Genesis - ఆదికాండము 48 | View All
Study Bible (Beta)

1. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా,

1. ee sangathulaina tharuvaatha idigo nee thandri kaayilaagaa unnaadani okadu yoseputhoo cheppenu. Appudathadu manashshe ephraayimulu anu thana yiddaru kumaarulanu ventabettukoni pogaa,

2. ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను.

2. idigo nee kumaarudaina yosepu nee yoddhaku vachuchunnaadani yaakobunaku telupabadenu. Anthata ishraayelu balamu techukoni thana manchamumeeda koorchundenu.

3. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి

3. yosepunu chuchi kanaanu dheshamandali loojulo sarvashakthigala dhevudu naaku kanabadi nannu aasheervadhinchi

4. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.
అపో. కార్యములు 7:3-5-45

4. idigo neeku santhaanaabhivruddhi pondinchi ninnu vistharimpachesi neevu janamula samooha magunatlu chesi, nee tharuvaatha nee santhaanamunaku ee dheshamunu nityasvaasthyamugaa icchedhanani selavicchenu.

5. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.

5. idigo nenu aigupthunaku nee yoddhaku raakamunupu aigupthu dheshamulo neeku puttina nee yiddaru kumaarulu naa biddale; roobenu shimyonulavale ephraayimu manashshe naa biddalai yunduru.

6. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.

6. vaari tharuvaatha neevu kanina santhaanamu needhe; vaaru thama sahodarula svaasthyamunubatti vaari pella choppuna piluvabaduduru.

7. పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.

7. paddhanaraamunundi nenu vachuchunnappudu, ephraathaaku inka kontha dooramuna nundagaa maargamuna raahelu kanaanu dheshamulo naa yeduta mruthi pondhenu. Akkada betlehemanu ephraathaa maargamuna nenu aamenu paathipettithinani yoseputhoo cheppenu.

8. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి - వీరెవరని అడుగగా

8. ishraayelu yosepu kumaarulanu chuchi-veerevarani adugagaa

9. యోసేపు - వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు - నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను.

9. yosepu-veeru naa kumaarulu, veerini ee dheshamandu dhevudu naa kanugrahinchenani thana thandrithoo cheppenu. Andukathadu-nenu vaarini deevinchutaku naa daggaraku vaarini theesikonirammanenu.

10. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.

10. ishraayelu kannulu vruddhaapyamuvalana mandamugaa undenu ganuka athadu choodaleka poyenu. Yosepuvaarini athani daggaraku theesikonivachinappudu athadu vaarini muddu pettukoni kaugilinchukonenu.

11. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా

11. ishraayelu yose puthoonee mukhamu chuchedhanani nenu anukonaledu gaani nee santhaanamunu dhevudu naaku kanuparachiyunnaadanagaa

12. యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

12. yosepu athani mokaalla madhyanundi vaarini theesikoni athaniki saashtaanga namaskaaramu chesenu.

13. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసి కొనివచ్చెను.

13. tharuvaatha yosepu ishraayelu edamachethi thattuna thana kudichetha ephraayimunu, ishraayelu kudichethi thattuna thana yedama chetha manashshenu pattukoni vaariniddarini athani daggaraku theesi konivacchenu.

14. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.

14. manashshe peddavaadainanduna ishraayelu thana chethulanu yukthigaa chaachi chinnavaadaina ephraayimu thala meeda thana kudichethini manashshe thalameeda thana yedamachethini unchenu.

15. అతడు యోసేపును దీవించి - నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,
హెబ్రీయులకు 11:21

15. athadu yosepunu deevinchi-naa pitharulaina abraahaamu issaakulu evani yeduta naduchuchundiro aa dhevudu, nenu puttinadhi modalukoni netivarakunu evadu nannu poshincheno aa dhevudu,

16. అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
హెబ్రీయులకు 11:21

16. anagaa samasthamaina keedulalonundi nannu thappinchina dootha yee pillalanu aasheervadhinchunugaaka; naa perunu abraahaamu issaakulanu naa pitharula perunu vaariki pettabadunugaaka; bhoomiyandu vaaru bahugaa vistharinchudurugaaka ani cheppenu.

17. యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండియెత్తి

17. yosepu ephraayimu thalameeda thana thandri kudicheyyi pettuta chuchinappudu adhi athani kishtamu kaakapoyenu ganuka athadu manashshe thalameeda pettinchavalenani thana thandri cheyyi ephraayimu thalameedanundiyetthi

18. నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.

18. naa thandree atlu kaadu; ithade peddavaadu, nee kudicheyyi yithani thalameeda pettumani cheppenu.

19. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.

19. ayinanu athani thandri oppaka adhi naaku teliyunu, naa kumaarudaa adhi naaku teliyunu; ithadunu oka janasamoohamai goppavaadagunu gaani yithani thammudu ithani kante goppavaadagunu, athani santhaanamu janamula samoohamagunani cheppenu.

20. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.

20. aa dinamandu athadu vaarini deevinchi ephraayimuvalenu manashshevalenu dhevudu ninnu cheyunu gaakani ishraayeleeyulu nee peru cheppi deevinchedharanenu. aalaagu athadu manashshekante ephraayimunu mundhugaa unchenu.

21. మరియఇశ్రాయేలు - ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.

21. mariyu ishraayelu-idigo nenu chanipovuchunnaanu, ayinanu dhevudu meeku thoodaiyundi mee pitharula dheshamunaku mimmunu marala theesikoni povunu.

22. నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.
యోహాను 4:5

22. nenu nee sahodarulakante neeku oka bhaagamu ekkuvagaa ichithini. adhi naa katthithoonu naa vintithoonu amoreeyula chethilonundi theesikontinani yoseputhoo cheppenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 48 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
జోసెఫ్ మరణిస్తున్న తన తండ్రిని సందర్శించాడు. (1-7) 
దేవుణ్ణి నమ్మే వ్యక్తులు మరణిస్తున్నప్పుడు, మరణం గురించి లేదా తీవ్రమైన విషయాల గురించి పెద్దగా ఆలోచించని యువకులపై అది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. తగినట్లు ఉంటే పిల్లలు అక్కడ ఉండటం మంచిది. మనం చనిపోయే ముందు దేవుడు మనకు ఎంత ఉద్దేశించాడో ఇతరులకు చెప్పడం మరియు మనం ఆయనను ఎంతగా విశ్వసిస్తున్నామో చూపించే విధంగా జీవించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కొంతమంది విశ్వాసులు తాము చనిపోయినప్పుడు ఇతరులకన్నా ఎక్కువ ఓదార్పును మరియు సంతోషాన్ని అనుభవిస్తారు. బైబిల్ నుండి ఒక కథనంలో, యాకోబు అనే వ్యక్తి వారి తండ్రి చనిపోయిన తర్వాత తన మనవళ్లను చూసుకున్నాడు. కానీ వారు తమ తండ్రిలాగా ఈజిప్టులో చాలా శక్తివంతంగా లేదా ముఖ్యమైనవారు కావాలని యాకోబు కోరుకోలేదు. చనిపోవబోతున్న వృద్ధుడు కొంతమంది యౌవనస్థులకు దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన వాటిని వారసత్వంగా పొందేందుకు దేవుని మార్గాలను అనుసరించమని నేర్పించాడు. వారిని తమ సొంత గ్రూపులకు నాయకులను చేశాడు. ప్రజలు తమ వద్ద ఎక్కువ డబ్బు లేకపోయినా లేదా జనాదరణ పొందకపోయినా దేవుణ్ణి అనుసరించడం చాలా మంచిది. యాకోబు ఎఫ్రాయిమ్ మరియు మనష్షేలకు ప్రపంచంలో ముఖ్యమైనవి కానప్పటికీ చర్చిలో భాగం కావడం మంచిదని చెప్పాడు. 

యాకోబు జోసెఫ్ కుమారులను ఆశీర్వదించాడు. (8-22)
జోసెఫ్ మరియు యాకోబు అనే ఇద్దరు మంచి వ్యక్తులు ఉన్నారు, వారి జీవితంలో మంచి ప్రతిదీ దేవుని నుండి వచ్చిందని నమ్ముతారు. తన పిల్లలు దేవుడిచ్చిన బహుమానమని జోసెఫ్ చెప్పగా, దేవుడు తనను ఎప్పుడూ చూసుకునేవాడని యాకోబు చెప్పాడు. కష్టతరమైనప్పటికీ, దేవుడు అతనిని సురక్షితంగా ఉంచాడు. ఇప్పుడు యాకోబు ముసలివాడు మరియు మరణిస్తున్నాడు, అతను అన్ని చెడు విషయాల నుండి శాశ్వతంగా రక్షించబడ్డాడని భావించాడు. బైబిల్‌లో, చెడు విషయాల నుండి రక్షించబడడాన్ని విమోచనం అని ఎలా పిలుస్తారు మరియు అది యేసు ద్వారా జరుగుతుంది. ఒకసారి, యాకోబు జోసెఫ్ ఇద్దరు కుమారులను ఆశీర్వదించాడు, అయితే అతను అలా చేస్తున్నప్పుడు అతని చేతులు దాటాడు. మొదటి బిడ్డను ఆశీర్వదించడానికి జోసెఫ్ తన తండ్రి చేతులను కదిలించాలనుకున్నాడు, కానీ యాకోబు ఉద్దేశపూర్వకంగా చేసాడు ఎందుకంటే అతనికి దేవుని నుండి దర్శనం ఉంది. దేవుడు వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ఆశీర్వాదాలను ఇస్తాడు, కొన్నిసార్లు వాటిని స్వీకరించడానికి అవకాశం లేని వారికి ఎక్కువ ఇస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ అత్యంత శక్తివంతమైన లేదా జనాదరణ పొందిన వ్యక్తులను ఎన్నుకోడు, కానీ అతను ఇష్టపడే వారిని ఎన్నుకుంటాడు. ఈ ప్రపంచంలో ధనవంతులు మాత్రమే ఉన్నవారు పేదవారు మరియు మరణానంతరం మంచి విషయాలపై ఆశ లేనివారు చాలా సంతోషంగా ఉంటారు. 



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |