Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.
1. The Message of Amos, one of the shepherds of Tekoa, that he received on behalf of Israel. It came to him in visions during the time that Uzziah was king of Judah and Jeroboam II son of Joash was king of Israel, two years before the big earthquake.
2. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది.
2. The Message: GOD roars from Zion, shouts from Jerusalem! The thunderclap voice withers the pastures tended by shepherds, shrivels Mount Carmel's proud peak.
3. యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.
3. GOD's Message: 'Because of the three great sins of Damascus --make that four--I'm not putting up with her any longer. She pounded Gilead to a pulp, pounded her senseless with iron hammers and mauls.
4. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;
4. For that, I'm setting the palace of Hazael on fire. I'm torching Ben-hadad's forts.
5. దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజదండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
5. I'm going to smash the Damascus gates and banish the crime king who lives in Sin Valley, the vice boss who gives orders from Paradise Palace. The people of the land will be sent back to where they came from--to Kir.' GOD's Decree.
6. యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలెనని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
6. GOD's Message: 'Because of the three great sins of Gaza --make that four--I'm not putting up with her any longer. She deported whole towns and then sold the people to Edom.
7. గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
7. For that, I'm burning down the walls of Gaza, burning up all her forts.
8. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
8. I'll banish the crime king from Ashdod, the vice boss from Ashkelon. I'll raise my fist against Ekron, and what's left of the Philistines will die.' GOD's Decree.
9. యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.మత్తయి 11:21-22, లూకా 10:13-14
9. GOD's Message: 'Because of the three great sins of Tyre --make that four--I'm not putting up with her any longer. She deported whole towns to Edom, breaking the treaty she had with her kin.
10. నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.
10. For that, I'm burning down the walls of Tyre, burning up all her forts.'
11. యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.
11. GOD's Message: 'Because of the three great sins of Edom --make that four--I'm not putting up with her any longer. She hunts down her brother to murder him. She has no pity, she has no heart. Her anger rampages day and night. Her meanness never takes a timeout.
12. తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును.
12. For that, I'm burning down her capital, Teman, burning up the forts of Bozrah.'
13. యెహోవా సెలవిచ్చునదేమనగా అమ్మోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.
13. GOD's Message: 'Because of the three great sins of Ammon --make that four--I'm not putting up with her any longer. She ripped open pregnant women in Gilead to get more land for herself.
14. రబ్బాయొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును.
14. For that, I'm burning down the walls of her capital, Rabbah, burning up her forts. Battle shouts! War whoops! with a tornado to finish things off!
15. వారి రాజును అతని అధిపతులును అందరును చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
15. The king has been carted off to exile, the king and his princes with him.' GOD's Decree.