Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
2. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు
యిర్మియా 10:12; యిర్మియా 32:17; యిర్మియా 51:15.
3. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
బైబిల్లోని యెహోవా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాన్ని సృష్టించినవానికి చేస్తున్నామన్న మాట. యిర్మీయాలాగా నమ్మకం నిండిన యథార్థ హృదయంలోనుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు సోకుతుంది. అద్భుతమైన జవాబులు వస్తాయి (కీర్తనల గ్రంథము 3:4; కీర్తనల గ్రంథము 4:3; కీర్తనల గ్రంథము 18:6; కీర్తనల గ్రంథము 27:7; కీర్తనల గ్రంథము 28:1-2; కీర్తనల గ్రంథము 30:8; కీర్తనల గ్రంథము 55:17; మత్తయి 7:7; యాకోబు 5:16). దేవుడు పలుకుతున్న, మానవ జ్ఞానానికి అందని గూఢమైన గొప్ప విషయాలు ఈ అధ్యాయంలో రాసిపెట్టి ఉన్నాయి.
4. ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా
5. కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా
యిర్మియా 32:31.
6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.
యిర్మియా 30:17.
7. చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను.
యిర్మియా 29:14; యిర్మియా 30:3.
8. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.
యిర్మియా 31:34.
9. భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.
యిర్మియా 3:17.
10. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే,
11. సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
కీర్తనల గ్రంథము 136:1.
12. సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.
13. మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
14. యెహోవా వాక్కు ఇదే ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.
దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చకుండా ఉండడని భావించేందుకు సంశయం అక్కర్లేదు (1 రాజులు 8:56; తీతుకు 1:2; హెబ్రీయులకు 6:18).
15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.యోహాను 7:42
ఈ వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు గురించినవి. యిర్మియా 23:5-6 నోట్స్ చూడండి. యూదాకు, ఇస్రాయేల్కు దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ వారు బబులోనునుండి తిరిగి వచ్చిన సందర్భంలో పూర్తిగా నెరవేరలేదు.
16. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.
17. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.
2 సమూయేలు 7:13; 2 దినవృత్తాంతములు 7:18; కీర్తనల గ్రంథము 89:29-37; లూకా 1:31-33.
18. ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.
మానవావతారుడుగా యేసుక్రీస్తు దావీదు వంశీకుడు. అందువల్ల దావీదు సింహాసనాన్నెక్కే హక్కు గలవాడు. ఇక్కడి మాటలను యేసుప్రభువు ఎలా నెరవేర్చగలడో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయన లేవీ వంశస్థుడు కాదు. అహరోను యాజిధర్మం కొనసాగింపులో యేసుప్రభువు లేడు. ఆయన మెల్కీసెదెక్ క్రమం ప్రకారం యాజి (హెబ్రీయులకు 7:11-22). క్రొత్త ఒడంబడికలో విశ్వాసులంతా యాజులే (1 పేతురు 2:5, 1 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 1:6). అయితే వారెవరికీ లేవీతో సంబంధం లేదు. ఈ వచనం ప్రస్తుతం మనకు తెలియని విధంగా నెరవేరబోతుందేమో అనుకోవచ్చు (యెహెఙ్కేలు 40:44-46 పోల్చి చూడండి).
19. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
యిర్మియా 31:35-37 పోల్చి చూడండి.
20. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల
21. నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.
22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.
ఆదికాండము 22:17; ఆదికాండము 26:4; ఆదికాండము 32:12.
23. మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
యిర్మియా 31:35-37; యిర్మియా 33:19-22.
24. తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొనుమాట నీకు వినబడుచున్నది గదా.
25. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల
26. భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
“అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానాన్ని”అనే మాటలు, వారి శారీరికమైన వంశ సంబంధాన్ని సూచించినట్టుంది. 24వ వచనంలో ఈ రెండు వంశాలను అన్న మాటలు కూడా ఇంతే. అయితే క్రొత్త ఒడంబడికలో ఇతర జనాల్లోని విశ్వాసులు అబ్రాహాముకు ఆధ్యాత్మిక సంతానం (రోమీయులకు 4:11, రోమీయులకు 4:16-17; గలతియులకు 3:7, గలతియులకు 3:29). వీరిని అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతతి అనలేదు. వీరెన్నడూ ఇస్రాయేల్, లేక యూదా సామ్రాజ్యాల్లో వంశాలలో పాల్గొన్నవారు కాదు.