Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
ఈ అధ్యాయంలో ఒక ఉదాహరణ (వ 3-10), దాని వివరణ (వ 11-21) ఉన్నాయి. ఈ ఉదాహరణలో గరుడపక్షి (వ 3) బబులోను రాజైన నెబుకద్నెజరు (వ 12; యిర్మియా 48:40; యిర్మియా 49:22; దానియేలు 7:4). లెబానోను అంటే జెరుసలం. దేవదారు అంటే దావీదు రాజ వంశం. పై కొమ్మ అంటే బబులోనుకు బందీగా వెళ్ళిన యెహోయాకీనురాజు. “వర్తకుల దేశం” (వ 4) అంటే బబులోను. “విత్తనం” (వ 5) అంటే యూదా దేశంలో ఉండిపోయిన సిద్కియా. నెబుకద్నెజరు అతణ్ణి రాజుగా నియమించాడు. 6 వ వచనంలో ఈ విత్తనం ద్రాక్ష చెట్టు అయింది (15 అధ్యాయం). “దేవదారు చెట్టు” యూదా తన పూర్వస్థితికి చేరేంతవరకూ బబులోనులో పెరిగింది. వ 7లో ఉన్న “గరుడ పక్షి” ఈజిప్ట్ రాజు ఫరో. సిద్కియా సహాయం కోసం ఫరోను అర్థించాడు అయితే ఇదంతా వ్యర్థమైపోతుంది (వ 9,10,17).
2. నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
3. నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.
4. అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను.
5. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.
6. అది చిగిర్చిపైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్థిల్లి రెమ్మలువేసెను.
7. పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువలోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను.
8. కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా?
9. అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపుచేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు.
10. అది నాటబడినను వృద్ధిపొందునా? తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే యెండిపోవును.
11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
12. తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.
13. మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండునట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
“ఒకణ్ణి”– సిద్కియా. “శపథం”– 2 దినవృత్తాంతములు 30:13.
14. అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను.
“గొప్ప వాళ్ళు”– 2 రాజులు 24:15-17.
15. అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యమునిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు
సిద్కియా నెబుకద్నెజరుతో చేసుకొన్న సంధినీ అతణ్ణి సేవిస్తానని చేసిన ఒప్పందాన్నీ మీరినందువల్ల అతడు దండనకు పాత్రుడయ్యాడు. ఈ ఒప్పందాన్ని అతడు తన దేశంపైకి దండెత్తిన ఒక విదేశీయుడితో చేసినప్పటికీ దాన్ని భంగపరచే హక్కు అతనికి లేదు. నిజం పలకడం ఎంత ప్రాముఖ్యమో దేవుడిక్కడ మరోసారి నొక్కి చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 15:2 చూడండి.
16. ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
17. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.
18. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.
19. ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపుదును,
సిద్కియా తిరుగుబాటు, శిక్ష 2 రాజులు 25:1-7 లోనూ యిర్మియా 52:1-11 లోనూ రాసి ఉన్నాయి.
20. అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.
21. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలిసికొనునట్లు అతని దండువారిలో తప్పించుకొని పారి పోయినవారందరును ఖడ్గముచేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు.
22. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తయిన దేవదారు వృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నత పర్వతముమీద దాని నాటుదును.మత్తయి 13:32, మార్కు 4:32, లూకా 13:19
నెబుకద్నెజరు దేవదారు కొమ్మనూ, యూదానుండి తెచ్చిన విత్తనాన్నీ నాటాడు (వ 4,5). ఇక్కడ దేవుడు తానే నాటేవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. దేవదారు చెట్టునుండి (అంటే దావీదు వంశంనుండి) లేత కొమ్మను తీసి బబులోనులో కాదు, ఇస్రాయేల్లోనే ఒక ఎత్తయిన పర్వతం (సీయోను పర్వతం) పై నాటుతానంటున్నాడు. యెషయా 4:2; యెషయా 11:1; యెషయా 53:2; జెకర్యా 3:8; జెకర్యా 6:12 పోల్చిచూడండి. ఇది ఇస్రాయేల్ను పూర్వస్థితికి తిరిగి తెస్తాననీ దావీదు రాజవంశం తిరిగి వన్నెకెక్కుతుందనీ దేవుడిస్తున్న వాగ్దానం. ప్రవాసులు జెరుబ్బాబెలు నాయకత్వంలో తమ దేశానికి తిరిగి వచ్చినప్పుడు (ఎజ్రా 2:2; నెహెమ్యా 7:7) ఇది కొంతమట్టుకు నెరవేరి వుండవచ్చు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది మెస్సీయ, ప్రభువూ అయిన యేసు క్రీస్తు అనుకోవడంలో పొరపాటు లేదు గదా.
23. ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.మత్తయి 13:32, మార్కు 4:32
“పక్షులు”– మార్కు 4:32.
24. దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.
“కూలుస్తాననీ”– 1 సమూయేలు 2:7-8; యెషయా 2:12-13; లూకా 1:52 చూడండి. “చెట్లన్నీ”– అన్నీ జనాల రాజులు.