Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఆ దినములలో, అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున
1. aa dinamulalo, anagaa yoodhaavaarini yerooshalemu kaapurasthulanu nenu cheralonundi rappinchu kaalamuna
2. అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.
2. anyajanulanandarini samakoorchi, yehoshaapaathu loyaloniki thoodukonipoyi, vaaru aa yaa dheshamula loniki naa svaasthyamagu ishraayeleeyulanu chedharagotti, naa dheshamunu thaamu panchukonutanubatti naa janula pakshamuna akkada nenu aa anyajanulathoo vyaajye maadudunu.
3. వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?
3. vaaru naa janulameeda chitluvesi, veshyaku badulugaa oka baaluni ichi draakshaarasamu konutakai yoka chinnadaanini ichi traaguchu vachiri gadaa?
4. తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నాకేమైన చేయుదురా?మత్తయి 11:21-22, లూకా 10:13-14
4. thooru pattanamaa, seedonupattanamaa, philishtheeya praantha vaasulaaraa, meethoo naaku paniyemi? Nenu chesinadaaniki meeru naaku prathikaaramu cheyuduraa? meeru naa kemaina cheyuduraa?
5. నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.
5. naa vendini naa bangaaramunu meeru pattukonipothiri; naaku priyamaina manchi vasthuvulanu pattukonipoyi mee gullalo unchukontiri.
6. యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.
6. yoodhaavaarini yerooshalemu pattanapuvaarini thama sarihaddulaku dooramugaa nivasimpajeyutakai meeru vaarini grekeeyulaku ammivesithiri; meeru chesinadaanini bahutvaragaa mee netthimeediki rappinchedanu.
7. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును
7. idigo meeru chesina daanini mee netthimeediki raajeyudunu; meeru vaarini ammi pampivesina aa yaa sthalamulalonundi nenu vaarini rappinthunu
8. మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును; వారు దూరముగా నిసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే.
8. mee kumaarulanu kumaarthelanu yoodhaavaariki ammiveyinthunu; vaaru dooramugaa niva sinchu janulaina shebaayeeyulaku vaarini ammivethuru; yehovaa selavichina maata yidhe.
9. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడిరావలెను.
9. anyajanulaku ee samaachaaramu prakatanacheyudi yuddhamu prathishthinchudi, balaadhyulanu repudi, yodhulandaru siddhapadi raavalenu.
10. మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను.
10. mee karrulu chedagotti khadgamulu cheyudi, mee potakatthulu chedagotti eetelu cheyudi; balaheenudu nenu balaadhyudanu anukona valenu.
11. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.
11. chuttupatlanunna anyajanulaaraa, tvarapadi randi; samakoodi randi. Yehovaa, nee paraakrama shaaluranu ikkadiki thoodukoni rammu.
12. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
12. naludikkulanunna anya janulaku theerpu theerchutakai nenu yehoshaapaathu loyalo aaseenudanagudunu; anyajanulu lechi acchatiki raavalenu
13. పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లిపారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగిరండి.మార్కు 4:29, ప్రకటన గ్రంథం 14:15-18-2, ప్రకటన గ్రంథం 19:15
13. pairu mudirinadhi, kodavalipetti koyudi; gaanuga nindiyunnadhi; totlu porli paaruchunnavi, janula doshamu atyadhika maayenu, meeru digi randi.
14. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.
14. theerpu theerchu loyalo raavalasina yehovaadhinamu vacche yunnadhi; theerpukai janulu gumpulu gumpulugaa koodi yunnaaru.
15. సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను.మత్తయి 24:29, మార్కు 13:24-25, ప్రకటన గ్రంథం 6:12-13, ప్రకటన గ్రంథం 8:12
15. soorya chandrulu thejoheenulairi; nakshatra mula kaanthi thappipoyenu.
16. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
16. yehovaa seeyonulo nundi garjinchuchunnaadu; yerooshalemulonundi thana svaramu vinabadajeyuchunnaadu; bhoomyaakaashamulu vanakuchunnavi. Ayithe yehovaa thana janulaku aashraya magunu, ishraayeleeyulaku durgamugaa undunu.
17. అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు.
17. anyu likameedata daanilo sancharimpakunda yerooshalemu pari shuddhapattanamugaa undunu; mee dhevudanaina yehovaanu nene, naaku prathishthithamagu seeyonu parvathamandu niva sinchuchunnaanani meeru telisikonduru.
18. ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును.ప్రకటన గ్రంథం 22:1
18. aa dinamandu parvathamulalonundi krottha draakshaarasamu paarunu, kondalalonundi paalu pravahinchunu. yoodhaa nadulannitilo neellu paarunu, neeti oota yehovaa mandiramulonundi ubiki paari shittheemu loyanu thadupunu.
19. ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.
19. aiguptheeyulunu edomeeyulunu yoodhaavaarimeeda balaatkaaramu chesi thama thama dheshamulalo nirdoshulagu vaariki praanahaani kalugajesiri ganuka aigupthudheshamu paadagunu, edomudheshamu nirjanamaina yedaarigaa undunu.
20. ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.
20. eelaaguna nenu inthakumundu prathikaaramu cheyani praanadoshamunakai prathikaaramu cheyudunu.
21. అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.
21. ayithe yoodhaadheshamulo nivaasulu nityamunduru, tharatharamulaku yerooshalemu nivaasamugaa nundunu, yehovaa seeyonulo nivaasigaa vasinchunu.