Jeremiah - యిర్మియా 33 | View All

1. మరియయిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. And the Word of Jehovah came unto Jeremiah the second time, while he was still shut up in the court of the guard, saying,

2. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు

2. Thus says Jehovah the Maker, Jehovah who formed it in order to establish it; Jehovah is His name:

3. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.

3. Call unto Me, and I will answer you, and show you great and unfathomable things which you do not know.

4. ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా

4. For thus says Jehovah the God of Israel, concerning the houses of this city, and concerning the houses of the kings of Judah, which are broken down to fortify against the siege mounds and the sword:

5. కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా

5. They come to fight with the Chaldeans, only to fill them with the dead bodies of the men whom I have slain in My anger and in My fury, for all whose evil I have hidden My face from this city.

6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

6. Behold, I will bring it health and healing, and I will heal them and will show them the abundance of peace and truth.

7. చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను.

7. And I will cause the captives of Judah and the captives of Israel to return, and will build them, as at the first.

8. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.

8. And I will cleanse them from all their iniquity by which they have sinned against Me; and I will pardon all their iniquities by which they have sinned, and by which they have transgressed against Me.

9. భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.

9. And it shall be to Me a name of joy, a praise and an honor before all the nations of the earth, who shall hear all the good that I do to them. And they shall fear and tremble for all the goodness and for all the welfare that I am bringing to it.

10. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే,

10. Thus says Jehovah: Again there shall be heard in this place, which you say is desolate without man and without beast, even in the cities of Judah, and in the streets of Jerusalem that are desolate without man, and without inhabitant, and without beast;

11. సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు

11. the voice of joy and the voice of gladness, the voice of the bridegroom and the voice of the bride, the voice of those who shall say, Praise Jehovah of Hosts, for Jehovah is good, for His mercy is eternal; and the voice of those who shall bring the sacrifice of praise into the house of Jehovah. For I will cause the captives of the land to return, as at the first, says Jehovah.

12. సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.

12. Thus says Jehovah of Hosts: Again in this place which is desolate without man and without beast, and in all its cities, there shall be a dwelling place of shepherds causing their flocks to lie down.

13. మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

13. In the cities of the mountains, in the cities of the valley, and in the cities of the south, and in the land of Benjamin, and in the places around Jerusalem, and in the cities of Judah, shall the flocks pass again under the hands of him who counts them, says Jehovah.

14. యెహోవా వాక్కు ఇదే ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.

14. Behold, the days are coming, says Jehovah, that I will establish the good thing which I have promised to the house of Israel and to the house of Judah.

15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
యోహాను 7:42

15. In those days, and at that time, I will cause the Branch of Righteousness to grow up to David; and He shall execute justice and righteousness in the land.

16. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.

16. In those days Judah shall be saved, and Jerusalem shall dwell safely. And this is the name by which she shall be called: JEHOVAH OUR RIGHTEOUSNESS.

17. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.

17. For thus says Jehovah, David shall never lack a man to sit on the throne of the house of Israel,

18. ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.

18. nor shall the priests, the Levites, lack a man before Me to offer burnt offerings, and to kindle grain offerings, and to sacrifice continually.

19. మరియయెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

19. And the Word of Jehovah came unto Jeremiah, saying,

20. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

20. Thus says Jehovah: If you can break My covenant of the day and My covenant of the night, so that there should not be day and night in their season,

21. నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.

21. then also may My covenant with David My servant be broken, that he should not have a son to reign on his throne, and with the Levites the priests, My ministers.

22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.

22. As the host of the heavens cannot be numbered, nor the sand of the sea measured, so I will multiply the seed of David My servant and the Levites who serve Me.

23. మరియయెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

23. Moreover the Word of Jehovah came unto Jeremiah, saying,

24. తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొనుమాట నీకు వినబడుచున్నది గదా.

24. Do you not consider what this people have spoken, saying, The two families which Jehovah has chosen, He has even cast them off? Thus they have despised My people, that they should no more be a nation before them.

25. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల

25. Thus says Jehovah: If My covenant is not with day and night, and if I have not appointed the ordinances of the heavens and the earth,

26. భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.

26. then I will cast away the seed of Jacob, and David My servant, so that I will not take any of his seed to be rulers over the seed of Abraham, Isaac, and Jacob. For I will bring back their captives, and have mercy on them.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 33 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదుల పునరుద్ధరణ. (1-13) 
దేవుని నుండి ఓదార్పును పొందాలని ఎదురుచూసే వారు తప్పనిసరిగా ఆయనను పిలుచుకోవడంలో నిమగ్నమై ఉండాలి. ఈ వాగ్దానాలు ప్రార్థన యొక్క అవసరాన్ని తొలగించడానికి ఉద్దేశించినవి కావు, బదులుగా దానిని ఉత్తేజపరిచేందుకు మరియు ధైర్యాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి. అవి క్రీస్తు బోధనలకు మార్గదర్శకంగా పనిచేస్తాయి, దీనిలో దేవుడు మనకు మార్గనిర్దేశం చేసేందుకు మరియు మనకు ప్రశాంతతను అందించడానికి సత్యాన్ని వెల్లడించాడు. కృపను పరిశుద్ధపరచడం మరియు క్షమించడం ద్వారా పాపం యొక్క అపవిత్రత నుండి శుద్ధి చేయబడిన వారందరూ అపరాధం నుండి విముక్తి పొందారు. పాపులు ప్రభువైన యేసు నామంలో మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధంగా సమర్థించబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడినప్పుడు, వారు దేవుని ముందు ప్రశాంతత మరియు నైతిక స్వచ్ఛతతో జీవించే సామర్థ్యాన్ని పొందుతారు. అనేకులు దేవుని ప్రజలకు మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య ఉన్న నిజమైన వ్యత్యాసాన్ని గుర్తించడానికి మరియు దైవిక ఉగ్రత పట్ల భక్తితో కూడిన భయాన్ని కలిగి ఉండటానికి దారితీయబడ్డారు. సుదీర్ఘమైన దుఃఖాన్ని అనుభవించిన వారు మరోసారి పొంగిపొర్లుతున్న ఆనందాన్ని అనుభవిస్తారని ప్రతిజ్ఞ చేయబడింది. ప్రభువు నీతి మరియు శాంతిని అందించే చోట, అతను ప్రాపంచిక అవసరాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కూడా అందిస్తాడు మరియు మన దగ్గర ఉన్న ప్రతిదీ వాక్యం ద్వారా మరియు ప్రార్థన ద్వారా పవిత్రం చేయబడి, ఓదార్పు మూలాలుగా మారుతుంది.

మెస్సీయ వాగ్దానం చేశాడు; అతని కాలం యొక్క ఆనందం. (14-26)
దేవుడు రిజర్వ్‌లో ఉన్న ఆశీర్వాదాలను మెరుగుపరచడానికి, మెస్సీయ యొక్క వాగ్దానం ఉంది. అతను తన చర్చికి నీతిని ప్రసాదిస్తాడు, ఎందుకంటే అతను మన నీతిగా దేవునిచే నియమించబడ్డాడు మరియు విశ్వాసులు అతనిలో దేవుని నీతిని అందించారు. క్రీస్తు మన ప్రభువైన దేవుడు, మన నీతి, మన పవిత్రీకరణ మరియు మన విమోచనగా పనిచేస్తాడు. అతని రాజ్యం శాశ్వతం. అయితే, ఈ ప్రపంచంలో, శ్రేయస్సు మరియు ప్రతికూలతలు ఒకదానికొకటి అనుసరిస్తాయి, కాంతి మరియు చీకటి వలె, పగలు మరియు రాత్రి. యాజకత్వం యొక్క ఒడంబడిక సమర్థించబడుతుంది. నిజమైన విశ్వాసులందరూ తమను తాము సజీవ బలులుగా ప్రారంభించి, దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పిస్తూ, ఒక పవిత్ర యాజకవర్గం, రాజ యాజకవర్గం. ఈ ఒడంబడిక యొక్క వాగ్దానాలు ఇజ్రాయెల్ సువార్తలో పూర్తిగా గ్రహించబడతాయి. గలతీయులకు 6:16లో చెప్పినట్లుగా, సువార్త సూత్రాల ప్రకారం నడుచుకునే వారందరూ దేవుని ఇశ్రాయేలుగా పరిగణించబడతారు మరియు వారిపై శాంతి మరియు దయ ఉంటుంది. ఒకప్పుడు దేవుడు ఎన్నుకున్న కుటుంబాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు అనిపించినా వాటిని విస్మరించవద్దు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |