Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెనుఅపో. కార్యములు 10:14
1. And Jehovah spoke to Moses and to Aaron, saying to them,
2. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;హెబ్రీయులకు 9:10
2. Speak unto the children of Israel, saying, These are the animals which ye shall eat of all the beasts which are on the earth.
3. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని
3. Whatever hath cloven hoofs, and feet quite split open, and cheweth the cud, among the beasts -- that shall ye eat.
4. నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
4. Only these shall ye not eat of those that chew the cud, or of those with cloven hoofs: the camel, for it cheweth the cud, but hath not cloven hoofs -- it shall be unclean unto you;
5. పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
5. and the rock-badger, for it cheweth the cud, but hath not cloven hoofs -- it shall be unclean unto you;
6. కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
6. and the hare, for it cheweth the cud, but hath not cloven hoofs -- it shall be unclean unto you;
7. పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.
7. and the swine, for it hath cloven hoofs, and feet quite split open, but it cheweth not the cud -- it shall be unclean unto you.
8. వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.
8. Of their flesh shall ye not eat, and their carcase shall ye not touch: they shall be unclean unto you.
9. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్ర ములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.
9. These shall ye eat of all that are in the waters: whatever hath fins and scales in waters, in seas and in rivers, these shall ye eat;
10. సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు మీకు హేయములు;
10. but all that have not fins and scales in seas and in rivers, of all that swarm in the waters, and of every living soul which is in the waters -- they shall be an abomination unto you.
11. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.
11. They shall be even an abomination unto you: of their flesh shall ye not eat, and their carcase ye shall have in abomination.
12. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
12. Whatever in the waters hath no fins and scales, that shall be an abomination unto you.
13. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
13. And these shall ye have in abomination of the fowls; they shall not be eaten; an abomination shall they be: the eagle, and the ossifrage, and the sea-eagle,
14. క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,
14. and the falcon, and the kite, after its kind;
15. ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,
15. every raven after its kind;
16. కపిరిగాడు, కోకిల,
16. and the female ostrich and the male ostrich, and the sea-gull, and the hawk, after its kind;
17. ప్రతివిధమైన డేగ,
17. and the owl, and the gannet, and the ibis,
18. పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,
18. and the swan, and the pelican, and the carrion vulture,
19. సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
19. and the stork; the heron after its kind, and the hoopoe, and the bat.
20. రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరము లన్నియు మీకు హేయములు.
20. Every winged crawling thing that goeth upon all four shall be an abomination unto you.
21. అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.
21. Yet these shall ye eat of every winged crawling thing that goeth upon all four: those which have legs above their feet with which to leap upon the earth.
22. నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.
22. These shall ye eat of them: the arbeh after its kind, and the solam after its kind, and the hargol after its kind, and the hargab after its kind.
23. నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
23. But every winged crawling thing that hath four feet shall be an abomination unto you.
24. వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.
24. And by these ye shall make yourselves unclean; whoever toucheth their carcase shall be unclean until the even.
25. వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.హెబ్రీయులకు 9:10
25. And whoever carrieth [ought] of their carcase shall wash his garments, and be unclean until the even.
26. రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.
26. Every beast that hath cloven hoofs, but not feet quite split open, nor cheweth the cud, shall be unclean unto you: every one that toucheth them shall be unclean.
27. నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;
27. And whatever goeth on its paws, among all manner of beasts that go upon all four, those are unclean unto you: whoever toucheth their carcase shall be unclean until the even.
28. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.
28. And he that carrieth their carcase shall wash his garments, and be unclean until the even: they shall be unclean unto you.
29. నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,
29. And these shall be unclean unto you among the crawling things which crawl on the earth: the mole, and the field-mouse, and the lizard, after its kind;
30. ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.
30. and the groaning lizard, and the great red lizard, and the climbing lizard, and the chomet, and the chameleon.
31. ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
31. These shall be unclean unto you among all that crawl: whoever toucheth them when they are dead, shall be unclean until the even.
32. వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును.
32. And on whatever any of them when they are dead doth fall, it shall be unclean; all vessels of wood, or garment, or skin, or sack, every vessel wherewith work is done -- it shall be put into water, and be unclean until the even; then shall it be clean.
33. వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.
33. And every earthen vessel into which [any] of them falleth -- whatever is in it shall be unclean; and ye shall break it.
34. తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.
34. All food that is eaten on which [such] water hath come shall be unclean; and all drink that is drunk shall be unclean, in every [such] vessel.
35. వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.
35. And everything where upon [any part] of their carcase falleth shall be unclean; oven and hearth shall be broken down: they are unclean, and shall be unclean unto you.
36. అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములుకావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.
36. Nevertheless, a spring or a well, a quantity of water, shall be clean. But he that toucheth their carcase shall be unclean.
37. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని
37. And if any part of their carcase fall upon any sowing-seed which is to be sown, it shall be clean;
38. ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
38. but if water have been put on the seed, and any part of their carcase fall thereon, it shall be unclean unto you.
39. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
39. And if any beast which is to you for food die, he that toucheth the carcase thereof shall be unclean until the even.
40. దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
40. And he that eateth of its carcase shall wash his garments, and be unclean until the even: he also that carrieth its carcase shall wash his garments, and be unclean until the even.
41. నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.
41. And every crawling thing which crawleth on the earth shall be an abomination; it shall not be eaten.
42. నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.
42. Whatever goeth on the belly, and whatever goeth on all four, and all that have a great many feet, of every manner of crawling thing which crawleth on the earth -- these ye shall not eat; for they are an abomination.
43. ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.
43. Ye shall not make yourselves abominable through any crawling thing which crawleth, neither shall ye make yourselves unclean with them, that ye should be defiled thereby.
44. నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.1 పేతురు 1:16
44. For I am Jehovah your God; and ye shall hallow yourselves, and ye shall be holy; for I am holy; and ye shall not make yourselves unclean through any manner of crawling thing which creepeth on the earth.
45. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
45. For I am Jehovah who brought you up out of the land of Egypt, to be your God: ye shall therefore be holy, for I am holy.
46. అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
46. This is the law of cattle, and of fowl, and of every living soul that moveth in the waters, and of every soul that crawleth on the earth;
47. జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.
47. to make a difference between the unclean and the clean, and between the beast that is to be eaten and the beast that is not to be eaten.