Joel - యోవేలు 3 | View All
Study Bible (Beta)

1. ఆ దినములలో, అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున

“క్షేమస్థితి...మళ్ళీ”– అంటే యూదానూ జెరుసలంనూ తిరిగి ఆధ్యాత్మిక సౌభాగ్యంలోకి, దేవుని ఆశీస్సుల్లోకి తీసుకురావడం (యోవేలు 2:26-27, యోవేలు 2:32; యెషయా 2:1-4; యెషయా 40:9-11; యెషయా 44:1-5; యెషయా 51:1-3; యెషయా 59:20 యెషయా 60:22; యెషయా 62:1-12; యిర్మియా 31:35-40; యెహెఙ్కేలు 37:15-27; హోషేయ 2:14-23; ఆమోసు 9:14-15; జెకర్యా 14:8-11, జెకర్యా 14:20-21). “ఆ రోజుల్లో...ఆ కాలంలో”– హోషేయ 2:30-32 లో చెప్పిన కాలం.

2. అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.

“క్షేమస్థితి...మళ్ళీ”– అంటే యూదానూ జెరుసలంనూ తిరిగి ఆధ్యాత్మిక సౌభాగ్యంలోకి, దేవుని ఆశీస్సుల్లోకి తీసుకురావడం (యోవేలు 2:26-27, యోవేలు 2:32; యెషయా 2:1-4; యెషయా 40:9-11; యెషయా 44:1-5; యెషయా 51:1-3; యెషయా 59:20 యెషయా 60:22; యెషయా 62:1-12; యిర్మియా 31:35-40; యెహెఙ్కేలు 37:15-27; హోషేయ 2:14-23; ఆమోసు 9:14-15; జెకర్యా 14:8-11, జెకర్యా 14:20-21). “ఆ రోజుల్లో...ఆ కాలంలో”– హోషేయ 2:30-32 లో చెప్పిన కాలం.

3. వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?

“చీట్లు”– ఓబద్యా 1:11. శత్రువులు దేశాన్ని జయించినప్పుడు ప్రజల్ని బానిసలుగా చూశారు.

4. తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నాకేమైన చేయుదురా?
మత్తయి 11:21-22, లూకా 10:13-14

ఇస్రాయేల్‌ప్రజలను పీడించిన జాతులన్నిటికీ తాను ఏం చేస్తాడో తెలియజేసేందుకు దేవుడు తూరు, సీదోనులను ఉదాహరణలుగా చెప్తున్నాడు. దేవుడు ఏ నియమం ప్రకారం తీర్పు తీరుస్తాడో చూడండి – “మీరు చేసినదాన్ని...మీ నెత్తి మీదికి రప్పిస్తాను”. ద్వితీయోపదేశకాండము 32:40-43; కీర్తనల గ్రంథము 79:1-7; కీర్తనల గ్రంథము 83:1-18; కీర్తనల గ్రంథము 94:23; యిర్మియా 25:12-14 పోల్చి చూడండి. తూరు సీదోనుల గురించి నోట్ యెషయా 23:1-2.

5. నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.

6. యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.

7. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును

8. మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును; వారు దూరముగా నిసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే.

9. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడిరావలెను.

“యుద్ధానికి”– యెహోవా దినానికి సంబంధించినది ఈ యుద్ధం (వ 14-16), గనుక దీని నెరవేర్పు ఈ యుగాంతంలో ఉంటుంది.

10. మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను.

యెషయా 2:4 పోల్చి చూడండి. ఈ అంతిమ మహా యుద్ధం అయిపోయాక పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ వర్ణించబడింది.

11. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.

“అక్కడ”– వ 2,14-16. “నీ బలాఢ్యులను”– జెరుసలంకు విరోధంగా వస్తున్న సైన్యాలను ఎదిరించే దేవదూతలు అని అర్థం కావచ్చు. జెకర్యా 14:5 పోల్చి చూడండి.

12. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను

దేవుడు మాట్లాడుతున్నాడు. “యెహోషాపాతు”– వ 2. ఇది వ్యక్తులకు జరిగే తీర్పు కాదు. జెరుసలం పైకి దాడికి వచ్చే సైన్యాల పై దేవుడు దండన కుమ్మరించి కడతేరుస్తాడు. జెకర్యా 12:2-9; జెకర్యా 14:3 పోల్చి చూడండి.

13. పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లిపారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగిరండి.
మార్కు 4:29, ప్రకటన గ్రంథం 14:15-18-2, ప్రకటన గ్రంథం 19:15

ప్రకటన గ్రంథం 14:14-20 పోల్చిచూడండి.

14. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.

“గుంపులు గుంపులుగా”– వ 2. వ 2,12 లోని యెహోషాపాతు లోయను ఇక్కడ “తీర్పు లోయ” అంటున్నాడు. అంటే దేవుడు అక్కడికి వచ్చి ఏదైనా నిర్ణయిస్తాడని అర్థం కాదు గాని తాను అప్పటికే చేసిన నిర్ణయాన్ని అక్కడ ఆచరణలో పెడతాడు. “యెహోవా దినం”– యోవేలు 1:15.

15. సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను.
మత్తయి 24:29, మార్కు 13:24-25, ప్రకటన గ్రంథం 6:12-13, ప్రకటన గ్రంథం 8:12

యోవేలు 2:2, యోవేలు 2:10, యోవేలు 2:31.

16. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.

“జెరుసలం నుంచి”– రాబోయే ఆ అంతిమ మహా యుద్ధంలో దేవుని కార్యకలాపాలకు జెరుసలం కేంద్రంగా ఉంటుంది. “కంపిస్తాయి”– హెబ్రీయులకు 12:26. “శరణ్యం”– కీర్తనల గ్రంథము 2:12; కీర్తనల గ్రంథము 5:11; కీర్తనల గ్రంథము 46:1-3; జెకర్యా 12:8-9.

17. అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు.

“అప్పుడు”– దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడంటే యెహోవా దినం వచ్చినకాలంలో దేవుడు జెరుసలంలో నివసిస్తాడు. “మరెన్నడూ విదేశీయులు దాని మీదుగా వెళ్ళరు” అని రాసి ఉంది. గనుక ఇది అక్షరాలా పాలస్తీనాలోని జెరుసలం నగరమే అని స్పష్టంగా ఉన్నట్టుంది. పరలోక జెరుసలంను విదేశీయులు ఎన్నడూ ముట్టడించలేదు. మరికొన్ని చోట్ల దేవుడు జెరుసలంను తన నివాస స్థలంగా చేసుకుంటానని చెప్పాడు – కీర్తనల గ్రంథము 132:13-14; యెహెఙ్కేలు 48:35; యెషయా 12:6; యెషయా 24:23; యిర్మియా 3:17; జెకర్యా 8:3; జెకర్యా 14:16-21. అయితే ఇప్పుడున్న జెరుసలం చాలా మార్పు చెందుతుంది.

18. ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును.
ప్రకటన గ్రంథం 22:1

యోవేలు 2:24. నిర్గమకాండము 3:8 పోల్చి చూడండి. “యెహోవా ఆలయం”– యెహెఙ్కేలు 47:1-12 చూడండి.

19. ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.

యెషయా 19:5-8; యెషయా 34:5-15.

20. ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.

“సదాకాలం”– కీర్తనల గ్రంథము 68:16; యెహెఙ్కేలు 37:25-28; యెహెఙ్కేలు 43:7, యెహెఙ్కేలు 43:9; ఆమోసు 9:15; మీకా 4:6-7; ఆదికాండము 17:8; ఆదికాండము 48:4. యూదా, జెరుసలం అన్న మాటలను అక్షరార్థంగా తీసుకోరాదు అనుకోవడానికి సరైన కారణాలేవీ ఈ రచయితకు కనిపించడం లేదు. రక్తపాతం జరిగించి కొంతకాలం క్షమాపణ పొందకుండా ఉన్న ఈ నగరమే తరతరాలకు నిలిచి ఉంటుంది.

21. అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.

“సీయోనులో”– కీర్తనల గ్రంథము 43:3; కీర్తనల గ్రంథము 74:2.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joel - యోవేలు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

చివరి రోజుల్లో దేవుని తీర్పులు. (1-8) 
ఈ ప్రకరణం యూదు ప్రజల పునరుజ్జీవనాన్ని మరియు దాని ప్రత్యర్థులపై నిజమైన విశ్వాసం యొక్క అంతిమ విజయాన్ని అంచనా వేస్తుంది. ఇది యూదు సమాజం ఎదుర్కొంటున్న చారిత్రక దుర్వినియోగం మరియు విస్మరణను హైలైట్ చేస్తుంది. దేవుణ్ణి లేదా ఆయన చర్చిని నిరంతరం వ్యతిరేకించే వారు శాశ్వత విజయాన్ని పొందలేరని కూడా ఇది నొక్కి చెబుతుంది.

ఈ తీర్పుల పరిధి. (9-17) 
దేవుని ప్రజలను వ్యతిరేకించే వారికి ఇక్కడ ఒక సవాలు ఉంది: దేవుని తీర్పులు అనివార్యం; పశ్చాత్తాపపడని పాపులు, గణన రోజున, అన్ని సౌకర్యాలను మరియు ఆనందాన్ని కోల్పోతారు. చాలా మంది ప్రవక్తలు దేవుని చర్చి దాని ప్రత్యర్థులపై అంతిమ విజయాన్ని అంచనా వేశారు. దుర్మార్గులకు, ఈ రోజు భయాందోళనలతో నిండి ఉంటుంది, కానీ నీతిమంతులకు ఇది సంతోషకరమైన రోజు. క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉన్నవారు తమ రక్షకునిలో మరియు వారి బలానికి మూలంగా ఆనందించడానికి ప్రతి కారణం ఉంది! "ప్రభువు యొక్క ఆమోదయోగ్యమైన సంవత్సరం", కొందరికి అపారమైన అనుగ్రహం ఉన్న సమయం, ఇతరులకు తీవ్రమైన ప్రతీకార దినం కూడా అవుతుంది. కావున, క్రీస్తు ఆలింగనంలో లేని ప్రతి ఒక్కరు మేల్కొని రాబోయే కోపం నుండి ఆశ్రయం పొందండి.

చర్చి ఆనందించే ఆశీర్వాదాలు. (18-21)
సమృద్ధిగా దైవిక ఆశీర్వాదాలు కురిపించబడతాయి మరియు సువార్త ప్రపంచంలోని సుదూర మూలలకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ సంఘటనలు ప్రతీకాత్మకంగా ముందే చెప్పబడ్డాయి, ఇది తప్పు అంతా సరిదిద్దబడే భవిష్యత్తు దినాన్ని సూచిస్తుంది. ఈ సమృద్ధి యొక్క మూలం అది ఉద్భవించిన దేవుని ఇంటిలో కనుగొనబడింది. క్రీస్తు ఈ ఫౌంటెన్‌గా పనిచేస్తాడు; అతని బాధలు, యోగ్యత మరియు దయ శుభ్రపరుస్తాయి, పునరుజ్జీవింపజేయబడతాయి మరియు ఫలవంతమైనవి. క్రీస్తు నుండి వెలువడే సువార్త యొక్క కృప ద్వారా, అది అన్యజనుల ప్రపంచంలోని సుదూర మూలలకు కూడా చేరుకుంటుంది, వారిని నీతితో వర్ధిల్లేలా చేస్తుంది. మనం రోజూ అనుభవించే మరియు శాశ్వతంగా ఆస్వాదించాలని ఆశిస్తున్న అన్ని మంచితనం పైన ఉన్న ప్రభువు యొక్క స్వర్గపు ఆలయం నుండి ప్రవహిస్తుంది.



Shortcut Links
యోవేలు - Joel : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |