Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో - నాకు గర్భఫలమునిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.
పాత ఒడంబడికలోని దేవుని ప్రజలకు ఒకటి కంటే ఎక్కువమంది భార్యలున్నప్పటికీ వారికి గానీ మరెవరికైనా గానీ ఇది దేవుని ఆదేశం కాదు. దేవుడు నియమించింది ఒక పురుషుడికి ఒక స్త్రీ (ఆదికాండము 2:21-24 మత్తయి 19:1-9). ఈ అధ్యాయంలో ఎక్కువమంది భార్యలుంటే ఎక్కువ ఇక్కట్లు అన్న విషయం చూడవచ్చు. 1వ వచనంలో అసూయ, రెండో వచనంలో కోపం, 3,4 వచనాల్లో శరీర రీతి ఆలోచనలు, 8వ వచనంలో పోరు, 14-16 వచనాల్లో అజ్ఞానపూరితమైన పోటీలు ఉన్నాయి. యాకోబు మాదిరి మంచిది కాదు. బైబిలులో మంచిది కాని మాదిరి కనిపిస్తే దాని ప్రకారం చేయరాదని దాన్ని చూచి మనం నేర్చుకోవాలనే గానీ దాన్ని అనుసరించాలని కాదు. ఈ తరువాత వచనాల్లో మరో సారి మానవ హృదయం యొక్క విచారకరమైన స్థితిని మనం చూస్తున్నాం. అందరూ పాపులే. దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించక అనేక రకాలుగా తప్పిపోతున్నారు. మనం వ్యర్థంగా ఊహించిన రీతిలో గాక ఉన్నవి ఉన్నట్టుగానే బైబిలు చెప్తుంది. పాపవిముక్తి పొందినవారు దేవుని కృపవల్లే పొందారు గాని తమకు ఉన్నదని వారు భావించే మంచితనం వల్ల కాదు.
2. యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు - నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.
ఆదికాండము 20:18 కీర్తనల గ్రంథము 113:9 కీర్తనల గ్రంథము 127:3 చూడండి.
3. అందుకామె - నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి
వ 9; 16:2 కుటుంబం, సంతానం కావాలని పురాతన కాలాల్లో స్త్రీలెంతగా తహతహలాడేవాళ్ళో ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నది.
4. తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
5. బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
6. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
“దాను అంటే న్యాయం తీర్చాడు” లేక “నిర్దోషమని చూపాడు”.
7. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.
8. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
“నఫ్తాలి”అంటే “నా పోరాటం”.
9. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
10. లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
11. లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
“గాదు”అంటే “భాగ్యం”.
12. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
13. లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
“నేను ధన్యనే”– ఆదికాండము 29:32 పోల్చి చూడండి. ఆమెను ఆవేదననుండి ఆనందానికి వచ్చేలా దేవుడు చేశాడు. ఇలా చెయ్యడం దేవునికెంతో ఇష్టం యెషయా 61:3 పోల్చిచూడండి. “ఆషేరు” అంటే “ధన్యం” లేక “సంతోషంగా”.
14. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు - నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
“పుత్రదాత ఓషధి”– దీన్ని తింటే స్త్రీలు సంతానవతులౌతారని వారు తప్పుగా నమ్మేవారు. ఇది నిజం కాదు.
15. ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
16. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
17. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
లేయాకు మరో కొడుకు కలగడం దేవుని కృప. ఆ ఓషధులు తినడంవల్ల కాదు.
18. లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
“దాసిని”– దేవుడు లేయాకు మరో కొడుకును ఇవ్వడం వెనుక ఉన్న కారణాన్ని ఆమె పూర్తిగా అపార్థం చేసుకుంది. ఇశ్శాకారు అంటే “అద్దె మనిషి”.
19. లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
20. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
తన భర్త తనను ప్రేమించడం గురించి లేయా ఇక మాట్లాడ్డం లేదు (ఆదికాండము 29:32 ఆదికాండము 29:34) గాని కనీసం ఇకపై తనను కొంత గౌరవంగా చూస్తాడన్న ఆశను మాత్రం వదిలివేయలేదు. జెబూలూను అంటే “కాపురం” లేదా “గౌరవం”.
21. ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
దీనా అంటే “తీర్పు”.
22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
ఆదికాండము 8:1.
23. అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.లూకా 1:25
“అవమానం”– పిల్లలు లేకపోవడం తనకు అవమానంగా భావించిందామె (1 సమూయేలు 1:2 1 సమూయేలు 1:7 లూకా 1:25 పోల్చిచూడండి). అయితే ఇది సరి కాదు. ఆమెకు పిల్లల్ని ఇవ్వవలసిన సమయం వచ్చేవరకు ఆమె విషయంలో అది దేవుని సంకల్పం, అంతే. మనం దేవునిలో నమ్మకం ఉంచి ఆయన్ను సేవిస్తూ వుంటే మనపట్ల ఆయన సంకల్పాలు మనకెన్నటికీ అవమాన కారణాలు కావు (రోమీయులకు 12:1-2).
24. మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
“యోసేపు”– అంటే “ఆయన వృద్ధి చేయాలి”, లేదా “అభివృద్ధి”. సామెతలు 30:15-16 పోల్చి చూడండి.
25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో - నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.
26. నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
27. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.
“నీ కారణంగా”– ఆదికాండము 21:22 ఆదికాండము 26:24 ఆదికాండము 39:3-4 యెషయా 61:9.
28. మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
29. అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;
30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.
31. అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.
32. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.
33. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.
34. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
35. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి
యాకోబు తన అన్ననూ తండ్రినీ మోసగించాడు. అతడి మామ చేతుల్లో మోసపోయాడు. అతడి స్వంతానికి ఒక్క గొర్రెనైనా, మేకనైనా వదలడానికి లాబాను ఇష్టపడలేదు.
36. తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
37. యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
యాకోబు తనక్కూడా కొన్ని ఉపాయాలు తెలుసుననుకున్నాడు. నిజానికి ఎద అవుతున్న గొర్రెలు, మేకల కళ్ళెదుట ఒలిచిన చువ్వలు పెట్టడానికీ వాటికి పుట్టిన పిల్లలకూ ఎలాంటి సంబంధమూ లేదు. చారలు, మచ్చలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఎందుకు పుట్టాయో కారణం ఆదికాండము 31:11-12 లో ఉంది. ఇలా జరగడం ప్రకృతి ధర్మాల ద్వారా పని చేస్తున్న దేవుని కృపవల్లే గాని యాకోబు జిత్తులవల్ల కాదు.
38. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా
39. మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.
40. యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.
41. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.
42. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబు నకును వచ్చెను.
43. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.