Matthew - మత్తయి సువార్త 12 | View All

1. ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
ద్వితీయోపదేశకాండము 23:24-25

ఇది ధాన్యం దొంగిలించడం లెక్కలోకి రాదు. దేవుడు ఇస్రాయేల్‌కు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఇతరుల పొలంలోబడి వెళ్ళేటప్పుడు తమకు అవసరమైనదాన్ని తినేందుకు వారికి అనుమతి ఉంది. ద్వితీయోపదేశకాండము 23:24-25 చూడండి.

2. పరిసయ్యులది చూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
నిర్గమకాండము 20:10, ద్వితీయోపదేశకాండము 5:14

విశ్రాంతి దినం గురించి నోట్స్ నిర్గమకాండము 20:8-11 చూడండి. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని చాలా కఠినంగా వర్ణించి, విశ్రాంతి దినాన ఏమి చేయవచ్చో ఏమి చేయకూడదో బోలెడన్ని నియమాలను సృష్టించారు. ఇలా ఆహారం తీసుకోవడమంటే వారి దృష్టిలో పని. విశ్రాంతి దినాన ఎలాంటి పనీ చేయకూడదు. వారి దృష్టిలో రోగాలను నయం చేయడం కూడా పనే, అది కూడా నిషేధమే (వ 10).

3. ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా?

4. అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.
లేవీయకాండము 24:5-9, 1 సమూయేలు 21:6

5. మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?
సంఖ్యాకాండము 28:9-10

విశ్రాంతి దిన సంబంధమైన అర్పణలను సిద్ధ పరిచేందుకు, అర్పించేందుకు యాజులు పని చేసేవారు. సంఖ్యాకాండము 28:9-10 చూడండి. పరిసయ్యులు పాత ఒడంబడిక గ్రంథాన్ని చదవడం ఎక్కువ, అర్థం చేసుకున్నది తక్కువ.

6. దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
యెషయా 63:1

క్రీస్తు ఇక్కడ తాను దేవుని ఆలయం కన్న గొప్ప అని అంటున్నాడు. ఆలయ సేవా విధులకోసమని యాజులు విశ్రాంతి దినం చట్టాలను మీరితే క్రీస్తు శిష్యులు కూడా ఆయన చూపిన దారిలో ఉండి ఆయన పనికోసం ఆ కట్టడలను మీరవచ్చు అని ఆయన భావం. ఈ సంఘటన జరిగినప్పుడు శిష్యులు క్రీస్తుతో కలిసి ఒక పనిమీద వెళ్తున్నారు.

7. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు.
హోషేయ 6:6

మత్తయి 9:13 నోట్ చూడండి.

8. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.
ఆదికాండము 2:3

అంటే తానే అని యేసు ఉద్దేశం. “మానవ పుత్రుడు” గురించి నోట్ మత్తయి 8:20 చూడండి. ఇక్కడ మరో సారి యేసు తన దేవత్వం గురించి ఎరిగి ఉన్నాడని చూడవచ్చు. మానవ మాత్రుడు, లేదా ప్రవక్త ఎంత మహాత్ముడైనప్పటికీ తాను విశ్రాంతి దినానికి ప్రభువునని నిజంగా చెప్పగలడా? విశ్రాంతి దినం, దాని చట్టాలు సాక్షాత్తూ దేవుడే ఏర్పరచినవి (నిర్గమకాండము 20:1, నిర్గమకాండము 20:8), ఆ చట్టాలను మార్చే హక్కు, వాటిని పట్టించుకోనవసరం లేదని మనుషులకు అనుమతి ఇచ్చే హక్కు, లేదా వేరొక విధంగా వాటిని క్రమబద్ధం చేసే హక్కు ఆయనకు మాత్రమే ఉంది. “ప్రభువు” గురించి నోట్స్ లూకా 2:11; రోమీయులకు 10:9-10; ఫిలిప్పీయులకు 2:10-11 చూడండి.

9. ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను.

10. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.

ప్రాణాపాయం ఉంటే తప్ప ఎవరికైనా విశ్రాంతి దినాన వ్యాధి నయం చెయ్యడం చట్ట విరుద్ధమని నమ్మారు పరిసయ్యులు.

11. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా?

ఈ వాదనకు తిరుగు జవాబు లేదు. పరిసయ్యులు మరి నోరెత్తలేదు.

12. గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి

13. ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.

యేసు అధికారానికీ, ప్రభావానికీ కూడా తిరుగు లేదు.

14. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

మత్తయి 26:4; మత్తయి 27:1; మార్కు 3:6; లూకా 6:1; యోహాను 5:18; యోహాను 7:10; యోహాను 11:53. సత్యాన్ని అంగీకరించడం కంటే దాన్ని నాశనం చెయ్యడమే వారికి ఇష్టం అయింది. స్వచ్ఛమైన తర్కానికీ, పరిపూర్ణమైన మంచితనానికీ వారు ఇవ్వగలిగిన జవాబు హత్యకు తలపెట్టడమే. మనుషుల హృదయం, మత సంబంధమైన మనుషుల హృదయం కూడా ఇలాంటిదే. మత్తయి 15:19; యిర్మియా 17:9 చూడండి.

15. యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా

16. ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.

మత్తయి 8:4; మత్తయి 9:30.

17. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా

యెషయా 42:1-4 చూడండి. యేసుప్రభువు ధర్మశాస్త్రాన్నీ ప్రవక్తల గ్రంథాలనూ నెరవేర్చేందుకు వచ్చాడు (మత్తయి 5:17). యేసుప్రభువు పరిచర్య గోలగోలగా అందరికీ వినిపించే పరిచర్య కాదు. నెమ్మదిగా, నిలకడగా, ప్రశాంతంగా, జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం లేకుండా, ఎవరితో కుమ్ములాటలు పెట్టుకోకుండా, గొప్పగా ప్రదర్శించుకోకుండా పని చేసుకు పోవడం ఆయనకు ఇష్టం. పోరుకు పిలవడానికి బదులుగా ఆయన తన శత్రువులను విడిచివెళ్ళాడు. నిజమైన పోరాటాలు ఆత్మ సంబంధమైనవేనని ఆయనకు తెలుసు. అలాంటి పోరాటాల్లో అతి ప్రధానమైనదాన్లో తాను బలహీనుడుగా ఓడిపోయినట్టు కనిపించినప్పటికీ తాను సిలువపై దాన్ని గెలుస్తానని కూడా ఆయనకు తెలుసు. ఇదంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుని ప్రవక్త పలికినట్టుగానే జరిగింది.

18. ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
యెషయా 41:9, యెషయా 42:1-4

యేసుప్రభువు దేవుని అవతారం, అదే సమయంలో దేవుని సేవకుడు. మత్తయి 20:28; రోమీయులకు 15:8; అపో. కార్యములు 3:25-26; ఫిలిప్పీయులకు 2:6-7 చూడండి.

19. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు

20. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు

నీతిన్యాయాలు విజయం సాధించేవరకూ ఆయన తన నెమ్మదైన సాధువైన మార్గంలో కొనసాగాడు. యూదులు తమ అభిషిక్తుని ప్రవర్తన ఎలా ఉంటుందని భావించారో అలా యేసు ప్రవర్తించలేదు (తమ శత్రువులను తన పరాక్రమంవల్ల ఆయన ఓడిస్తాడని వారు తలంచేవారు). అయినప్పటికీ అంతిమ విజయం ఆయనదే.

21. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదియే

యూదుల మధ్య ఆయన చేసిన పరిచర్యకు ఇది పరిమితం అయిపోలేదు. ఇతర జనాలు కూడా ఆయన్ను నమ్మి స్వీకరిస్తారు.

22. అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.

మత్తయి 9:32 నోట్ చూడండి.

23. అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.

“దావీదు కుమారుడు”– గురించి మత్తయి 1:1 నోట్.

24. పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

బయల్‌జెబూల్ గురించి నోట్ మత్తయి 10:25.

25. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.
1 సమూయేలు 16:7

మత్తయి 9:4.

26. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?

27. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.

పరిసయ్యుల శిష్యులు కొందరు కూడా దయ్యాలను వెళ్ళగొట్టారు. లేదా కనీసం అలాగని చెప్పుకున్నారు. అపో. కార్యములు 19:13-16 చూడండి. దయ్యాల రాజు దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని ఎవరికీ ఇవ్వడని వారికి బాగా తెలుసు. అందువల్ల పరిసయ్యుల బూటకం మాటలను ఎవరైనా పసిగట్టగలరు.

28. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.

దేవుని రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17. రాజు వచ్చాడు కాబట్టి రాజ్యం వచ్చింది. ఇందుకు దయ్యాలపై ఆయన చూపిన అధికారమే ఒక రుజువు.

29. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.
యెషయా 49:24

ఈ చిన్న ఉదాహరణలో బలవంతుడు అంటే సైతాను. వాడి సామాను దోచుకునేది యేసుప్రభువు. వాడి సామాను అంటే సైతాను అదుపు కింద ఉన్న మనుషులు. యేసు సైతాను కోరల్లోనుంచి మనుషుల్ని రక్షిస్తున్నాడంటే పరిసయ్యులు చెప్పినట్టు ఆయన సైతానుతో రహస్యమైన సంధి చేసుకున్నాడని కాదు గానీ ఆయన సైతానును బంధించాడనే స్పష్టం అవుతున్నది. అలాగైతే యేసు దోపిడి దొంగ అనుకోవాలా? కాదు. మొదట్లో సైతాను దేవునినుంచి దొంగిలించిన దాన్నే ఆయన తిరిగి తీసుకుంటున్నాడు. పతనమై నశించిన స్థితిలో ఉన్న మనుషులను సైతాను రాజ్యంలోనుంచి తీసుకుపోయి తన మహిమ రాజ్యంలో ఉంచుతున్నాడు (అపో. కార్యములు 26:18).

30. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.

మార్కు 9:40; లూకా 11:23. ఇది సైతానుకు, అతడి దయ్యాల సైన్యానికి, మనుషులకు కూడా సమానంగా వర్తిస్తుంది. క్రీస్తు విషయంలో తటస్థమైన విధానం అంటూ లేదు. అంటే ఆయన పక్షం వహించము అనే మనసున్న వారు ఆయనకు వ్యతిరేకులు అనేదానికి రుజువు.

31. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.

ఈ వచనం మొదటి భాగం బైబిల్లోని గొప్ప వాగ్దానాల్లో ఒకటి. రెండో భాగం భయంకరమైన హెచ్చరికల్లో ఒకటి. “క్షమాపణ దొరుకుతుంది” అంటే పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం ఉంచినవారు క్షమాపణ పొందుతారని అర్థం తప్ప వేరు కాదు. అలాంటప్పుడు అతి హీనమైన నేరాలను, మనుషులు చేయగలిగే అతి నీచమైన పనులను కూడా దేవుడు క్షమిస్తాడు (లూకా 24:47; అపో. కార్యములు 13:38-39; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9). క్షమాపణ గురించి మత్తయి 6:12, మత్తయి 6:14-15 నోట్స్; మత్తయి 9:5-7. “దూషణ”– మత్తయి 9:3 నోట్. ఇక్కడి సందర్భాన్ని బట్టి పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ, ఎన్నడూ క్షమించబడని పాపం అంటే ఇది కావచ్చు – పవిత్రాత్మ మూలంగా క్రీస్తు చేసిన కార్యాలు సైతాను పనులు అనడం. ఇలా అనాలంటే తెలిసి తెలిసి, నిర్మొహమాటంగా, పట్టుదలగా, కావాలని క్రీస్తును తృణీకరించగలగాలి. ఈ పాపం పశ్చాత్తాప పడేందుకు ఇష్టం లేని మనసునూ, పశ్చాత్తాపపడడం అసాధ్యమైన కఠిన హృదయాన్నీ వెల్లడి చేస్తుంది. పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ అసాధ్యం – మత్తయి 3:2. హెబ్రీయులకు 6:4-6; 1 తిమోతికి 4:2; 1 యోహాను 5:16 పోల్చి చూడండి. హృదయం బండబారి పోయేలా చేసుకోవడం గురించిన హెచ్చరికను హెబ్రీయులకు 3:7-13 లో చూడండి.

32. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

మనుషులను పశ్చాత్తాపపడేలా చేసేది దేవుడే (అపో. కార్యములు 5:31; అపో. కార్యములు 11:18; 2 తిమోతికి 2:25). పవిత్రాత్మ మనుషుల హృదయాల్లో పని చేయడం వల్లే వారు పశ్చాత్తాపానికి వస్తారు. మనుషులు ఆయనకు వ్యతిరేకంగా హృదయాన్ని కఠినం చేసుకుని ఆయన్ను దూషిస్తే, సాధారణంగా వారిలో ఆయన ఆ పని చెయ్యడు. అలాంటివారు ఎన్నటికీ పశ్చాత్తాపపడరు గనుక ఎన్నటికీ క్షమాపణ పొందరు.

33. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

మత్తయి 7:16 చూడండి. క్రీస్తు చేసే పనులు మంచివైతే ఆయన శీలం, స్వభావం మంచిదని పరిసయ్యులు అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన పనులను బట్టి ఆయన్ను నమ్మాలి (యోహాను 5:36; యోహాను 10:37-38).

34. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

మత్తయి 3:7; మత్తయి 23:33 చూడండి. పవిత్రాత్మకు వ్యతిరేకంగా, ఎన్నడూ క్షమాపణకు నోచుకోని పాపం చేసే రకం మనుషులు వీరు. సత్యం పట్లా, వెలుగు పట్లా, క్రీస్తు పట్లా వారి ద్వేషం దేవుని ఆత్మకు వ్యతిరేకంగా వారు బండబారిపోయేలా చేసి వారినలా తయారు చేసింది. ఒక మనిషి హృదయంలో ఉన్నదే చివరికి బయటికి వచ్చి అతడెలాంటివాడో తెలియజేస్తుంది. సామెతలు 4:23 పోల్చి చూడండి. అరుదుగా పెదవి విప్పనివారు కూడా తమను గురించి తాము ఏమనుకుంటున్నారో తమ మాటల ద్వారా కొన్ని సార్లు బయట పెడుతుంటారు.

35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

జాగ్రత్తగా, తూచి తూచి పలికిన మాటల కంటే, అజాగ్రత్తగా పలికిన మాటలే ఒక వ్యక్తి మనసులో ఉన్నదాన్ని బయట పెడతాయి. నాలుక బహు శక్తివంతమైన పరికరం. అది పలికే మాటలకు శాశ్వత ఫలితాలు ఉంటాయి. సామెతలు 18:21; యాకోబు 3:5-6 పోల్చి చూడండి.

37. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు.

మన మాటలు జాగ్రత్తగా భద్రం చేయడం జరుగుతూ ఉంది. తీర్పు దినాన అవన్నీ తిరిగి మనకు వినిపించబడతాయి. మన మాటలే (వ 36లో చూడండి – “అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాట” కూడా) మనకు లభించే తీర్పుకు గురౌతాయి. ఎందుకంటే మనం ఏమిటో ఖచ్చితంగా అవి బయట పెడతాయి.

38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరుబోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.

మార్కు 8:11; లూకా 11:29-32 పోల్చి చూడండి. వినయం, నమ్మకం గల హృదయానికి క్రీస్తు చేసిన అద్భుతాలు ఆయన అభిషిక్తుడనడానికి రుజువులు (మత్తయి 8:1). నమ్మకూడదని పట్టుబట్టి కూర్చున్నవారిని కళ్ళు చెదరగొట్టే అద్భుతాలైనా సరే నమ్మించలేవు. లూకా 16:31 పోల్చి చూడండి.

39. వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగు చున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.

వ్యభిచార సంబంధమైన తరం అంటే ఆధ్యాత్మికంగా దేవునికి ద్రోహం చేసిన తరం. యిర్మియా 2:2; యెహెఙ్కేలు 23:2-3; హోషేయ 1:2 నోట్స్ చూడండి. అలాంటి తరం దేవునిలో, ఆయన వాక్కులో, ఆయన కుమారునిలో నమ్మకం ఉంచడానికి సిద్ధంగా ఉండదు.

40. యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
యోనా 1:17

యూదులు రోజులో ఒక భాగాన్ని కూడా రోజుగా లెక్కించేవారు. యేసు తన మరణం తరువాత మూడో రోజున సజీవంగా లేచాడు (మత్తయి 16:21; మత్తయి 27:64; లూకా 24:7, లూకా 24:21; అపో. కార్యములు 10:40; 1 కోరింథీయులకు 15:4). ఆయన దేవుని కుమారుడు, అభిషిక్తుడు అనడానికి ఆయన సజీవంగా లేవడమే అన్నిటికన్నా గొప్ప సూచకమైన అద్భుతం. మత్తయి 28:6 నోట్ చూడండి. యోనా చరిత్ర పాత ఒడంబడిక గ్రంథంలో “యోనా” పుస్తకంలో ఉంది.

41. నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
యోనా 3:5, యోనా 3:8

ఇక్కడ యేసుప్రభువు తనను తాను యోనాకంటే ఘనుడుగా చెప్పుకుంటున్నాడు. యోనా ఎలాంటి అద్భుత క్రియా చెయ్యలేదు. అయినా నీనెవె నగరం పశ్చాత్తాప పడింది. ఇతర జనాలుండే ఆ నగరం దేవునికి తల వంచింది గానీ దేవుని స్వంత ప్రజలైన ఇస్రాయేల్‌వారు అనేకమైన మహత్తులు చూచి కూడా ఆయనకు వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. యోనా 1:2 దగ్గర “నీనెవె” గురించి నోట్ చూడండి.

42. విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
1 రాజులు 20:1-10, 2 దినవృత్తాంతములు 9:1-12

1 రాజులు 10:1. ఇస్రాయేల్‌కు దక్షిణాన చాలా దూరంలో ఉంది షేబదేశం. ఈ లోకంలో జీవించిన వారందరిలోకీ మహా జ్ఞాని సొలొమోను (1 రాజులు 3:10-12; 1 రాజులు 4:29-34). అయితే దేవుని కుమారుడైన యేసుప్రభువుతో పోల్చుకుంటే అతని జ్ఞానం ఎందుకూ కొరగానిది.

43. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.

“మలిన పిశాచం”– మత్తయి 4:24 నోట్ చూడండి. దయ్యాలు ఏదో ఒక దేహంలో చేరి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాయి. మత్తయి 8:31 చూడండి.

44. విశ్రాంతి దొరకనందుననేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును.

ఇల్లు అంటే ఆ దయ్యం విడిచిపెట్టి వచ్చిన మనిషి. “శుభ్రంగా ఊడ్చి సర్ది పెట్టి ఉండడం” అంటే దేవునితో నిమిత్తం లేకుండా దిద్దబడిన జీవితం. ఆ ఇంట్లో “ఎవరూ” లేరు. అందులో యేసుప్రభువు లేడు. దేవుని ఆత్మ అక్కడ నివసించడం లేదు.

45. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించు ననెను.

దిద్దుబాటు, సంస్కరణ, మతం, స్వచ్ఛమైన నైతిక జీవనం ఇవి మాత్రమే మనిషి స్థితిని భద్రంగా క్షేమంగా చేయలేవు. దేవుని ఆత్మ వారిలో నివసించకపోతే వారు తమ స్వంత ప్రయత్నాల ద్వారా తమను సరిదిద్దుకోజూస్తే ముందున్న స్థితికంటే అధమమైన స్థితిలోకి సైతాను వారిని తీసుకువెళ్ళగలడు. మనలో క్రీస్తు ఉండడం ఒక్కటే మన రక్షణ, క్షేమస్థితికి ఆధారం (కొలొస్సయులకు 1:27; రోమీయులకు 8:9; ప్రకటన గ్రంథం 3:20). ఆ తరం ఇస్రాయేల్‌వారికి యేసు ఈ సత్యాన్ని వర్తింపజేశాడు (మత్తయి 23:35-36). మొత్తంమీద వారి తరాలన్నిటిలోకీ అప్పుడున్న తరమే చెడ్డది. ప్రజలు చాలా మతనిష్ఠ కనపరచుకున్నారు. అంతేగాక వారి పూర్వీకులు చేసిన విగ్రహపూజను వదిలిపెట్టారు. అయితే దేవుని కుమారుడంటే వారికి సైతాను సంబంధమైన ద్వేషం ఉంది. వారు ఆయన్ను నిరాకరించి సిలువ వేశారు. దేవుడు వారిలో లేడు గనుక, సైతానుకు వారి “ఇంటిలో” చొరబడే అవకాశం దొరికింది గనుక వారి స్థితి అలాంటిదయింది. సైతాను తనతోబాటు మరెన్నో పిశాచాలను వెంటబెట్టుకు వచ్చి దానిలో చొరబడ్డాడు.

46. ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.

యేసుప్రభువును ఆయన పని మాన్పించి ఇంటికి తీసుకుపోవడం వాళ్ళ ఉద్దేశంలా ఉంది. మార్కు 3:21, మార్కు 3:31-32; మార్కు 6:3 చూడండి. ఆ సమయానికి ఆయన తమ్ముళ్ళకు ఆయనే అభిషిక్తుడన్న నమ్మకం కలగలేదు (యోహాను 7:5). ఆయన తల్లి మరియ కూడా తాత్కాలికంగా ఆయన్ను శంకించినట్టు ఇక్కడ కనిపిస్తున్నది.

47. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.

48. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి

49. తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;

ఆధ్యాత్మిక సంబంధాలు కుటుంబ సంబంధాలకంటే ఎక్కువ ప్రియమైనవి, ప్రధానమైనవి అని ఆయన మాటల్లో భావం. తనను అనుసరించే వారి విషయంలో ఇది నిజం కావాలని ఆయన చెప్పాడు (మత్తయి 10:37 చూడండి). ఆయన జీవితంలో ఇది సంపూర్ణంగా నిజమైంది. మనం ఆయన ఇష్టప్రకారం చేసేవారమైతే ఆయన మనల్ని కూడా తన తల్లిగా తోబుట్టువులుగా ఎంచుతాడు. ఆయన శిష్యులే ఆయన కుటుంబం. హెబ్రీయులకు 2:11-12 చూడండి.

50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సబ్బాత్ రోజున మొక్కజొన్నలు పండించినందుకు యేసు తన శిష్యులను సమర్థించాడు. (1-8) 
మొక్కజొన్న పొలాల మధ్య, శిష్యులు మొక్కజొన్నలను కోసే పనిని ప్రారంభించారు. ద్వితీయోపదేశకాండము 5:14లో చెప్పబడినట్లుగా, దేవుని చట్టం ప్రకారం ఈ చర్య అనుమతించబడుతుందని గమనించాలి. చట్టాన్ని దాని ఉద్దేశించిన ఉద్దేశ్యానికి అనుగుణంగా మరియు వైరుధ్యాలను సృష్టించని విధంగా అర్థం చేసుకోవడం మరియు వర్తింపజేయడం చాలా ముఖ్యం. క్రీస్తు సబ్బాత్‌పై అధికారాన్ని కలిగి ఉన్నందున, ఆ రోజు మరియు దానికి సంబంధించిన కార్యకలాపాలు రెండూ ఆయనకు అంకితం చేయడం సముచితం.

యేసు సబ్బాత్ నాడు ఎండిపోయిన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. (9-13) 
కనికరం యొక్క చర్యలు అనుమతించబడటమే కాకుండా ప్రభువు రోజున నిర్వహించడానికి తగినవి అని క్రీస్తు వర్ణించాడు. ఆచార ఆరాధన బాధ్యతలకు మించి దయతో కూడిన చర్యలకు సబ్బాత్ పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది. ఇందులో జబ్బుపడిన వారిని ఆదుకోవడం, తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయడం, అత్యవసర అవసరాలలో ఉన్నవారికి సహాయం చేయడం మరియు యువకులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడం, తద్వారా వారి ఆత్మ సంక్షేమానికి తోడ్పడడం వంటివి ఉంటాయి. ఆదికాండము 4:7లో సూచించిన విధంగా ఇటువంటి చర్యలు సద్గుణమైనవిగా పరిగణించబడతాయి మరియు ప్రేమ, వినయం మరియు నిస్వార్థతతో నిర్వహించబడాలి. ఈ ఎపిసోడ్, క్రీస్తు చేసిన ఇతర అద్భుత స్వస్థతలాగా, లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సహజంగానే, మన సామర్థ్యాలు బలహీనపడతాయి మరియు మనం స్వంతంగా ఎలాంటి ధర్మకార్యాలు చేయలేము. క్రీస్తు దయ ద్వారా మాత్రమే మనం పునరుద్ధరించబడగలము; అతను ఆధ్యాత్మికంగా చనిపోయిన ఆత్మలో జీవాన్ని నింపడం ద్వారా ఎండిపోయిన చేతిని పునరుజ్జీవింపజేస్తాడు, కోరికలు మరియు మంచి పనులను సాధించగలడు. అతని ఆజ్ఞతో పాటు, వాక్యంలో పొందుపరచబడిన దయ యొక్క వాగ్దానం ఉంది.

పరిసయ్యుల దుర్మార్గం. (14-21) 
యేసుకు మరణశిక్ష విధించడానికి దారితీసే ఆరోపణను కనుగొనడానికి పరిసయ్యులు కుట్ర పన్నారు. వారి పథకం గురించి తెలుసుకుని, తన సమయం ఇంకా రాలేదని తెలుసుకుని, అతను ఆ స్థలం నుండి వైదొలిగాడు. ప్రవక్త ద్వారా వర్ణించబడిన క్రీస్తు యొక్క సారూప్యత నీటిలో ప్రతిబింబం వలె స్పష్టంగా ఉంది, సువార్తికులు చిత్రీకరించిన అతని స్వభావం మరియు ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. సంతోషకరమైన విశ్వాసంతో, అటువంటి దయగల మరియు దృఢమైన స్నేహితుడికి మన ఆత్మలను అప్పగిద్దాం. పగలగొట్టే బదులు, పెళుసుగా ఉండే రెల్లును బలపరుస్తాడు; బలహీనంగా మండుతున్న అవిసెను ఆర్పివేయడం కంటే, అతను దానికి ప్రాణం పోసి మంటను వెలిగిస్తాడు. మనము కలహమైన మరియు ఆవేశపూరితమైన వివాదాలను పక్కనపెట్టి, క్రీస్తు మనలను ఆలింగనం చేసుకున్నట్లుగానే ఒకరినొకరు ఆలింగనం చేద్దాం. మన ప్రభువు దయతో ప్రోత్సహించబడి, ఆయన మాదిరిని అనుకరించగలిగేలా ఆయన ఆత్మ మనలో ఉండేలా ప్రార్థిద్దాం.

యేసు దయ్యం ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. (22-30) 
సాతాను ఆధిపత్యంలో ఉన్న ఒక ఆత్మ, అతని ప్రభావంతో బందీగా తీసుకువెళుతుంది, దేవుని కృప సమక్షంలో ఆధ్యాత్మికంగా అంధుడిగా మరియు స్వరం లేకుండా ఉంటుంది. అలాంటి ఆత్మ సత్యాన్ని గ్రహించదు లేదా ప్రార్థనలో సమర్థవంతంగా మాట్లాడదు. సాతాను అవిశ్వాసం ద్వారా ఒకరి దృష్టిని అస్పష్టం చేస్తాడు మరియు ఒకరి పెదవులకు ముద్ర వేస్తాడు, ప్రార్థన సామర్థ్యాన్ని అణచివేస్తాడు. ప్రజలు క్రీస్తును ఎంతగా ఉద్ధరించారో, పరిసయ్యులు ఆయనను అపఖ్యాతి పాలు చేయడానికి వారి ప్రయత్నాలలో మరింత నిశ్చయించుకున్నారు. దయ్యాలను పారద్రోలడంలో సాతాను యేసుకు సహాయం చేస్తే, అంధకార రాజ్యం అసమ్మతిలో ఉందని మరియు భరించలేకపోతుందని స్పష్టమైంది. దీనికి విరుద్ధంగా, యేసు దెయ్యాలను దెయ్యాలను బహిష్కరించాడని వారు వాదిస్తే, వారి స్వంత అనుచరులు మరే ఇతర అధికారం ద్వారా ఇలాంటి భూతవైద్యం చేశారని చెప్పడానికి వారికి ఎటువంటి ఆధారం లేదు. ఈ ప్రపంచంలో, రెండు ముఖ్యమైన శక్తులు ప్రభావం కోసం పోటీ పడుతున్నాయి. అపవిత్రాత్మలు పవిత్రాత్మ ద్వారా బహిష్కరించబడినప్పుడు, పాపులను విశ్వాసం మరియు విధేయతతో కూడిన జీవితం వైపు నడిపించినప్పుడు, దేవుని రాజ్యం సమీపిస్తుంది. అటువంటి పరివర్తనలకు మద్దతు ఇవ్వని లేదా జరుపుకోని వారు, సారాంశంలో, క్రీస్తును వ్యతిరేకిస్తారు.

పరిసయ్యుల దూషణ. (31,32) 
ఈ భాగం సువార్త నిబంధనల ద్వారా అన్ని పాపాల క్షమాపణ యొక్క దయగల హామీని అందిస్తుంది. అలా చేయడం ద్వారా, క్రీస్తు మానవాళికి ఒక ఉదాహరణగా నిలుస్తాడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలను క్షమించేందుకు సిద్ధంగా ఉండమని ప్రోత్సహిస్తాడు. ఏది ఏమైనప్పటికీ, వినయపూర్వకమైన మరియు మనస్సాక్షిగల విశ్వాసులు కొన్నిసార్లు క్షమించరాని పాపం చేశామని నమ్మడానికి శోదించబడవచ్చు, అయినప్పటికీ దానికి దగ్గరగా వచ్చిన వారు చాలా అరుదుగా అలాంటి భయాలను కలిగి ఉంటారు. యథార్థంగా పశ్చాత్తాపపడి, సువార్తను స్వీకరించే వారు ఈ పాపం లేదా అలాంటిదేమీ చేయలేదని మనం నమ్మకంగా ఉండవచ్చు. పశ్చాత్తాపం మరియు విశ్వాసం దేవుని నుండి విలువైన బహుమతులు, అతను వారిని ఎప్పటికీ క్షమించకూడదని సంకల్పించినట్లయితే అతను ఎవరికీ ఇవ్వడు. తాము ఈ పాపం చేశామని భయపడేవారు నిజానికి తాము చేయలేదని నిరూపిస్తారు. వణుకుతున్న, పశ్చాత్తాపం చెందిన పాపం అలాంటి స్థితిలో లేమని తమలో తాము సాక్ష్యం చెప్పుకుంటారు.

చెడు మాటలు చెడ్డ హృదయం నుండి వస్తాయి. (33-37) 
ఒక వ్యక్తి యొక్క భాష వారి మూలాన్ని బహిర్గతం చేయడమే కాకుండా వారి ఆత్మ యొక్క స్వభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. హృదయం మూలంగా పనిచేస్తుంది, పదాలు బాహ్య వ్యక్తీకరణగా పనిచేస్తాయి. హృదయం కలతతో మరియు అపరిశుభ్రంగా ఉంటే, అది బురద మరియు ఆకర్షణీయం కాని ప్రసంగాన్ని ఇస్తుంది. దయ యొక్క సంరక్షించే ప్రభావం మాత్రమే, హృదయంలోకి ప్రవేశించినప్పుడు, మూలాన్ని శుద్ధి చేయగలదు, ఒకరి ప్రసంగాన్ని రుచి చూస్తుంది మరియు కలుషిత సంభాషణను శుద్ధి చేస్తుంది. దుష్ట హృదయం ఉన్న వ్యక్తి లోపల చెడు నిధిని కలిగి ఉంటాడు మరియు తత్ఫలితంగా చెడు వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. కోరికలు మరియు అవినీతి ఉనికి, హృదయంలో నివసించడం మరియు పాలించడం, ఈ చెడు నిధిని ఏర్పరుస్తుంది, దాని నుండి పాపి దేవుణ్ణి అగౌరవపరిచే మరియు ఇతరులకు హాని కలిగించే మాటలు మరియు పనులను ముందుకు తెస్తాడు. మన మాటలు క్రైస్తవ పాత్ర విలువలకు అనుగుణంగా ఉండేలా మనల్ని మనం శ్రద్ధగా పర్యవేక్షించుకుందాం.

శాస్త్రులు మరియు పరిసయ్యులు ఒక సంకేతాన్ని కోరినందుకు మందలించారు. (38-45) 
నిష్కపటమైన మరియు నీతియుక్తమైన కోరికలు మరియు ప్రార్థనలను వినడానికి మరియు ప్రతిస్పందించడానికి క్రీస్తు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ, స్వార్థపూరితమైన లేదా తప్పుదారి పట్టించే అభ్యర్థనలు చేసే వారు ఏమీ పొందలేరు. అబ్రహం మరియు గిడియాన్ వంటి వ్యక్తులకు సంకేతాలు మంజూరు చేయబడ్డాయి, వారు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి వారిని వెతుకుతున్నారు, కానీ వారి అవిశ్వాసానికి సాకులుగా సంకేతాలను కోరిన వారి నుండి వారు నిలిపివేయబడ్డారు. క్రీస్తు పునరుత్థానం తన స్వంత శక్తితో, తరచుగా "యోనా ప్రవక్త యొక్క సంకేతం"గా సూచించబడుతుంది, ఇది మెస్సీయగా అతని గుర్తింపుకు బలవంతపు సాక్ష్యంగా నిలుస్తుంది. జోనా తిమింగలం కడుపులో మూడు పగలు మరియు రాత్రులు గడిపి, సజీవంగా బయటపడినట్లే, క్రీస్తు కూడా తన విజయవంతమైన పునరుత్థానానికి ముందు సమాధిలో అదే సమయాన్ని గడిపాడు.
పశ్చాత్తాపం చెందడంలో విఫలమైనందుకు నినెవైయులు యూదులకు మందలింపుగా ఉపయోగపడతారు మరియు షెబా రాణి క్రీస్తును విశ్వసించనందుకు వారిని అవమానిస్తుంది. మరోవైపు, మనం క్రీస్తును సమీపించేటప్పుడు అలాంటి అనిశ్చితులు ఉండవు. ఈ ఉపమానం యూదు చర్చి మరియు దేశం యొక్క స్థితికి అద్దం పడుతుంది, అయితే ఇది దేవుని వాక్యాన్ని విని, కొన్ని బాహ్య సంస్కరణలు చేసిన, ఇంకా హృదయంలో మార్పు చెందని వారందరికీ వర్తిస్తుంది. అపవిత్రాత్మ కొంత కాలానికి వెళ్లిపోతుంది, కానీ తిరిగి వచ్చిన తర్వాత, క్రీస్తు లేనందున ఎటువంటి ప్రతిఘటన కనిపించదు. బాహ్య మార్పుల ద్వారా హృదయం శుద్ధి చేయబడి ఉండవచ్చు, కానీ దుష్ట సూచనలను స్వాగతించే విధంగా అలంకరించబడి ఉంటుంది, వ్యక్తిని సత్యానికి గట్టి విరోధిగా మారుస్తుంది. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా పరిశుద్ధాత్మచేత నివసించిన హృదయము తప్ప ప్రతి హృదయము అపవిత్రాత్మలకు సంభావ్య నివాసము.

క్రీస్తు శిష్యులు అతని సన్నిహిత సంబంధాలు. (46-50)
క్రీస్తు ప్రబోధం సూటిగా, అందుబాటులోకి మరియు సాపేక్షంగా, అతని ప్రేక్షకులకు అనుగుణంగా ఉంది. అతని తల్లి మరియు తోబుట్టువులు బయట వేచి ఉన్నారు, వారు లోపల ఉన్నప్పుడు అతనితో మాట్లాడాలని కోరుకుంటారు, అతనిని వినడానికి ఆసక్తిగా ఉన్నారు. తరచుగా, జ్ఞానానికి మరియు అనుగ్రహానికి దగ్గరగా ఉన్నవారు అత్యంత ఆత్మసంతృప్తి కలిగి ఉంటారు. రేపు అనిశ్చితమని మరచిపోతూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మేము విశ్వసిస్తున్న వాటిని విస్మరిస్తాము. తరచుగా, ప్రాపంచిక ఆందోళనలు మరియు స్నేహితుల జోక్యం మన ఆధ్యాత్మిక బాధ్యతల నుండి మనల్ని మళ్లిస్తాయి. క్రీస్తు తన మిషన్‌పై చాలా దృష్టి పెట్టాడు, ఏ వ్యక్తిగత లేదా భూసంబంధమైన బాధ్యత అతనిని కలవరపెట్టలేదు. మనం మన తల్లిదండ్రుల పట్ల అగౌరవంగా ప్రవర్తించాలని లేదా మన కుటుంబం పట్ల దయ చూపాలని సూచించడం కాదు; అయినప్పటికీ, ఎక్కువ డ్యూటీని పిలిచినప్పుడు, మనం తక్కువ వాటి కంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన దృష్టిని ప్రజల నుండి మరల్చండి మరియు క్రీస్తుకు మనల్ని మనం అంకితం చేద్దాం. ప్రతి క్రైస్తవుని జీవితంలో వారి స్థానంతో సంబంధం లేకుండా, మహిమగల ప్రభువు యొక్క సోదరుడు, సోదరి లేదా తల్లిగా పరిగణిద్దాం. ఆయన పేరిట మరియు ఆయన మాదిరిని అనుసరిస్తూ, వారిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, దయ చూపుదాం.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |