Hebrews - హెబ్రీయులకు 10 | View All

1. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

1. ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించే వాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు.

2. ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.

2. అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు.

3. అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి

3. కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి.

4. ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
లేవీయకాండము 16:15, లేవీయకాండము 16:21

4. ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాప పరిహారం కలుగటమనేది అసంభవం.

5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి.
కీర్తనల గ్రంథము 40:6-8

5. ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు: ‘బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు కాని, నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు.

6. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు.

6. జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని, పాప పరిహారం కోసం యిచ్చిన బలులు కాని, నీకు అనందం కలిగించలేదు.

7. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

7. అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను! నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు. నేను నీ యిచ్చ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.” కీర్తన 40:6-8.

8. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

8. “బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని, నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది.

9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

9. ఆ తర్వాత క్రీస్తు,” ఇదిగో దేవా!ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవ దాన్ని నెరవేర్చటానికి మొదటి దాన్ని రద్దుచేశాడు.

10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.
కీర్తనల గ్రంథము 40:6-8

10. దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే.

11. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.
నిర్గమకాండము 29:38

11. ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాప పరిహారం చెయ్యలేవు.

12. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,
కీర్తనల గ్రంథము 110:1

12. కాని క్రీస్తు మన పాప పరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండి పొయ్యాడు.

13. అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.
కీర్తనల గ్రంథము 110:1

13. అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు.

14. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

14. ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.

15. ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చు చున్నాడు.

15. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:

16. ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత

16. “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను. నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”యిర్మీయా 31:33

17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.
యిర్మియా 31:34

17. ఆ పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు: ‘వాళ్ళ పాపాల్ని, దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!’ యిర్మీయా 31:34

18. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

18. వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

19. సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది.

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

20. ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు.

21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,
సంఖ్యాకాండము 12:7, జెకర్యా 6:12-13

21. అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు.

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
యెహెఙ్కేలు 36:25

22. తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం.

23. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

23. మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.

24. కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,

24. ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం.

25. ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.

25. సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహ పరచుకొంటూ ఉందాం.

26. మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలియికను ఉండదు గాని

26. సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది?

27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
యెషయా 26:11

27. తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలురానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి.

28. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.
ద్వితీయోపదేశకాండము 17:6, ద్వితీయోపదేశకాండము 19:15

28. మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించే వాళ్ళు.

29. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
నిర్గమకాండము 24:8

29. మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి.

30. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.
ద్వితీయోపదేశకాండము 32:35-36, కీర్తనల గ్రంథము 135:14

30. “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు,”ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు” అని అన్న వాడు ఎవరో మనకు తెలుసు.

31. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.

31. సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.

32. అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.

32. మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు.

33. ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.

33. కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించే వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు.

34. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.

34. అంతేకాక, చెరసాలల్లో ఉన్న వాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా ‘మీ ఆస్తుల్ని’ దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.

35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

35. అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతి ఫలం లభిస్తుంది.

36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

36. మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్చే ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసిన దాన్ని ప్రసాదిస్తాడు.

37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.
హబక్కూకు 2:3-4

37. ఎందుకంటే, త్వరలోనే, “వస్తున్నాడు, వస్తాడు, ఆలస్యం చెయ్యడు!

38. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

38. నీతిమంతులైన నా ప్రజలు నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు. కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే నా ఆత్మకు ఆనందం కలుగదు.’ హబక్కూకు 2:3-4

39. అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

39. కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయే వాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడే వాళ్ళ లాంటివారం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Hebrews - హెబ్రీయులకు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పాపాన్ని తీసివేయడానికి త్యాగం యొక్క అసమర్థత, ఆ ప్రయోజనం కోసం క్రీస్తు త్యాగం యొక్క అవసరం మరియు శక్తి. (1-18) 

1-10
సీనాయ్ ఒడంబడిక యొక్క గుడారం మరియు శాసనాలు సువార్త యొక్క చిహ్నాలు మరియు ప్రాతినిధ్యాలు మాత్రమే అని అపొస్తలుడు ప్రదర్శించాడు. ప్రధాన పూజారులు అర్పించే నిరంతర త్యాగాలు క్షమాపణ మరియు మనస్సాక్షి శుద్ధీకరణ పరంగా ఆరాధకులకు పరిపూర్ణతను సాధించలేవని అతను ముగించాడు. ఏది ఏమైనప్పటికీ, "దేవుడు దేహంలో ప్రత్యక్షమయ్యాడు" అనేది బలి అర్పణగా మారినప్పుడు మరియు శపించబడిన చెట్టుపై అతని మరణం విమోచన క్రయధనంగా పనిచేసినప్పుడు, బాధపడ్డ వ్యక్తి యొక్క అనంతమైన విలువ అతని స్వచ్ఛంద బాధలను అపరిమితమైన విలువైనదిగా చేసింది. ప్రాయశ్చిత్త త్యాగానికి సమ్మతించే మరియు ఇష్టపూర్వకంగా పాపుల స్థానాన్ని ఆక్రమించగల వ్యక్తి అవసరం, మరియు క్రీస్తు ఈ అవసరాన్ని నెరవేర్చాడు. క్రీస్తు తన ప్రజల కోసం సాధించిన అన్నిటికీ మూలం దేవుని సార్వభౌమ సంకల్పం మరియు దయ. క్రీస్తు ప్రవేశపెట్టిన నీతి మరియు అర్పించిన త్యాగం శాశ్వతమైన శక్తిని కలిగి ఉంటుంది, అతని మోక్షం శాశ్వతమైనదని నిర్ధారిస్తుంది. ఈ మూలకాలు తమ వద్దకు వచ్చే వారందరినీ పరిపూర్ణం చేసే శక్తిని కలిగి ఉంటాయి, విధేయత కోసం బలం మరియు ప్రేరణలను పొందుతాయి, అలాగే ప్రాయశ్చిత్త రక్తం నుండి అంతర్గత సౌకర్యాన్ని అందిస్తాయి.

11-18
కొత్త ఒడంబడిక లేదా సువార్త యుగంలో, సంపూర్ణమైన మరియు అంతిమ క్షమాపణ సాధించబడుతుంది. ఇది కొత్త ఒడంబడికకు మరియు పాత ఒడంబడికకు మధ్య ముఖ్యమైన వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. పాత ఒడంబడికలో, త్యాగాలు తరచుగా పునరావృతం చేయబడాలి మరియు అప్పుడు కూడా, వారు భూసంబంధమైన విషయాల కోసం మాత్రమే క్షమాపణను అందించారు. దీనికి విరుద్ధంగా, కొత్త ఒడంబడిక ప్రకారం, అన్ని దేశాలకు మరియు అన్ని యుగాలకు ఆధ్యాత్మిక క్షమాపణను పొందేందుకు, మరణానంతర జీవితంలో శిక్ష నుండి వ్యక్తులను విడిపించేందుకు ఒకే త్యాగం సరిపోతుంది. దానికి సముచితంగా కొత్త ఒడంబడిక అని పేరు పెట్టారు. దేవుని కుమారుని త్యాగపూరిత ప్రాయశ్చిత్తానికి మానవ ఆవిష్కరణలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఎవరూ భావించకూడదు. కాబట్టి, విశ్వాసం ద్వారా ఈ త్యాగానికి సంబంధాన్ని వెతకడం మరియు విధేయతకు దారితీసే ఆత్మ యొక్క పవిత్రీకరణ ద్వారా మన ఆత్మలలో దాని నిర్ధారణను పొందడం మాత్రమే చర్య. ఈ విధంగా, మన హృదయాలలో వ్రాయబడిన చట్టంతో, మన సమర్థన గురించి మనకు హామీ ఇవ్వబడుతుంది మరియు దేవుడు మన పాపాలను ఇకపై గుర్తుంచుకోడు అని విశ్వసించవచ్చు.

యేసుక్రీస్తు ద్వారా దేవునికి విశ్వాసి యొక్క ప్రాప్తిలో పవిత్ర ధైర్యం మరియు విశ్వాసం మరియు పరస్పర ప్రేమ మరియు కర్తవ్యంలో స్థిరత్వం కోసం ఒక వాదన. (19-25) 
లేఖనం యొక్క ప్రారంభ విభాగాన్ని ముగించిన తర్వాత, అపొస్తలుడు జీవితంలోని ఆచరణాత్మక అంశాలకు సిద్ధాంతాన్ని వర్తింపజేయడం ప్రారంభించాడు. విశ్వాసులకు దేవుని సన్నిధికి ప్రత్యక్ష ప్రవేశం ఉంది కాబట్టి, వారు ఈ అధికారాన్ని ఉపయోగించుకోవడం సముచితం. క్రైస్తవులు అలాంటి ప్రాప్తిని అనుభవించే మార్గం యేసు రక్తం ద్వారా, అతను ప్రాయశ్చిత్త త్యాగం వలె అర్పించాడు. దయగల క్షమాపణతో అనంతమైన పవిత్రత యొక్క అమరిక పూర్తిగా గ్రహించబడలేదు, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మానవ స్వభావం మన పాపాల కోసం గాయపడి గాయపడుతుంది. స్వర్గానికి మార్గం సిలువ వేయబడిన రక్షకుని ద్వారా; అతని మరణం మన జీవితానికి మార్గంగా ఉపయోగపడుతుంది మరియు విశ్వసించే వారికి అతను విలువైనవాడు అవుతాడు. దేవునికి దగ్గరవ్వడం తప్పనిసరి; దూరం పాటించడం అంటే క్రీస్తుని నిర్లక్ష్యం చేయడం. స్వచ్ఛమైన నీటితో శరీరాన్ని కడగడం అనే సూచన చట్టం ప్రకారం నిర్దేశించబడిన ప్రక్షాళన ఆచారాలను సూచిస్తుంది. ఈ సందర్భంలో, బాప్టిజంలో నీటిని ఉపయోగించడం క్రైస్తవులకు వారి ప్రవర్తన స్వచ్ఛంగా మరియు పవిత్రంగా ఉండాలని రిమైండర్‌గా ఉపయోగపడుతుంది.
విశ్వాసులు తమ రాజీపడిన తండ్రి నుండి ఓదార్పు మరియు దయను అనుభవిస్తున్నప్పుడు, వారు జీవితంలోని ప్రతి అంశంలో తమ రక్షకుడైన దేవుని బోధలను ఉదాహరణగా చూపాలి. వారు ఒకరికొకరు ఎలా సేవ చేయగలరో పరిగణలోకి తీసుకోవాలని వారు ప్రోత్సహించబడ్డారు, ప్రత్యేకించి ఒకరినొకరు మరింత శక్తివంతంగా మరియు సమృద్ధిగా ప్రేమను ప్రదర్శించమని, అలాగే మంచి పనులలో నిమగ్నమవ్వాలని కోరారు. సెయింట్స్ యొక్క కమ్యూనియన్ ఒక విలువైన సహాయం మరియు ప్రత్యేకత, ఇది స్థిరత్వం మరియు పట్టుదలని పెంపొందించడం. రాబోయే ట్రయల్ సమయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, వాటిని ఎక్కువ శ్రద్ధ కోసం ప్రేరణగా ఉపయోగించడం. వ్యక్తులందరికీ విచారణ దినం ఆసన్నమైంది-వారి మరణ దినం.

మతభ్రష్టత్వం యొక్క ప్రమాదం. (26-31) 
మతభ్రష్టత్వానికి వ్యతిరేకంగా మరియు పట్టుదలకు అనుకూలంగా ఉన్న ఉపదేశాలు బలవంతపు కారణాలతో బలోపేతం చేయబడ్డాయి. ప్రశ్నలోని పాపం పూర్తిగా మరియు తిరిగి మార్చలేని పరిత్యాగాన్ని కలిగి ఉంటుంది, ఇక్కడ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మరియు దృఢ నిశ్చయంతో, ఏకైక రక్షకుడైన క్రీస్తును అసహ్యించుకుంటారు మరియు తిరస్కరించారు; ప్రత్యేకమైన పవిత్రమైన స్పిరిట్‌ను వ్యతిరేకించడం మరియు ప్రతిఘటించడం; మరియు సువార్తను తిరస్కరించండి మరియు త్యజించండి, మోక్షానికి ఏకైక మార్గం మరియు నిత్యజీవం యొక్క పదాలు. కొంతమంది అపఖ్యాతి పాలైన పాపులకు భూమిపై ఈ విధ్వంసం గురించి భయంకరమైన సూచన ఇవ్వబడుతుంది, దానితో పాటు దానిని భరించడం లేదా తప్పించుకోవడం గురించి నిరాశ భావన ఉంటుంది.
కనికరం లేకుండా మరణించే శిక్ష ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది, కానీ వారు తిరస్కరించిన దయ మరియు దయ ద్వారా దయతో నశించడం కంటే భయంకరమైనది ఏముంటుంది? దేవుని న్యాయమే కాదు, దుర్వినియోగం చేయబడిన అతని దయ మరియు దయ కూడా ప్రతీకారం కోరినప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమ పాపాల కోసం పశ్చాత్తాపపడే ఆత్మలు దయ నుండి మినహాయించబడతారని లేదా క్రీస్తు త్యాగం యొక్క ప్రయోజనాలను అంగీకరించడానికి ఇష్టపడే ఎవరైనా తిరస్కరించబడతారని ఇది సూచించదని స్పష్టం చేయడం చాలా ముఖ్యం. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో వారు ఏ విధంగానూ తిరస్కరించబడరు.

విశ్వాసుల బాధలు మరియు వారి పవిత్ర వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సాహం. (32-39)
ప్రారంభ క్రైస్తవులు గణనీయమైన పోరాటంలో నిమగ్నమై విభిన్నమైన బాధలను ఎదుర్కొన్నారు. క్రైస్తవ ఆత్మ, దాని నిస్వార్థ స్వభావంతో వర్ణించబడి, విశ్వాసులను కనికరం చూపడానికి, సందర్శించడానికి, సహాయం చేయడానికి మరియు ఇతరుల కోసం వాదించడానికి బలవంతం చేస్తుంది. భూసంబంధమైన రాజ్యంలో, ప్రతిదీ క్షణికమైనది-కేవలం నీడలు. నశించే భూసంబంధమైన ఆస్తులకు పూర్తి విరుద్ధంగా, స్వర్గంలోని సాధువుల శాశ్వతమైన ఆనందం శత్రువుల దాడులకు అతీతంగా ఉంటుంది. ఈ శాశ్వతమైన ఆనందం ఇక్కడ ఎదుర్కొన్న ఏవైనా నష్టాలు లేదా కష్టాలకు సమృద్ధిగా భర్తీ చేస్తుంది.
ప్రస్తుతం, సాధువుల సంతోషంలో ఎక్కువ భాగం వాగ్దానాలలోనే ఉంది. ఇది క్రైస్తవులు తమ భూసంబంధమైన పనులను పూర్తి చేయకుండా జీవించడాన్ని అంగీకరించడానికి సహనాన్ని పరీక్షిస్తుంది, దేవుని నిర్ణీత సమయంలో వారి ప్రతిఫలం కోసం వేచి ఉంది. మరణానంతరం, దేవుడు వారి బాధలన్నిటినీ తుదముట్టించడానికి మరియు వారికి జీవితపు కిరీటాన్ని ప్రసాదించడానికి త్వరగా వస్తాడు. క్రైస్తవుల ప్రస్తుత సంఘర్షణ తీవ్రంగా ఉన్నప్పటికీ, అది క్లుప్తంగా ఉంటుంది. అటువంటి చర్యలను అసంతృప్తితో చూస్తూ పట్టుదల లేని వారి నుండి ఉపరితలంపై ఉన్న వృత్తి మరియు కేవలం బాహ్య విధులతో దేవుడు ఎన్నటికీ సంతోషించడు. గతంలో ముఖ్యమైన పరీక్షల ద్వారా విశ్వాసపాత్రంగా ఉన్నవారు తమ విశ్వాసం మరియు సహనం యొక్క పరాకాష్టను-వారి ఆత్మల మోక్షాన్ని పొందే వరకు విశ్వాసం ద్వారా జీవించడం కొనసాగించినప్పుడు వారికి అదే దయను అందించడానికి ఎదురుచూడడానికి కారణం ఉంది. విశ్వాసంతో జీవించడం మరియు విశ్వాసంతో చనిపోవడం మన ఆత్మలకు శాశ్వతమైన భద్రతను నిర్ధారిస్తుంది.



Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |