Esther - ఎస్తేరు 1 | View All
Study Bible (Beta)

1. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.

1. This is the story of something that happened in the time of Xerxes, the Xerxes who ruled from India to Ethiopia--127 provinces in all.

2. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్యపరిపాలన చేయుచుండగా

2. King Xerxes ruled from his royal throne in the palace complex of Susa.

3. తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా

3. In the third year of his reign he gave a banquet for all his officials and ministers. The military brass of Persia and Media were also there, along with the princes and governors of the provinces.

4. అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.

4. For six months he put on exhibit the huge wealth of his empire and its stunningly beautiful royal splendors.

5. ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను.

5. At the conclusion of the exhibit, the king threw a weeklong party for everyone living in Susa, the capital--important and unimportant alike. The party was in the garden courtyard of the king's summer house.

6. అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభ ములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.

6. The courtyard was elaborately decorated with white and blue cotton curtains tied with linen and purple cords to silver rings on marble columns. Silver and gold couches were arranged on a mosaic pavement of porphyry, marble, mother-of-pearl, and colored stones.

7. అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.

7. Drinks were served in gold chalices, each chalice one-of-a-kind. The royal wine flowed freely--a generous king!

8. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను.

8. The guests could drink as much as they liked--king's orders!--with waiters at their elbows to refill the drinks.

9. రాణియైన వష్తి కూడ రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను.

9. Meanwhile, Queen Vashti was throwing a separate party for women inside King Xerxes' royal palace.

10. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కను పరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు

10. On the seventh day of the party, the king, high on the wine, ordered the seven eunuchs who were his personal servants (Mehuman, Biztha, Harbona, Bigtha, Abagtha, Zethar, and Carcas)

11. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి.

11. to bring him Queen Vashti resplendent in her royal crown. He wanted to show off her beauty to the guests and officials. She was extremely good-looking.

12. రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.

12. But Queen Vashti refused to come, refused the summons delivered by the eunuchs. The king lost his temper. Seething with anger over her insolence,

13. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక

13. the king called in his counselors, all experts in legal matters. It was the king's practice to consult his expert advisors.

14. అతడు కాలజ్ఞానులను చూచిరాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.

14. Those closest to him were Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, and Memucan, the seven highest-ranking princes of Persia and Media, the inner circle with access to the king's ear.

15. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగాకర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనువారు.

15. He asked them what legal recourse they had against Queen Vashti for not obeying King Xerxes' summons delivered by the eunuchs.

16. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.

16. Memucan spoke up in the council of the king and princes: 'It's not only the king Queen Vashti has insulted, it's all of us, leaders and people alike in every last one of King Xerxes' provinces.

17. ఏల యనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దానివిని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.

17. The word's going to get out: 'Did you hear the latest about Queen Vashti? King Xerxes ordered her to be brought before him and she wouldn't do it!' When the women hear it, they'll start treating their husbands with contempt.

18. మరియు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమా చారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.

18. The day the wives of the Persian and Mede officials get wind of the queen's insolence, they'll be out of control. Is that what we want, a country of angry women who don't know their place?

19. రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియవష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.

19. 'So, if the king agrees, let him pronounce a royal ruling and have it recorded in the laws of the Persians and Medes so that it cannot be revoked, that Vashti is permanently banned from King Xerxes' presence. And then let the king give her royal position to a woman who knows her place.

20. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘనురాలు గాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.

20. When the king's ruling becomes public knowledge throughout the kingdom, extensive as it is, every woman, regardless of her social position, will show proper respect to her husband.'

21. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.

21. The king and the princes liked this. The king did what Memucan proposed.

22. ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.

22. He sent bulletins to every part of the kingdom, to each province in its own script, to each people in their own language: 'Every man is master of his own house; whatever he says, goes.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Esther - ఎస్తేరు 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అహష్వేరోషు యొక్క రాజ విందు. (1-9) 
అహష్వేరోషు హృదయాన్ని గర్వంతో నింపిన అతని రాజ్యం యొక్క వైభవంతో, అతను ఒక విపరీతమైన విందును, వ్యర్థమైన కీర్తిని ప్రదర్శించాడు. ప్రశాంతతలో ఉండే మూలికలతో కూడిన సాధారణ విందు ఈ విలాసవంతమైన వైన్ విందు కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది, దానితో పాటు విఘాతం కలిగించే కోలాహలం మరియు గందరగోళం ఉంటుంది. హృదయంలో దయ యొక్క ప్రభావం లేకుండా, స్వీయ-ప్రాముఖ్యత మరియు మితిమీరిన తృప్తి పట్ల మొగ్గు స్థిరంగా రాజ్యమేలుతుంది, వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. అయితే, ఎవరినీ బలవంతం చేయలేదు, అంటే ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, అది వారి స్వంత ఇష్టం. విశ్వాసం లేని పాలకుడి నుండి ఈ వివేకవంతమైన సలహా క్రైస్తవులుగా గుర్తించబడే అనేకమందికి మందలింపుగా ఉపయోగపడుతుంది. ఈ వ్యక్తులు, మంచి ఆరోగ్యం కోసం టోస్టింగ్ ముసుగులో, అనుకోకుండా పాపం మరియు దానితో పాటుగా మరణాన్ని ప్రోత్సహిస్తారు. అటువంటి చర్యలలో పాల్గొనే వారికి భయంకరమైన హెచ్చరిక వస్తుంది; వారు దానిని చదివి భయపడాలి- హబక్కూకు 2:15-16.

కనిపించడానికి వష్టి నిరాకరించడం, రాజు యొక్క శాసనం. (10-22)
అహష్వేరోషు యొక్క విపరీతమైన విందు, అతని స్వంత అవివేకం ఫలితంగా దుఃఖంతో ముగిసింది. ప్రత్యేక వేడుకల క్షణాలు తరచుగా నిరాశతో ముగుస్తాయి. అధికారంలో ఉన్నవారు సహేతుకంగా విస్మరించబడే ఆదేశాలను జారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ, మద్యం సేవించినప్పుడు, హేతుబద్ధత తరచుగా వ్యక్తులను తప్పించుకుంటుంది. 127 ప్రావిన్సులపై ఆధిపత్యం వహించిన వ్యక్తి కూడా తన స్వంత భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. ఈ ఉత్తర్వు రాజు వ్యక్తిగత కోరికలు లేదా వ్యూహాత్మక లక్ష్యాలకు ఉపయోగపడిందా, ఎస్తేర్ సింహాసనాన్ని అధిరోహించడానికి దైవిక ప్రావిడెన్స్ మార్గం సుగమం చేసింది. అది హామాన్ యొక్క దుష్ట పథకాన్ని అతని హృదయంలో పాతుకుపోకముందే, అతను అధికారం చేపట్టకముందే దానిని అడ్డుకుంది. ప్రభువు సార్వభౌమాధికారుడని మరియు అతని ప్రజల శ్రేయస్సు మరియు సంతోషంతో పాటు మానవ మూర్ఖత్వాన్ని లేదా పిచ్చితనాన్ని ఆయన మహిమను అభివృద్ధి చేసే సాధనంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని మనం ఆనందాన్ని పొందుతాము.



Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |