Deuteronomy - ద్వితీయోపదేశకాండము 2 | View All
Study Bible (Beta)

1. మరియయెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితివిు.

1. Then we turned, and tooke our iourney into the wildernes, by the way of the red Sea, as the Lord spake vnto me: and we compassed mount Seir a long time.

2. అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్నెము చుట్టు తిరిగినకాలము చాలును;

2. And the Lord spake vnto me, saying,

3. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము

3. Ye haue compassed this mountaine long ynough: turne you Northward.

4. శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.

4. And warne thou the people, saying, Ye shall go through the coast of your brethren the children of Esau, which dwell in Seir, and they shall be afraide of you: take ye good heede therefore.

5. వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చి యున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.
అపో. కార్యములు 7:5

5. Ye shall not prouoke them: for I wil not giue you of their land so much as a foot breadth, because I haue giuen mount Seir vnto Esau for a possession.

6. మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.

6. Ye shall buy meate of them for money to eate, and ye shall also procure water of them for money to drinke.

7. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు.

7. For the Lord thy God hath blessed thee in all the workes of thine hand: he knoweth thy walking through this great wildernes, and the Lord thy God hath bene with thee this fourtie yeere, and thou hast lacked nothing.

8. అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.

8. And when we were departed from our brethren the children of Esau which dwelt in Seir, through the way of the plaine, from Elath, and from Ezion-gaber, we turned and went by the way of the wildernes of Moab.

9. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.

9. Then the Lord sayd vnto me, Thou shalt not vexe Moab, neither prouoke them to battel: for I wil not giue thee of their land for a possession, because I haue giuen Ar vnto the children of Lot for a possession.

10. పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.

10. The Emims dwelt therein in times past, a people great and many, and tall, as the Anakims.

11. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.

11. They also were taken for gyants as the Anakims: whom the Moabites call Emims.

12. పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.

12. The Horims also dwelt in Seir before time, whome the children of Esau chased out and destroyed them before them, and dwelt in their steade: as Israel shall doe vnto the land of his possession, which the Lord hath giuen them.

13. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరుదాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితివిు.

13. Now rise vp, sayd I, and get you ouer the riuer Zered: and we went ouer the riuer Zered.

14. మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరుదాటువరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు

14. The space also wherein we came from Kadesh-barnea, vntill we were come ouer the riuer Zered, was eight and thirtie yeeres, vntill all the generation of the men of warre were wasted out from among the hoste, as the Lord sware vnto them.

15. సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.

15. For in deede the hand of the Lord was against them, to destroy them from among the hoste, till they were consumed.

16. సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.

16. So when all the men of warre were consumed and dead from among the people:

17. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా నున్న ఆరు దేశము దాటబోవుచున్నావు.

17. Then the Lord spake vnto me, saying,

18. అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు

18. Thou shalt goe through Ar the coast of Moab this day:

19. వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.

19. And thou shalt come neere ouer against the children of Ammon: but shalt not lay siege vnto them, nor moue warre against them: for I will not giue thee of the land of the children of Ammon any possession: for I haue giuen it vnto the children of Lot for a possession.

20. అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమీ్మయులందురు.

20. That also was taken for a land of gyants: for gyants dwelt therein afore time, whome the Ammonites called Zamzummims:

21. వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి.

21. A people that was great, and many, and tall, as the Anakims: but the Lord destroyed them before them, and they succeeded them in their inheritance, and dwelt in their stead:

22. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారిచోట నివసించుచున్నారు.

22. As he did to the children of Esau which dwell in Seir, when he destroyed the Horims before them, and they possessed them, and dwelt in their stead vnto this day.

23. గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.

23. And the Auims which dwelt in Hazarim euen vnto Azzah, the Caphtorims which came out of Caphtor destroyed them, and dwelt in their steade.

24. మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.

24. Rise vp therefore, sayd the Lord: take your iourney, and passe ouer the riuer Arnon: beholde, I haue giuen into thy hand Sihon, the Amorite, King of Heshbon, and his land: begin to possesse it and prouoke him to battell.

25. నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.

25. This day wil I begin to send thy feare and thy dread, vpon all people vnder the whole heauen, which shall heare thy fame, and shall tremble and quake before thee.

26. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి

26. Then I sent messengers out of the wildernes of Kedemoth vnto Sihon King of Heshbon, with wordes of peace, saying,

27. నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.

27. Let me passe through thy land: I will go by the hie way: I will neither turne vnto the right hand nor to the left.

28. నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.

28. Thou shalt sell me meate for money, for to eate, and shalt giue me water for money for to drinke: onely I will go through on my foote,

29. శేయీరులో నివసించు ఏశావు సంతాన పువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.

29. (As the children of Esau which dwell in Seir, and the Moabites which dwell in Ar, did vnto me) vntill I be come ouer Iorden, into the land which the Lord our God giueth vs.

30. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.

30. But Sihon the King of Heshbon would not let vs passe by him: for the Lord thy God had hardened his spirit, and made his heart obstinate, because hee would deliuer him into thine hand, as appeareth this day.

31. అప్పుడు యెహోవా చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను.

31. And the Lord sayd vnto me, Beholde, I haue begun to giue Sihon and his land before thee: begin to possesse and inherite his land.

32. సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా

32. Then came out Sihon to meete vs, him selfe with all his people to fight at Iahaz.

33. మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి

33. But the Lord our God deliuered him into our power, and we smote him, and his sonnes, and all his people.

34. ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.

34. And we tooke all his cities the same time, and destroyed euery citie, men, and women, and children: we let nothing remaine.

35. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.

35. Onely the cattell we tooke to our selues, and the spoyle of the cities which we tooke,

36. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.

36. From Aroer, which is by the banke of the riuer of Arnon, and from the citie that is vpon the riuer, euen vnto Gilead: there was not one citie that escaped vs: for the Lord our God deliuered vp all before vs.

37. అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.

37. Onely vnto the land of the children of Ammon thou camest not, nor vnto any place of the riuer Iabbok, nor vnto the cities in the mountaines, nor vnto whatsoeuer the Lord our God forbade vs.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఎదోమీయులు తప్పించబడాలి. (1-7) 
ఇశ్రాయేలు ప్రజలు చాలా కాలం పాటు ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారికి ఎలా సహాయం చేసాడో ఈ కథ చెబుతుంది. కొన్నిసార్లు వారు ఫిర్యాదు చేశారు మరియు దేవుణ్ణి నమ్మరు, కాబట్టి అతను వారిని శిక్షించాడు. అయితే మంచిగా ఎలా ఉండాలో మరియు అతనిని ఎలా అనుసరించాలో ముఖ్యమైన పాఠాలను కూడా అతను వారికి నేర్పించాడు. కొంత సమయం పట్టినప్పటికీ, చివరికి దేవుడు వారి శత్రువులను ఓడించి కొత్త దేశానికి వెళ్లేందుకు సహాయం చేశాడు. కానీ వారు అలా చేయకముందే, వేరే ప్రదేశంలో ఉన్న శత్రువుల పట్ల దయగా ఉండమని వారికి బోధించాడు. మీది కాని వాటిని తీసుకోవడానికి మతాన్ని సాకుగా ఉపయోగించవద్దు. మీరు దేవుణ్ణి నమ్మినంత మాత్రాన మీకు కావలసినది తీసుకోవచ్చు అని కాదు. దేవుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, కానీ మీరు ప్రతిదీ మీకు అప్పగించాలని ఆశించవచ్చని కాదు. ఎల్లప్పుడూ సరైన పని చేయండి మరియు మీకు కావలసినదాన్ని పొందడానికి మోసం లేదా అన్యాయం చేయవద్దు. మీ వద్ద ఉన్నదాన్ని ఉపయోగించుకోండి మరియు దానితో సంతోషంగా ఉండండి మరియు దేవుడు మీకు అందిస్తాడని నమ్మండి. దేవుణ్ణి నమ్మే ఎవరికైనా ఈ సలహా ముఖ్యం. 

మోయాబీయులు మరియు అమ్మోనీయులు తప్పించబడాలి. (8-23) 
మోయాబీయులు మరియు అమ్మోనీయులు వంటి వివిధ సమూహాల ప్రజల ప్రారంభాల గురించి మోషే మనకు చెప్పాడు. కాఫ్టోరిమ్స్ అనే సమూహం చాలా కాలం క్రితం ఏవిమ్స్ అనే మరొక సమూహం నుండి భూమిని ఎలా స్వాధీనం చేసుకుంది అనే దాని గురించి కూడా అతను మాట్లాడాడు. భూమి వంటి వాటిని స్వంతం చేసుకోవడం అనిశ్చితంగా మరియు తరచుగా కుటుంబాల మధ్య చేతులు మారుతుందని ఇది మాకు చూపుతుంది. దేవుడు ఇతరుల పట్ల శ్రద్ధ వహించినట్లే వారిని కూడా చూసుకుంటాడని వారిని ప్రోత్సహించడానికి మోషే ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు. మోయాబీయులు మరియు అమ్మోనీయులతో చెడ్డవారైనప్పటికీ, దేవుడు అందరిని చూసుకుంటాడు కాబట్టి వారితో చెలగాటమాడవద్దని కూడా హెచ్చరించాడు. 

అమోరీయులు నాశనం చేయబడతారు. (24-37)
మోయాబు మరియు అమ్మోను దేశాల్లోకి వెళ్లవద్దని దేవుడు తన ప్రజలకు చెప్పాడు, బదులుగా వారికి అమోరీయుల దేశాన్ని ఇచ్చాడు. దేవుడు చెప్పిన దానిని పాటిస్తే మనకు ప్రతిఫలం లభిస్తుంది. దేవుడు ప్రతిదీ కలిగి ఉన్నాడు మరియు అతను కోరుకున్న వారికి ఇస్తాడు, కానీ అతను నిషేధించిన పనిని చేయడానికి అతని యాజమాన్యాన్ని సాకుగా ఉపయోగించలేము. దేవుడు ఇశ్రాయేలీయులకు భూమిని వాగ్దానం చేసినప్పటికీ, వారు దాని కోసం పోరాడవలసి వచ్చింది. భగవంతుడు మనకు ఇచ్చిన వాటిని పొందేందుకు మనం కష్టపడాలి. ఇజ్రాయెల్ కొత్త మరియు సంతోషకరమైన ప్రదేశంలోకి ప్రవేశించింది మరియు మంచి వ్యక్తులు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళినప్పుడు అది మరింత మెరుగ్గా ఉంటుంది. మనం ఇజ్రాయెల్ అనుభవాల నుండి నేర్చుకోగలము మరియు తప్పు పనులు చేస్తూ సమయాన్ని ఎలా వృధా చేసామో ఆలోచించవచ్చు. కానీ యేసును అనుసరించే మరియు వారి హృదయాలలో అతని ఆత్మను కలిగి ఉన్న వ్యక్తులు భూమిపై ఏమి జరిగినా, ఎప్పటికీ సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటారు. 



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |