13. అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.
ఇక్కడ మరోసారి సామాన్య ప్రజలనూ, ప్రత్యేకంగా యాజి ధర్మం జరిగించేవారినీ వేరు వేరుగా చెప్పడం కనిపిస్తున్నది. అలాంటి ప్రత్యేకమైన గదులు, ప్రత్యేకమైన భోజనం, వస్త్రాలు ఉన్నాయి. ఇది నేటి క్రొత్త ఒడంబడిక యుగంలోని సంఘానికి ఆధ్యాత్మికంగా వర్తించే అవకాశం కనిపించదు. అంతేగాక అనంత యుగాలలో దేవుడు తన విశ్వాసుల మధ్య నివసించేటప్పుడు కూడా ఇది వర్తించడం అసాధ్యం అనిపిస్తుంది.