Ezekiel - యెహెఙ్కేలు 42 | View All

1. అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.

1. Then he led me out into the inner court, toward the north, and he brought me to the chambers which were opposite the temple yard and opposite the building on the north.

2. ఆ కట్టడము నూరు మూరల నిడివిగలదై ఉత్తరదిక్కున వాకిలికలిగి యేబది మూరల వెడల్పుగలది.

2. The length of the building which was on the north side was a hundred cubits, and the breadth fifty cubits.

3. ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చప్టాకెదురుగాను మూడవ అంతస్థులోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.

3. Adjoining the twenty cubits which belonged to the inner court, and facing the pavement which belonged to the outer court, was gallery against gallery in three stories.

4. గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముండెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.

4. And before the chambers was a passage inward, ten cubits wide and a hundred cubits long, and their doors were on the north.

5. వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను.

5. Now the upper chambers were narrower, for the galleries took more away from them than from the lower and middle chambers in the building.

6. మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.

6. For they were in three stories, and they had no pillars like the pillars of the outer court; hence the upper chambers were set back from the ground more than the lower and the middle ones.

7. మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొకగోడ కట్టబడియుండెను.

7. And there was a wall outside parallel to the chambers, toward the outer court, opposite the chambers, fifty cubits long.

8. బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.

8. For the chambers on the outer court were fifty cubits long, while those opposite the temple were a hundred cubits long.

9. ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.

9. Below these chambers was an entrance on the east side, as one enters them from the outer court,

10. విడిచోటునకు ఎదురుగాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టు కొన్ని గదులుండెను.

10. where the outside wall begins. On the south also, opposite the yard and opposite the building, there were chambers

11. మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గమువలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను.

11. with a passage in front of them; they were similar to the chambers on the north, of the same length and breadth, with the same exits and arrangements and doors.

12. మరియు మార్గపు మొగను దక్షిణపుతట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను.

12. And below the south chambers was an entrance on the east side, where one enters the passage, and opposite them was a dividing wall.

13. అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.

13. Then he said to me, 'The north chambers and the south chambers opposite the yard are the holy chambers, where the priests who approach the LORD shall eat the most holy offerings; there they shall put the most holy offerings -- the cereal offering, the sin offering, and the guilt offering, for the place is holy.

14. యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.

14. When the priests enter the holy place, they shall not go out of it into the outer court without laying there the garments in which they minister, for these are holy; they shall put on other garments before they go near to that which is for the people.'

15. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను.

15. Now when he had finished measuring the interior of the temple area, he led me out by the gate which faced east, and measured the temple area round about.

16. తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను.

16. He measured the east side with the measuring reed, five hundred cubits by the measuring reed.

17. ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును

17. Then he turned and measured the north side, five hundred cubits by the measuring reed.

18. దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,

18. Then he turned and measured the south side, five hundred cubits by the measuring reed.

19. పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను.

19. Then he turned to the west side and measured, five hundred cubits by the measuring reed.

20. నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.

20. He measured it on the four sides. It had a wall around it, five hundred cubits long and five hundred cubits broad, to make a separation between the holy and the common.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 42 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈ అధ్యాయం పూజారి గదులు, వాటి ఉద్దేశ్యం మరియు ఆలయం నిర్మించబడిన పవిత్ర పర్వత పరిమాణాన్ని వివరిస్తుంది. పూజారుల కోసం అనేక గదులు ఉండేవి. యేసు ఒకసారి వ్యాఖ్యానించినట్లుగా, "నా తండ్రి ఇంటిలో అనేక భవనాలు ఉన్నాయి," అదేవిధంగా, అతని భూసంబంధమైన నివాసంలో, అనేక గదులు ఉన్నాయి. విశ్వాసం ద్వారా, అనేకమంది అతని పవిత్ర స్థలంలో ఆశ్రయం పొందుతారు మరియు అక్కడ విస్తారమైన స్థలం ఉంటుంది. ఈ గదులు ఏకాంతంగా ఉన్నప్పటికీ, ఆలయానికి సమీపంలోనే ఉన్నాయి. ఈ గదులలోని మన ప్రైవేట్ మతపరమైన ఆచారాలు మనలను బహిరంగ ఆరాధనకు సిద్ధం చేయాలి మరియు మన భక్తిని పెంపొందించడంలో, మనకు అందించిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడతాయి.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |