Numbers - సంఖ్యాకాండము 30 | View All
Study Bible (Beta)

1. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను

1. moshe ishraayeleeyulayokka gotraadhipathu lathoo itlanenu

2. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.
మత్తయి 5:33

2. idi yehovaa aagnaapinchina sangathi. Okadu yehovaaku mrokkukonina yedala, leka thaanu baddhudagutaku pramaanamu chesina yedala, athadu thana maatathappaka thana notanundi vachinadanthayu neravercha valenu.

3. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును.

3. mariyu oka stree baalyamuna thana thandri yinta nundagaa yehovaaku mrokkukoni baddhuraa laina yedala, aame thandri aame mrokkubadini aame kalugajesikonina baadhyathanu vini daanigoorchi oorakonina yedala, aame mrokkubadulanniyu niluchunu.

4. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును.

4. aame thaanu baddhuraalagutaku pettukonina ottu niluchunu.

5. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసిన యెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును.

5. aame thandri vininadhinamuna aakshepanachesina yedala, aame mrokkubadulalo ediyu, aame thanameeda pettu konina baadhyathalo ediyu niluvaka povunu.

6. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

6. aame thandri daaniki aakshepanachesenu ganuka yehovaa aamenu kshaminchunu.

7. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీద నుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.

7. aameku vivaahamaina tharu vaatha aame mrokkukonina mrokkuballayinanu, niraalochanagaa aame thanameeda pettukonina ottulainanu aamemeeda nunduta aame bhartha vini, daani goorchi vinina dinamuna athadu oorakunduta thatasthinchina yedala, aame mrokkuballunu aame thanameeda pettukonina ottunu niluchunu.

8. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.

8. aame bhartha vinina dinamandhe aakshepana chesinayedala, athadu aame mrokkukonina mrokkubadini aame niraalochanagaa thanameeda pettu konina ottulanu radduchesinavaadagunu; yehovaa aamenu kshaminchunu.

9. విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.

9. vidhavaraalugaani vidanaadabadinadhigaani thana meeda pettukonina prathi mrokkubadi niluchunu.

10. ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి,

10. aame thana bharthayinta undi mrokku koninayedala nemi, pramaanamuchesi thanameeda ottu pettukonina yedalanemi,

11. తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.

11. tharuvaatha aame bhartha vini daanigoorchi aakshepanacheyaka oorakundinayedala, aame mrokkubadulanniyu nilu chunu; aame thanameeda pettukonina prathi ottunu niluchunu.

12. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

12. aame bhartha vinina dinamandhe vaatini botthigaa raddu chesinayedala, aame mrokkuballanu goorchiyu, aame meedi ottunu goorchiyu aame palikinadhediyu niluvaka povunu; aamebhartha vaatini radduchesenu ganuka yehovaa aamenu kshaminchunu.

13. ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్తస్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.

13. prathi mrokkubadini, thannu thaanu duḥkhaparachukondunani pramaanapoorvakamugaa thana meeda pettukonina prathi baadhyathanu aame bharthasthiraparacha vachunu, radducheyavachunu.

14. అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.

14. ayithe aame bhartha naanaata daanigoorchi oorakonuchu vachinayedala, vaadu aame meedanunna aame mrokkubadulannitini aame ottulannitini sthiraparachinavaadagunu. Athadu vinina dinamuna daanigoorchi oorakundutavalana vaatini sthiraparachenu.

15. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, తానే ఆమె దోష శిక్షను భరించును.

15. athadu vinina tharuvaatha vaatini botthigaa radduchesinayedala, thaane aame dosha shikshanu bharinchunu.

16. ఇవి భర్తను గూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింట నున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.

16. ivi bharthanu goorchiyu, bhaaryanugoorchiyu, thandrinigoorchiyu, baalyamuna thandri yinta nunna kumaarthenugoorchiyu yehovaa mosheku aagnaapinchina kattadalu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 30 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ప్రమాణాలు పాటించాలి. (1,2) 
దేవుడు చేయలేనిది చేస్తానని ఎవరైనా వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వారు భావించకూడదు. కానీ ఇతర పరిస్థితులలో, ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి సరైన కారణం ఉంటే తప్ప వారి వాగ్దానాలను నిలబెట్టుకోవాలి.

ప్రమాణాలు విడుదల చేయబడే సందర్భాలు. (3-16)
ఎవరైనా వాగ్దానం లేదా ప్రతిజ్ఞ చేసే రెండు వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. ఒక కుమార్తె తన తండ్రితో నివసిస్తున్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తే, అతను దానిని చేయడానికి అంగీకరించవచ్చు లేదా వద్దు అని చెప్పవచ్చు. భార్య ప్రతిజ్ఞ చేస్తే, ఆమె భర్త అభ్యంతరం చెప్పకుండా అవును అని చెప్పవచ్చు లేదా కాదు అని చెప్పవచ్చు. అతను వద్దు అని చెబితే, భార్య అతని మాట వినాలి, ఎందుకంటే ఆమె తన భర్తను గౌరవించి, దేవుడిని గౌరవించినట్లే మరియు కట్టుబడి ఉండాలి. ఇది కుటుంబాలు సంతోషంగా మరియు క్రమంలో ఉంచడానికి సహాయపడుతుంది. దేవుని నియమాలు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల్లో సురక్షితంగా మరియు సంతోషంగా ఉండేలా చూస్తాయి.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |