Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్యవలెను.లూకా 19:8
నిర్గమకాండము 20:15 2 సమూయేలు 12:6 లూకా 19:8.
2. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.
రాత్రివేళ ఇంట్లో దొంగలు పడితే ఆ ఇంటి యజమాని తనమీదికి వచ్చిన ప్రమాదం వల్ల భయపడి ఆత్మరక్షణకోసం ఆ దొంగను దెబ్బ తియ్యడం తప్పు కాదు.
3. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.
4. వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱెయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండం తలు చెల్లింపవలెను.
5. ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను.
6. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.
7. ఒకడు సొమ్మయినను సామానై నను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినయెడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను;
లేవీయకాండము 16:1-7.
8. ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను.
“దేవుని ప్రతినిధులు”– నిర్గమకాండము 21:6. హీబ్రూ భాషలో “దేవుళ్ళు” అని ఉంది. కీర్తనల గ్రంథము 82:1-2 నోట్.
9. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱెను గూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొన వలెను.
10. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,
11. వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు.హెబ్రీయులకు 6:16
హెబ్రీయులకు 6:16.
12. అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను.
13. అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.
14. ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసికొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను.
15. దాని యజమానుడు దానితో నుండిన యెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన యెడల అది దాని అద్దెకు వచ్చెను.
16. ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.
ద్వితీయోపదేశకాండము 22:28-29. ఇస్రాయేల్జాతిలో పెళ్ళి చేసుకోగోరినవాడు తన మామగారికి ఓలి ఇవ్వాలి. భారతదేశంలో నేడు ఉన్న ఆచారానికి ఇది సరిగ్గా వ్యతిరేకం.
17. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
18. శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
లేవీయకాండము 19:31 లేవీయకాండము 20:6 లేవీయకాండము 20:27 ద్వితీయోపదేశకాండము 18:10-11 యిర్మియా 27:9-10. మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు దేవుని సేవకులు కాదు. వారికీ దేవునికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఇలాంటి వారి వ్యవహారాలు ప్రజలను దేవుని సత్యంనుంచీ నిజ దేవుని నుంచీ ప్రక్కదారి పట్టిస్తుంటాయి. ఇలాంటి ప్
19. మృగసంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
లేవీయకాండము 18:23 లేవీయకాండము 20:15-16 ద్వితీయోపదేశకాండము 27:21.
20. యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
నిర్గమకాండము 32:8 నిర్గమకాండము 34:15 లేవీయకాండము 17:7 సంఖ్యాకాండము 25:2 ద్వితీయోపదేశకాండము 17:2-3 ద్వితీయోపదేశకాండము 17:5 1 రాజులు 18:40 2 రాజులు 10:25 1 కోరింథీయులకు 10:20. ఈ పాపానికి శిక్ష బహు కఠినమైనది. ఎందుకంటే ఇది పది ఆజ్ఞలలో మొదటిదీ అతి ప్రధానమైనదీ అయిన ఆజ్ఞను మీరడం (నిర్గమకాండము 20:3). సృష్టికర్త అయిన దేవుడు ఆరాధన
21. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా.
నిర్గమకాండము 23:9 లేవీయకాండము 19:33-34 లేవీయకాండము 25:35 ద్వితీయోపదేశకాండము 1:16 ద్వితీయోపదేశకాండము 10:19 ద్వితీయోపదేశకాండము 27:19.
22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.
ద్వితీయోపదేశకాండము 24:17-18 కీర్తనల గ్రంథము 68:5 కీర్తనల గ్రంథము 82:1-4 సామెతలు 23:10-11 యిర్మియా 9:24. బైబిల్లోని దేవుడు (ఏకైక నిజ దేవుడు) న్యాయమంటే ఎంతో ఇష్టమున్నవాడు. బలహీనులను, నిస్సహాయులను బాధించేవారిని శిక్షిస్తాడు. అన్యాయం దేవునికి కోపం కలిగిస్తుంది. “దేవుని కోపం” గురించి నోట్స్ {Num,
23. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
24. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేనివారగుదురు.
25. నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.
లేవీయకాండము 25:35-37 ద్వితీయోపదేశకాండము 15:7-11 ద్వితీయోపదేశకాండము 23:19-20 నెహెమ్యా 5:7 కీర్తనల గ్రంథము 15:5.
26. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్పగించుము.
ఇంత అల్పమైన విషయాలను కూడా దేవుడు చూస్తాడు. ఆయన ఇలాంటివాటిని కూడా పట్టించుకుంటాడు.
27. వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహమునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
28. నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు.అపో. కార్యములు 23:5
లేవీయకాండము 24:15-16 అపో. కార్యములు 23:5.
29. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయ కూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.
వారి ఆలోచనల్లో దేవునికి ప్రథమ స్థానం ఉండాలి. పంట పొలాలనూ వర్షాన్నీ ఫలసాయాన్నీ ఇచ్చేది దేవుడే. ఆయన్ను గుర్తుచేసుకొంటూ ఆరాధిస్తూ ఉండాలి (నిర్గమకాండము 23:16 నిర్గమకాండము 23:19 ద్వితీయోపదేశకాండము 26:2-11 సామెతలు 3:9 మలాకీ 3:10).
30. అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవ దినమున దానిని నాకియ్యవలెను.
31. మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను.
నిర్గమకాండము 19:6 లేవీయకాండము 11:44 లేవీయకాండము 19:2.