Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను
1. ఇశ్రాయేలు వంశాల నాయకులతో మోషే మాట్లాడాడు. యెహోవానుండి వచ్చిన ఈ ఆజ్ఞలనుగూర్చి మోషే వారితో చెప్పాడు.
2. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.మత్తయి 5:33
2. ఒక వ్యక్తి దేవునితో ప్రత్యేక ప్రమాణం చేయాలని కోరినా, లేక దేవునికి ఏదైనా ప్రత్యేకంగా ఇస్తానని అతడు మ్రొక్కుకొనినా, అతడు ఆ ప్రకారం చేయాలి. అయితే అతడు ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి.
3. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును.
3. “ఒక యువతి ఇంకా తన తండ్రి ఇంట్లో నివసిస్తూ ఉండొచ్చు. యెహోవాకు ప్రత్యేకంగా ఏదో ఇస్తానని ఆ యువతి ప్రమాణం చేసి ఉండొచ్చు.
4. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును.
4. ఆ ప్రమాణం గూర్చి ఆమె తండ్రి విని, ఒప్పుకొంటే, ఆ యువతి ప్రమాణం ప్రకారం చేసి తీరాలి.
5. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసిన యెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును.
5. అయితే ఆమె తండ్రి ఆ ప్రమాణం గూర్చి విని, ఒప్పుకొనకపోతే, అప్పుడు ఆ యువతి తన ప్రమాణానికి బాధ్యురాలు కాదు. ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె నెరవేర్చాల్సిన పనిలేదు. ఆమె తండ్రి ఆమెను వారించాడు గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
6. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.
6. “మరియు ఒకని భార్య యెహోవాకు ఏదో ఇస్తానని ఒక ప్రత్యేక ప్రమాణం చేసి ఉండొచ్చు.
7. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీద నుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.
7. భర్త ఆ ప్రమాణంగూర్చి విని, ఒప్పుకొంటే, ఆమె చేసిన ప్రమాణాన్ని ఆమె నెరవేర్చి తీరాలి.
8. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.
8. కానీ ఆ ప్రమాణం గూర్చి భర్త విని, ఒప్పుకొనకపోతే, ఆ భార్య తన ప్రమాణం ప్రకారం చేయనవసరం లేదు. ఆమె భర్త ప్రమాణాన్ని భంగం చేసి ఆమె చెప్పినట్టు ఆమెను చేయనివ్వలేదు. కనుక యోహోవా ఆమెను క్షమిస్తాడు.
9. విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.
9. “ఒక విధవ లేక విడువబడ్డ ఒక స్త్రీ ఒక ప్రత్యేక ప్రమాణం చేయవచ్చు. ఆమె అన్న ప్రకారం తన ప్రమాణాన్ని నెరవేర్చవలసిందే.
10. ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి,
10. ఒక వివాహిత స్త్రీ యెహోవాకు ఏదో ఇస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు.
11. తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.
11. ఆ ప్రమాణం గూర్చి ఆమె భర్త విని, ఆమె మ్రొక్కుబడిని చెల్లింపనిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి. ఆమె ప్రమాణం ప్రకారం సమస్తం చెల్లించాలి.
12. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.
12. కానీ ఆమె భర్త ఆ ప్రమాణం గూర్చి విని, ఆమె ప్రమాణం నిలుపు కొనేందుకు నిరాకరిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం చేయనక్కర్లేదు. ఆమె ఏమి ప్రమాణం చేసినా సరే ఫర్వాలేదు, ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేయవచ్చు. ఒకవేళ ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తాడు.
13. ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్తస్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.
13. ఒక వివాహిత స్త్రీ యెహోవాకు ఏదైనా ఇస్తానని ప్రమాణం చేయవచ్చు, లేక తనకు ఏదైనా పరిత్యజించు కొంటానని ప్రమాణం చేయవచ్చు, లేక మరేదో ప్రత్యేక ప్రమాణాన్ని యెహోవాకు ఆమె చేసి ఉండొచ్చు. ఆ ప్రమాణాల్లో దేనినైనా భర్త భంగం చేయవచ్చును, లేదా ఆ ప్రమాణాలలో దేనినైనా ఆ భర్త ఆమెను నెరవేర్చనీయవచ్చును.
14. అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.
14. భర్త ఏ విధంగా తన భార్యను ఆమె ప్రమాణాలను నెరవేర్చనిస్తాడు? అతడు ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారించకపోతే, అప్పుడు ఆ స్త్రీ, ఆమె చేసిన ప్రమాణాలను నెరవేర్చాలి.
15. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, తానే ఆమె దోష శిక్షను భరించును.
15. కానీ భర్త ఆ ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారిస్తే, అప్పుడు ఆమె ప్రమాణాలను ఉల్లంఘించినందుకు అతడు బాధ్యుడు.”
16. ఇవి భర్తను గూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింట నున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.
16. ఇవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. ఒక పురుషుడు అతని భార్యను గూర్చి, ఒక తండ్రి, ఇంకా చిన్నదిగా ఉండి తన తండ్రి ఇంటనే ఉంటున్న కూతురును గూర్చిన ఆజ్ఞలు ఇవి.