్తుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మనం శాంతియుతమైన మరియు స్వచ్ఛమైన సంబంధాలను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని గుర్తుంచుకోవడం ముఖ్యం.
రాచెల్ యోసేపును కన్నది. (14-24)
చాలా కాలం క్రితం, రాచెల్ మరియు లేయా అనే ఇద్దరు సోదరీమణులు తమ కుటుంబానికి దేవుడు వాగ్దానం చేసిన చాలా ప్రత్యేకమైన శిశువుకు తల్లి కావాలని కోరుకున్నారు. దీంతో వారు ఒకరిపై ఒకరు అసూయ చెందారు మరియు ఎవరికి ఎక్కువ పిల్లలు పుడతారని వారు గొడవపడ్డారు. కానీ నిజంగా, చాలా ముఖ్యమైన వ్యక్తిని ప్రపంచంలోకి తీసుకురావాలనే దేవుని ప్రణాళికలో వారిద్దరూ భాగం కావాలని కోరుకున్నారు.
పశువుల కోసం అతనికి సేవ చేయడానికి లాబాన్‌తో యాకోబు కొత్త ఒప్పందం. (25-43)
తన మేనమామ లాబానుతో పద్నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత, యాకోబు దేవుని వాగ్దానానికి తప్ప ఎలాంటి డబ్బు లేదా ఆస్తులు లేకుండా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే, లాబానుకు చెందిన కొన్ని వస్తువులపై అతనికి హక్కు ఉంది మరియు దేవుడు వాటిని కలిగి ఉండాలని కోరుకున్నాడు. చాలా అత్యాశగల లాబానుతో నిర్ణయించిన వేతనానికి అంగీకరించడానికి బదులుగా, అతను తన కారణాన్ని దేవుని చేతుల్లో విడిచిపెట్టాడు. యాకోబు తన వస్తువులలో కొన్ని రంగుల జంతువులు మాత్రమే ఉండేలా చూసుకున్నప్పుడు నిజాయితీగా ఉన్నాడు. లాబాను యాకోబు జంతువులు తన జంతువులకు మాత్రమే రంగులు కలిగి ఉంటాయని అనుకున్నాడు, కానీ అతను తప్పు చేసాడు. ఈ ఒప్పందం తర్వాత యాకోబు యొక్క చర్యలు అతను చాలా తెలివిగా మరియు విషయాలను నిర్వహించడంలో మంచివాడని చూపించాయి. దేవుడు యాకోబుకు సహాయం చేసాడు మరియు అతనికి కావలసినది ఇవ్వడం ద్వారా అతని శక్తిని చూపించాడు. దేవుడు తనను విశ్వసించే వ్యక్తులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు మరియు వారితో న్యాయంగా ప్రవర్తిస్తాడు. లాబాను అంగీకరించని దేన్నీ యాకోబు తీసుకోలేదు మరియు లాబాను నిజానికి యాకోబు పని నుండి ప్రయోజనం పొందాడు. మన దగ్గర ఉన్న అన్ని మంచి విషయాలకు మనం కృతజ్ఞులమై ఉండాలి మరియు అవి దేవుని నుండి వచ్చాయని గుర్తుంచుకోవాలి.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |