Numbers - సంఖ్యాకాండము 4 | View All
Study Bible (Beta)

1. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

1. The LORD spoke to Moses and Aaron:

2. నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను

2. 'Among the Levites, take a census of the Kohathites by their clans and their ancestral houses,

3. ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.

3. men from 30 years old to 50 years old-- everyone who is qualified to do work at the tent of meeting.

4. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా

4. 'The service of the Kohathites at the tent of meeting concerns the most holy objects.

5. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

5. Whenever the camp is about to move on, Aaron and his sons are to go in, take down the screening veil, and cover the ark of the testimony with it.

6. దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

6. They are to place over this a covering made of manatee skin, spread a solid blue cloth on top, and insert its poles.

7. సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి

7. 'They are to spread a blue cloth over the table of the Presence and place the plates and cups on it, as well as the bowls and pitchers for the drink offering. The regular bread [offering] is to be on it.

8. దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

8. They are to spread a scarlet cloth over them, cover them with a covering made of manatee skin, and insert the poles [in the table].

9. మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి

9. They are to take a blue cloth and cover the lampstand used for light, with its lamps, snuffers, and firepans, as well as its jars of oil by which they service it.

10. దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.

10. Then they must place it with all its utensils inside a covering made of manatee skin and put [them] on the carrying frame.

11. మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

11. 'They are to spread a blue cloth over the gold altar, cover it with a covering made of manatee skin, and insert its poles.

12. మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.

12. They are to take all the serving utensils they use in the sanctuary, place [them] in a blue cloth, cover them with a covering made of manatee skin, and put [them] on a carrying frame.

13. వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి

13. 'They are to remove the ashes from the [bronze] altar, spread a purple cloth over it,

14. దానిమీద తమ సేవోపకరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.

14. and place all the equipment on it that they use in serving: the firepans, meatforks, shovels, and basins-- all the equipment of the altar. They are to spread a covering made of manatee skin over it and insert its poles.

15. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.

15. 'Aaron and his sons are to finish covering the holy objects and all their equipment whenever the camp is to move on. The Kohathites will come and carry them, but they are not to touch the holy objects or they will die. These are the transportation duties of the Kohathites regarding the tent of meeting.

16. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము.

16. 'Eleazar, son of Aaron the priest, has oversight of the lamp oil, the fragrant incense, the daily grain offering, and the anointing oil. [He has] oversight of the entire tabernacle and everything in it, the holy objects and their utensils.'

17. మరియయెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

17. Then the LORD spoke to Moses and Aaron:

18. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.

18. 'Do not allow the Kohathite tribal clans to be wiped out from the Levites.

19. వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను.

19. Do this for them so that they may live and not die when they come near the most holy objects: Aaron and his sons are to go in and assign each man his task and transportation duty.

20. వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.

20. The Kohathites are not to go in and look at the holy objects, even for a moment, or they will die.'

21. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

21. The LORD spoke to Moses:

22. గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.

22. 'Take a census of the Gershonites also, by their ancestral houses and their clans.

23. ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పనిచేయ చేరువారందరిని లెక్కింపవలెను.

23. Register men from 30 years old to 50 years old, everyone who is qualified to perform service, to do work at the tent of meeting.

24. పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ;

24. This is the service of the Gershonite clans regarding work and transportation duties:

25. వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను

25. They are to transport the tabernacle curtains, the tent of meeting with its covering and the covering made of manatee skin on top of it, the screen for the entrance to the tent of meeting,

26. మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పని చేయుచు రావలెను.

26. the hangings of the courtyard, the screen for the entrance at the gate of the courtyard that surrounds the tabernacle and the altar, along with their ropes and all the equipment for their service. They will carry out everything that needs to be done with these items.

27. గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటిమాట చొప్పున జరుగవలెను. వారు జరుపువాటినన్నిటిని జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.

27. All the service of the Gershonites, all their transportation duties and all their [other] work, is to be [done] at the command of Aaron and his sons; you are to assign to them all that they are responsible to carry.

28. ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను.

28. This is the service of the Gershonite clans at the tent of meeting, and their duties will be under the direction of Ithamar son of Aaron the priest.

29. మెరారీయులను వారివారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.

29. 'As for the Merarites, you are to register them by their clans and their ancestral houses.

30. ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.

30. Register men from 30 years old to 50 years old, everyone who is qualified to do the work of the tent of meeting.

31. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభములను

31. This is what they are responsible to carry as the whole of their service at the tent of meeting: the supports of the tabernacle, with its crossbars, posts, and bases,

32. దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.

32. the posts of the surrounding courtyard with their bases, tent pegs, and ropes, including all their equipment and all the work related to them. You are to assign by name the items that they are responsible to carry.

33. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.

33. This is the service of the Merarite clans regarding all their work at the tent of meeting, under the direction of Ithamar son of Aaron the priest.'

34. అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని

34. So Moses, Aaron, and the leaders of the community registered the Kohathites by their clans and their ancestral houses,

35. యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.

35. men from 30 years old to 50 years old, everyone who was qualified for work at the tent of meeting.

36. వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.

36. The men registered by their clans numbered 2,750.

37. ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

37. These were the registered men of the Kohathite clans, everyone who could serve at the tent of meeting. Moses and Aaron registered them at the LORD's command through Moses.

38. గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని

38. The Gershonites were registered by their clans and their ancestral houses,

39. యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను

39. men from 30 years old to 50 years old, everyone who was qualified for work at the tent of meeting.

40. తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది.

40. The men registered by their clans and their ancestral houses numbered 2,630.

41. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

41. These were the registered men of the Gershonite clans. At the LORD's command Moses and Aaron registered everyone who could serve at the tent of meeting.

42. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

42. The men of the Merarite clans were registered by their clans and their ancestral houses,

43. అనగా ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు

43. those from 30 years old to 50 years old, everyone who was qualified for work at the tent of meeting.

44. అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.

44. The men registered by their clans numbered 3,200.

45. మెరారీయుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

45. These were the registered men of the Merarite clans; Moses and Aaron registered them at the LORD's command through Moses.

46. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ

46. Moses, Aaron, and the leaders of Israel registered all the Levites by their clans and their ancestral houses,

47. ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

47. from 30 years old to 50 years old, everyone who was qualified to do the work of serving at the tent of meeting and transporting [it].

48. అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది.

48. Their registered men numbered 8,580.

49. యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి.

49. At the LORD's command they were registered under the direction of Moses, each one according to his work and transportation duty, and his assignment was as the LORD commanded Moses.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
లేవీయుల సేవ. (1-3) 
ప్రజల సమూహంలో, ముప్పై నుండి యాభై సంవత్సరాల మధ్య వయస్కులైన పురుషులు దేవుని సేవ చేయడానికి గుడారంలో పని చేయడానికి ఎంపిక చేయబడ్డారు. ఎందుకంటే దేవుణ్ణి సేవించడానికి మన వంతు కృషి మరియు సమయం అవసరం, ఆయన పట్ల మనకున్న గౌరవాన్ని చూపించడానికి ఇది చాలా ముఖ్యం. మనకు అత్యంత శక్తి మరియు ఉత్సాహం ఉన్నప్పుడు దేవుడిని సేవించడం ఉత్తమం. కొంతమంది దీని గురించి ఆలోచించరు మరియు మంచి పనులు చేయడం ప్రారంభించడానికి వయస్సు వచ్చే వరకు వేచి ఉండరు, కానీ మనం బలంగా ఉన్నప్పుడు ముందుగానే ప్రారంభించడం మరియు మన ఉత్తమమైన పని చేయడం మంచిది.]

కహాతీయుల విధులు. (4-20) 
కహాతీయులకు గుడారంలో ప్రత్యేక వస్తువులను మోయడం ఒక ముఖ్యమైన పని. ఈ విషయాలు చాలా పవిత్రమైనవి మరియు గౌరవం చూపించడానికి మరియు వాటిని సురక్షితంగా ఉంచడానికి కప్పి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ముఖ్యమైనది ఎందుకంటే ఈ విషయాలు ముఖ్యమైన ఆలోచనలను సూచిస్తాయి మరియు చరిత్రలో ఒక ప్రత్యేక సమయంలో భాగంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు యేసు వచ్చాడు, మనం ధైర్యంగా దేవుని దగ్గరకు రావచ్చు మరియు భయపడాల్సిన అవసరం లేదు.

గెర్షోనీయులు మరియు మెరారైట్ల విధులు. (21-33) 
బైబిల్ యొక్క ఈ భాగం చర్చిలో సహాయం చేసిన మరో రెండు వ్యక్తుల గుంపుల గురించి మాట్లాడుతుంది, కానీ వారు మొదటి సమూహం వలె ముఖ్యమైనవారు కాదు. దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చేలా చేశాడు. చర్చిలోని ప్రతి ఒక్కరినీ దేవుడు చూసుకుంటాడని ఇది చూపిస్తుంది. చర్చిలో ఎవరైనా చనిపోతే, అది ఒక ప్రత్యేక గుడారాన్ని తీయడం లాంటిది. 2 Pet 1:14 ఒక రోజు, యేసును విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆయనతో శాశ్వతంగా ఉండేలా లేపబడతారు. యేసు శరీరం ఎలా పరిపూర్ణంగా ఉందో అలాగే మన శరీరాలు కూడా పరిపూర్ణంగా తయారవుతాయి. 

సేవ చేయగల లేవీయుల సంఖ్య. (34-49)
మెరారీలు చిన్న సమూహం అయినప్పటికీ, వారి మధ్య నిజంగా బలమైన మరియు సమర్థులైన ప్రజలు ఉండేలా దేవుడు చూసుకున్నాడు. దేవుడు ఎవరినైనా ఏదైనా చేయమని పిలిచినప్పుడల్లా, అతను దానిని చేయడానికి అవసరమైన శక్తిని మరియు సహాయం ఇస్తాడు. ప్రాపంచిక విషయాలపై ఎక్కువ మంది దృష్టిని కేంద్రీకరిస్తున్నప్పటికీ, మనం ఎల్లప్పుడూ మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడాన్ని ఎంచుకోవాలి.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |