Hebrews - హెబ్రీయులకు 10 | View All

1. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

“నీడ”– హెబ్రీయులకు 8:2, హెబ్రీయులకు 8:5; హెబ్రీయులకు 9:23-24. సన్నిధి గుడారం, అర్పణలు, నియమాలు, ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్రం మనుషులకోసం క్రీస్తు పరిచర్య, ఆయన విశ్వాసుల శాశ్వత విముక్తి అనే “మంచి విషయాలకు” సూచన లేక నీడ మాత్రమే. “పరిపూర్ణత”– వ 14; హెబ్రీయులకు 2:10; హెబ్రీయులకు 5:9; హెబ్రీయులకు 11:40; హెబ్రీయులకు 12:23. జంతు బలులు ఎవరినీ దేవుని సన్నిధికోసం సంపూర్ణంగా సిద్ధపరచడం అసాధ్యం (హెబ్రీయులకు 7:11, హెబ్రీయులకు 7:19). జంతు బలుల అర్థం కోసం లేవీయకాండము 1:2 నోట్ చూడండి.

2. ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.

హెబ్రీయులకు 9:9. మనుషులకు తమ అర్పణల మూలంగా తమ పాపాలను పూర్తిగా, శాశ్వతంగా తీసివేయడం జరిగిందని అనుకుంటే వారి అంతర్వాణి శుద్ధమై ఉండి, తమ హృదయాలు తమనిక గద్దించవలసిన అవసరం లేదని వారు గ్రహించగలిగి ఉండేవారు. హెబ్రీయులకు 9:14 చూడండి.

3. అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి

4. ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
లేవీయకాండము 16:15, లేవీయకాండము 16:21

“అసాధ్యం”– ఎందుచేత? జంతువులు మనుషుల స్థానంలో వారికి బదులుగా చనిపోవడం కుదరదు. చనిపోవలసిన ఒక వ్యక్తికి సాదృశ్యంగా సూచనగా అతని స్థానంలో ఉండగలగడం మాత్రమే వాటికి సాధ్యం. జంతువులకు నైతిక స్వభావం లేదు. అవి నోరులేని ప్రాణులు మాత్రమే. వాటి చావుకు అవి సమ్మతించలేదు. మనుషుల పాపాలకు రావలసిన శిక్షను అవి భరించలేకపోయాయి. ఈ శిక్ష ఆత్మ సంబంధమైన మరణం, దేవుని సన్నిధినుంచి శాశ్వతంగా దూరంగా ఉండడం. మత్తయి 25:41; 2 థెస్సలొనీకయులకు 1:9; ప్రకటన గ్రంథం 20:14 చూడండి. ఒక మనిషి అయినా సరే సాటి మనిషి పాపాలకోసం బలిగా పనికి రాడు. ప్రతి మనిషీ పాపాత్ముడే, తన సొంత పాపాలకోసం చనిపోవలసినవాడే గాని ఇతరుల పాపాలకోసం కాదు. ఒకవేళ పాపం అంటూ లేని మనిషి ఎవరైనా ఉంటే, పాపంకోసం బలిగా అతణ్ణి అర్పించడం సాధ్యం అయితే, మరొక మనిషి స్థానంలో మాత్రమే అతడు మరణించగలిగి ఉంటాడు గాని మనుషులందరి కోసం కాదు. అంతేగాక దేవుడు దానికి సమ్మతించాలి గాని దేవుడలా సమ్మతించడం లేదు. పాపవిమోచన, ప్రాయశ్చిత్తం గురించీ ఒకరి స్థానంలో వేరొకరు చనిపోవడం గురించీ బైబిలు నేర్పుతున్నదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది సత్యాలు మనం తెలుసుకుని ఉండాలి. పాపం అంతా దేవునికి విరుద్ధమే – కీర్తనల గ్రంథము 51:4. ఇతరులకు లేక తనకు లేక భూలోకానికి వ్యతిరేకంగా కనిపించిన పాపాలు నిజానికి దేవునికి వ్యతిరేకమైనవే. ఎందుకంటే మనుషులంతా, దేవుని సృష్టి అంతా ఆయన సొత్తే. ఎవరైనా నా ఇల్లు తగలబెట్టారంటే అది నా ఇల్లు కాబట్టి నాకు విరుద్ధంగా పాపం చేసినట్టే. ఒక మనిషి వేరొక మనిషికి హాని చేస్తే, లేక ప్రకృతిని పాడు చేస్తే అతడు దేవుని సొత్తు విషయంలో దోషి కాబట్టి దేవునికే వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడన్న మాట. ఒకడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే (ఉదా।। నా ఇల్లు తగలబెట్టాడనుకోండి), అందుకు నష్టపరిహారం కోరకుండా నేనతణ్ణి క్షమిస్తే, నాకు వ్యతిరేకంగా అతడు చేసిన పాపం యొక్క ఫలితాన్ని నేనే అనుభవిస్తున్నానన్నమాట. అందుకు సరిపోయిన ఖర్చును నేనే భరించడానికి సిద్ధంగా ఉన్నానని చూపిస్తున్నానన్నమాట. దేవుడు మనుషులందరినీ క్షమించడానికి ఇష్టపడితే వారి పాపాల ఫలితాన్ని ఆయనే భరించడానికీ, వారు చేసినదాని పరిహారాన్ని తానే ఇచ్చుకోవడానికీ ఆయన సిద్ధంగా ఉండాలి. పాపానికి శిక్ష, ప్రతీకారం తప్పక రావాలి (సంఖ్యాకాండము 31:1-3; ద్వితీయోపదేశకాండము 32:41, ద్వితీయోపదేశకాండము 32:43; యెషయా 34:8; యెషయా 47:3; రోమీయులకు 12:19). ఈ శిక్షను ఎవరు భరిస్తారు, ఎవరు భరించగలరు? మనుషులు మీరిన దేవుని ఆజ్ఞలకోసం దేవుడు విధించే న్యాయమైన శిక్ష ఎవరికి పడాలి? మనిషికి బదులుగా వధించిన జంతువుకా? ఇది అసాధ్యం. మరైతే ఎవరు ఆ శిక్ష భరించాలి? నేరం చేసినవాడే, లేదా దేవుడు తానే ఆ శిక్ష భరించాలి. పాపం లేని మనిషిగా ఈ లోకానికి వచ్చి మనుషుల పాపాలకోసం తనను తాను అర్పించుకోవడం ద్వారా ఆ శిక్షను భరించి వారి దోషాన్ని తీసివేయగలిగేది దేవుడే. దేవుడు ఇది చేశాడు. క్రీస్తు అవతారంలోని అర్థం ఇదే. పాపం లేని ఆ దైవ మానవుడు ఒక్కడే మనుషులందరి స్థానంలో చనిపోగలిగినవాడు. పాపమంతా ఆయనకు విరుద్ధంగా ఉంది. మన స్థానంలో మన పాపాన్నంతటినీ తన దేహంలో సిలువపై భరించి దానికి రావలసిన శిక్షను అనుభవించాడు – హెబ్రీయులకు 2:9; హెబ్రీయులకు 13:12; అపో. కార్యములు 20:28; 1 పేతురు 2:24. ప్రాయశ్చిత్తం, క్షమాపణ ఈ రెండూ బాధలమీదే ఆధారపడి ఉన్నాయి. ఏదో బలి జంతువు యొక్క బాధలు కాదు, మన బాధలు కాదు, దేవుడు భరించిన బాధలపైనే.

5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి.
కీర్తనల గ్రంథము 40:6-8

కీర్తనల గ్రంథము 40:6-8 నోట్స్. ఇది క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి ఉనికిలో ఉన్న పాత ఒడంబడిక గ్రీకు అనువాదం నుంచి తీసుకున్న భాగం. జంతు బలుల గురించి తన ఉపదేశం సరైనదేనని రచయిత పాత ఒడంబడికలోనుంచే ఆధారాలు చూపిస్తున్నాడు. “బలిని యజ్ఞాన్ని”– జంతు బలులు దేవునికి అవసరం లేదు. అంతకన్నా మరింత శ్రేష్ఠమైన బలి ఆయనకు కావాలి. వ 7లోని “నేను” అంటే క్రీస్తు. “నీ చిత్తమే” అంటే మనుషుల పాపాలకోసం అర్పించవలసిన బలి క్రీస్తే అన్న దేవుని చిత్తం.

6. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు.

7. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

మత్తయి 26:39.

8. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

“ధర్మశాస్త్రం ప్రకారం”– క్రీస్తు బలి అర్పణకు సాదృశ్యాలుగా ఉండాలని దేవుడు ఆ అర్పణలను నియమించాడు. అయితే అవి మనుషుల పాపాన్ని తీసివేయలేవని ఆయనకు తెలుసు.

9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

“రెండో దానిని”– మొదటిదంటే పాత ఒడంబడిక, రెండోదంటే క్రొత్త ఒడంబడిక. క్రీస్తు మొదటిదాన్ని రద్దు చేశాడు – హెబ్రీయులకు 8:7, హెబ్రీయులకు 8:13.

10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.
కీర్తనల గ్రంథము 40:6-8

దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా, విశ్వాసుల కోసం మరణించడం ద్వారా క్రీస్తు వారిని పవిత్రులుగా చేశాడు. అంటే వారిని ప్రత్యేకపరచి, దేవుని ప్రజలుగా ఉండేందుకు ప్రతిష్ఠించాడు – 1 పేతురు 2:9. పవిత్రత గురించి లేవీయకాండము 20:7; యోహాను 17:17-19 చూడండి. ఇక్కడ 10లోని ఈ మాట విశ్వాసులు గడపవలసిన పవిత్ర జీవితం గురించి చెప్పేది కాదు. ఆ మాట హెబ్రీయులకు 12:10-16 లో చూడవచ్చు.

11. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.
నిర్గమకాండము 29:38

“నిలిచి”– సన్నిధి గుడారంలో గానీ ఆలయంలో గానీ కుర్చీ ఒక్కటి కూడా లేదు. అంటే యాజుల పని ఎన్నటికీ పూర్తి కాదన్న విషయాన్ని ఇది సూచిస్తూ ఉండవచ్చు. “పాపాన్ని ఎన్నడూ తీసివేయలేవు”– వ 4.

12. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,
కీర్తనల గ్రంథము 110:1

“ఎప్పటికీ నిలిచి ఉండే”– వ 10,14; హెబ్రీయులకు 9:12, హెబ్రీయులకు 9:25-28. “కుడి వైపున”– రచయిత తన లేఖను ఎక్కడ మొదలు పెట్టాడో తిరిగి అక్కడికి వచ్చాడు – హెబ్రీయులకు 1:3. “కూర్చున్నాడు”– అంటే ఆయన చేయవలసిన బలి అర్పణ పని శాశ్వతంగా పూర్తి అయిపోయింది అని ఇది సూచిస్తున్నది. దానికి మరేదీ కలపడం అసాధ్యం. యోహాను 19:30. యాజి అనబడే వాడెవడూ చేయగల ఏదైనా ఇప్పుడు ఎవరి పాపవిముక్తికీ రక్షణకూ అవసరం కాదు.

13. అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.
కీర్తనల గ్రంథము 110:1

“పాదాల క్రింద పీట”– హెబ్రీయులకు 1:13; కీర్తనల గ్రంథము 110:1. తండ్రి అయిన దేవుడు క్రీస్తు విరోధులను ఇంకా ఆయనకు పాదపీఠంగా చెయ్యలేదు. క్రీస్తు ఇంకా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అది వస్తుంది – ప్రకటన గ్రంథం 11:15-18.

14. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

అనేక వందల ఏళ్ళుగా యాజులు ఏటేటా వేలకొద్దీ జంతువులను బలి ఇచ్చారు. దానంతటి ఫలితంగా ఒక్క పాపం కూడా తీసివేయబడలేదు. ఒక్క మనిషి కూడా పరిపూర్ణుడు కాలేదు. కానీ క్రీస్తు ఒక్క అర్పణ విశ్వాసులందరినీ ఆయనలో శాశ్వతంగా పరిపూర్ణులను చేసింది. దీని అర్థం ఏమిటి? తన ప్రజలకోసం క్రీస్తు చేసిన అర్పణ మరి ఏ లోపమూ లేకుండా వారికి పూర్తిగా పాపవిముక్తి కలిగించింది అని దీని అర్థం (హెబ్రీయులకు 7:25 పోల్చి చూడండి). ఆయన చేసిన ఒక్క అర్పణ దేవుని ఎదుట విశ్వాసికి లోపం లేని స్థాయికి ఆధారం అయింది. దాని మూలంగా అడ్డంకులన్నీ తొలగి లోపం లేని సఖ్యత సమకూడింది. క్రీస్తు పరిపూర్ణంగా వారి పాపాలను తీసివేశాడు. ఒక్కటి కూడా వారి లెక్కలో మిగల్లేదు (రోమీయులకు 4:8; రోమీయులకు 8:33). దేవునితో లోపం లేని ఒక సంబంధాన్ని అది వారికిచ్చింది (రోమీయులకు 8:1, రోమీయులకు 8:15; 2 కోరింథీయులకు 5:18-19). వారి అంతర్వాణిని ఆయన పరిపూర్ణంగా శుద్ధి చేశాడు (హెబ్రీయులకు 9:4). ఇప్పుడు గానీ మరెప్పుడైనా గానీ దేవుని సన్నిధిలోకి వారు ప్రవేశించగలిగేలా వారిని పరిపూర్ణంగా సిద్ధపరిచాడు (వ 22; రోమీయులకు 5:2; ఎఫెసీయులకు 2:18). ఇక్కడ వాడిన “పరిపూర్ణులు” అనే మాటకు అర్థం ఇదే అని తరువాతి వచనాలవల్ల (వ 23 వరకు) మరింత స్పష్టంగా అయింది. భూమిపై విశ్వాసుల్లో తనంతట తాను ఏ లోపమూ లేక ఏ పాపమూ లేకుండా, ఎన్నడూ తప్పు చేయకుండా ఉండే పరిపూర్ణుడు ఎవడూ లేడు – యాకోబు 3:2; 1 యోహాను 1:8. అన్ని విషయాల్లోనూ పరిపూర్ణత ఏ విశ్వాసిలోనూ ఇంకా కలగలేదు – ఫిలిప్పీయులకు 3:12 లో పౌలు ఇదే మాట వాడాడు. అలాంటి పరిపూర్ణత మాత్రం ఇంకా రాబోయే కాలంలో కలుగుతుంది – 1 యోహాను 3:2. “పవిత్రపరచబడుతున్నవారిని”– బహుశా నిజ విశ్వాసులందరిలోనూ వారిని పవిత్రతను అనుసరించేలా (హెబ్రీయులకు 12:14) చేసే దేవుని పనిని ఉద్దేశించి రచయిత ఈ మాట రాసి ఉండవచ్చు. అంటే నిజ విశ్వాసులందరినీ “పవిత్ర పరచబడ్డవారు” అనేమాట సూచిస్తూ ఉంది. మత్తయి 5:6, మత్తయి 5:8; రోమీయులకు 6:15-22; రోమీయులకు 8:12-14; 1 యోహాను 3:3, 1 యోహాను 3:6, 1 యోహాను 3:9-10. క్రీస్తు తనలో విశ్వాసులందరినీ పరిపూర్ణులుగా చేశాడు. ఎవరో కొద్దిమంది మహానుభావులు, భక్తిపరులు, అసాధారణ పవిత్రులు మాత్రమే కాదు (రోమీయులకు 1:1; 1 కోరింథీయులకు 1:1; మొ।।). “శాశ్వతంగా” – హెబ్రీయులకు 5:9; హెబ్రీయులకు 9:12. వ్యక్తులుగా సమూహంగా తన ప్రజలకోసం క్రీస్తు చేసిన బలి అర్పణ ఫలితాలు శాశ్వతమైనవి, మార్పు చెందనివి.

15. ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చు చున్నాడు.

“పవిత్రాత్మ...సాక్ష్యం”– హెబ్రీయులకు 3:7; హెబ్రీయులకు 9:8; 2 తిమోతికి 3:16; 2 పేతురు 1:21. ఇప్పుడు విశ్వాసులు పరిపూర్ణులుగా చేయబడడమంటే ఏమిటో రచయిత తెలియజేస్తున్నాడు.

16. ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత

యిర్మియా 31:34. క్రీస్తు తన విశ్వాసులను తీసుకువచ్చే పరిపూర్ణతలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. తన ఆజ్ఞల గురించి వారికి ఆధ్యాత్మికమైన గ్రహింపును ఇచ్చి, వాటికి లోబడాలన్న కోరికనూ లోబడే సామర్థ్యాన్నీ కూడా ఇస్తాడు. క్రీస్తులో ఉన్నది ఇదే (వ 7), క్రీస్తు బలి అర్పణ ఆధారంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చేది కూడా ఇదే. ఇది క్రొత్త ఒడంబడిక అతి ప్రాముఖ్యమైన లక్షణం. నిజంగా ఇది లేకుండా ఎవరైనా తాను విశ్వాసి అనుకునేందుకు నిజమైన రుజువు ఏముంది? యోహాను 14:15, యోహాను 14:23; రోమీయులకు 8:3-4; 1 కోరింథీయులకు 2:16; 2 కోరింథీయులకు 3:3 చూడండి. దేవునిపై మనసు లగ్నం కాకుండా, క్రీస్తును సేవించే మనసు లేకుండా, బైబిల్లో వెల్లడైన దేవుని సంకల్పం ప్రకారం చేయడంలో ఆనందం లేకుండా ఒక వ్యక్తి తన పాపాలు పోయాయని చెప్పుకొన్నందువల్ల లాభమేముంది? క్రొత్త ఒడంబడిక దీవెనలను విడివిడిగా చేయడం సాధ్యమా? ఒక దీవెనను తీసుకొని మరొకదాన్ని వద్దనగలమా?

17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.
యిర్మియా 31:34

క్రీస్తు తన విశ్వాసులను పరిపూర్ణులుగా చేశాడనడంలో రచయిత భావమేమిటో అర్థం చేసుకొనేందుకు ఇది కూడా సాయపడుతుంది. ఆయన వారికి పాపాలనుంచి పరిపూర్ణమైన క్షమాపణ ఇచ్చాడు. దేవుడు విశ్వాసులను నిర్దోషులుగా లెక్కించాడని పౌలు చెప్పిన మాటలకూ ఈ మాటలకూ అర్థం ఒకటే. రోమీయులకు 3:24; రోమీయులకు 4:6-8; రోమీయులకు 8:33 చూడండి. దేవుని ఎదుట విశ్వాసి స్థాయిని పరిపూర్ణమైనదిగా చేశాడు క్రీస్తు.

18. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

“ఇంకెన్నడూ”– ఆ పని పూర్తిగా, పరిపూర్ణంగా, శాశ్వతంగా సమాప్తమైపోయింది. దేవునికి మరి ఏ ఇతర అర్పణ గానీ, క్రీస్తుయొక్క ఒకే అర్పణను మరో సారి చేయడం గానీ అవసరం లేదు.

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

ప్రముఖయాజిగా, క్రొత్త ఒడంబడిక మధ్యవర్తిగా క్రీస్తును గురించి ఉపదేశించడం ఇక్కడికి ముగిస్తున్నాడు రచయిత. ఇప్పుడు ఈ సత్యం అంతటి ప్రకారమూ నడుచుకోవలసిందని విశ్వాసులందరినీ హెచ్చరిస్తున్నాడు. ఇలా చెయ్యడంలో దేవుని ఎదుట వారి స్థాయి ఎంత పరిపూర్ణంగా ఉందో వచనాల్లో మరింత స్పష్టంగా చూపిస్తున్నాడు. అతడు బైబిల్లో ఉన్న అత్యంత దివ్య వచనాలలో కొన్నింటిని రాస్తున్నాడు. “తెర”– సన్నిధి గుడారం, దేవాలయం రెంటిలోనూ పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసే తెర ఒకటి ఉండేది (హెబ్రీయులకు 9:3). అప్పుడు దేవుని సన్నిధిలోకి మార్గమింకా వెల్లడి కాలేదని ఇది సూచిస్తున్నది – హెబ్రీయులకు 9:8. ఆ తెర క్రీస్తుకు చిహ్నం. క్రీస్తు మానవ దేహంలో వచ్చి (హెబ్రీయులకు 10:5), మన పాపాలకోసం మరణించినప్పుడు దేవాలయంలోని తెర రెండుగా చినిగింది – మత్తయి 27:50-51. అంటే ఆయన మరణం దేవుని సన్నిధిలోకి మార్గాన్ని వెల్లడించింది. సిలువ మరణానికి గురియైన క్రీస్తు దేహం మనకోసం చీల్చబడింది గనుక మనం అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించగలం. “కొత్త మార్గం”– ప్రజలను దూరంగా ఉంచిన పాత ఒడంబడికతో పోల్చుకుంటే క్రీస్తు ఏర్పరచిన ఈ మార్గం కొత్తది – నిర్గమకాండము 19:21-25; నిర్గమకాండము 27:9-19. ఇది సజీవ మార్గం. ఇది క్రీస్తు జీవంపై ఆధారపడేది, ఆయనలో నమ్మకం ఉంచిన వారందరికీ కొత్త ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చేది – యోహాను 14:6; యోహాను 3:1-4. ఇదంతా పాత ఒడంబడికలో ఉన్న జీవం లేని కర్మకాండలకు, ఆచారాలకు భిన్నమైనది.

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

“ప్రవేశించడానికి”– పాత ఒడంబడిక కింద ప్రముఖయాజి మాత్రమే సంవత్సరానికి ఒక్క సారే అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించగలిగేవాడు (హెబ్రీయులకు 9:7). ఇప్పుడు ఏ రోజునైనా, ఏ క్షణమైన క్రీస్తు విశ్వాసికి పరలోకంలో అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించే మార్గం తెరిచి ఉంది – అంటే దేవుని సన్నిధిలోకి ఎప్పుడైనా ప్రవేశించగలం. దేవుడు విశ్వాసులందరినీ యాజులుగా చేశాడు (హెబ్రీయులకు 13:15-16; 1 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 1:6). వారంతా తమ ప్రముఖ యాజిలాగా దేవుని సముఖంలోకి వెళ్ళవచ్చు. ఇదంతా యేసు రక్తం పాపం కోసం ప్రాయశ్చిత్తం చేసి దేవునికీ మనిషికీ మధ్య ఉన్న అడ్డంకిని తొలగించినందువల్లనే సాధ్యం అయింది.

21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,
సంఖ్యాకాండము 12:7, జెకర్యా 6:12-13

“ఇంటిమీద”– హెబ్రీయులకు 3:6. “యాజి”– హెబ్రీయులకు 2:17; హెబ్రీయులకు 4:14; మొ।।.

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
యెహెఙ్కేలు 36:25

“విశ్వాస నిశ్చయత”– హెబ్రీయులకు 11:1, హెబ్రీయులకు 11:6. హెబ్రీయులకు 3:12 పోల్చి చూడండి. విశ్వాసులకు విశ్వాసం గురించిన పూర్తి నిశ్చయత ఉండాలి. క్రీస్తు మన పాపాలను తీసివేశాడనీ ఆయన మన ప్రముఖ యాజి అనీ ఆయన చూపిన మార్గం మనల్ని దేవుని చెంతకు తెచ్చిందనీ, దేవుడు మనల్ని తన సముఖంలోకి స్వీకరిస్తున్నాడనీ మనం తెలుసుకోవాలి. ఈ విషయంలో సందేహాలకూ భయాలకూ మన హృదయాల్లో తావుండకూడదు. హెబ్రీయులకు 3:14; హెబ్రీయులకు 6:19; 1 యోహాను 5:13; 2 తిమోతికి 1:12; యోహాను 14:1; లూకా 12:32 పోల్చి చూడండి. “యథార్థ హృదయం”– లూకా 12:1; మత్తయి 5:8; యోహాను 4:23-24; 1 కోరింథీయులకు 5:8. “శుద్ధ జలం”– ఈ ఉత్తర మంతా రచయిత పాత ఒడంబడికలోని ఆరాధన వస్తువులన్నిటినీ విషయాలన్నిటినీ ఆధ్యాత్మిక వాస్తవాలకు చిహ్నాలుగా చూపుతూ వచ్చాడు. ఇక్కడ ఇదే చేస్తున్నాడు (కానీ క్రైస్తవ బాప్తిసాన్ని గురించి ఇతడు మాట్లాడుతున్నాడని కొందరు పండితులు భావించారు). నిర్గమకాండము 30:17-21; లేవీయకాండము 8:6; లేవీయకాండము 16:4 చూడండి. యాజులు శారీరకంగా కడుక్కోవడం ఇప్పటి విశ్వాసుల శరీర చర్యలను శుద్ధి చేయడానికి చిహ్నం. వారు క్రొత్త ఒడంబడిక కింద యాజులు – వ 19. వారి హృదయాల్లాగే వారి బయటి ప్రవర్తన కూడా పరిశుభ్రంగా ఉండాలి. “ప్రోక్షించబడ్డ హృదయాలు” అనేది మన అంతరంగంలోని అనుభవం గురించి తెలియజేస్తున్నది. హెబ్రీయులకు 9:13-14 చూడండి. విశ్వాసి హృదయంలో క్రీస్తు రక్తం చిలకరించబడింది. అంటే క్రీస్తు చేసిన బలి అర్పణను గురించిన గ్రహింపూ అందులో నమ్మకమూ విశ్వాసి హృదయాన్ని శుద్ధి చేశాయి. “సమీపిద్దాం”– హెబ్రీయులకు 4:16; ఎఫెసీయులకు 2:18; ఎఫెసీయులకు 3:12; రోమీయులకు 5:1-2; యాకోబు 4:8. మనం ప్రవేశించవలసిన రీతిలో ప్రవేశించగలగాలంటే పై నాలుగు విషయాలు ముఖ్యమని రచయిత చెప్తున్నాడు.

23. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

హెబ్రీయులకు 3:6, హెబ్రీయులకు 3:14. “విశ్వసనీయుడు”– హెబ్రీయులకు 6:16-18; తీతుకు 1:2; 1 యోహాను 5:9-10. అపనమ్మకం చూపడం ద్వారా సందేహించడం ద్వారా మనమాయన్ను కించపరచకూడదు. అపనమ్మకం, సందేహం ఇవి ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోడని భావించడంతో సమానమే గదా.

24. కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,

రచయిత వ 19-23లో విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికి బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నాడు. హెబ్రీయులకు 3:13; రోమీయులకు 14:19; రోమీయులకు 15:2; 1 కోరింథీయులకు 9:24; కొలొస్సయులకు 3:16 కూడా చూడండి. “ఆలోచిద్దాం”– క్రీస్తును మరింతగా ప్రేమించేలా, ఆయనకు మరింతగా సేవ చేసేలా ఇతరులను ఎలా పురిగొల్పగలమా అని మనం ఆలోచించాలి.

25. ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.

వ 22-25లో చేద్దాం, ఉందాం అని నాలుగు చోట్ల కనిపిస్తున్నది. అవన్నీ కూడా క్రీస్తు ఎవరో ఆయన మనకోసం చేసినదేమిటో అన్నవాటిపై ఆధారపడి ఉన్నాయి. విశ్వాసుల సభలకు వెళ్ళడం ఏ విశ్వాసీ మానుకోకూడదు. ప్రతి ఒక్కరికీ ఇతర విశ్వాసులతో సహవాసం అవసరం. ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. “ఆ దినం”– ఆ దినం దగ్గర పడడం అంటే ఏమిటి? జెరుసలం నగరం, అందులోని ఆలయం నాశనమయ్యే రోజు అని రచయిత ఉద్దేశం కావచ్చు (మత్తయి 24:1-3; లూకా 19:41-44; లూకా 21:20-24). అతడీ లేఖ రాసిన సమయానికి ఆ విధ్వంసం చాలా సమీపంలో ఉంది. లేక క్రీస్తు తిరిగి వచ్చే దినం అని అతని ఉద్దేశం కావచ్చు (హెబ్రీయులకు 9:28; మత్తయి 24:33). లేక ఈ రెంటినీ ఈ ఒక్క మాటలోనే కలిపి ఉండవచ్చు. మొదటి తరం క్రైస్తవులు ఈ రెండు సంభవాలూ దాదాపు ఒకే సమయంలో జరగవచ్చునని ఎదురు చూచేవారు.

26. మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలియికను ఉండదు గాని

విశ్వాసద్రోహం, భ్రష్టత్వం గురించి ఇది నాలుగో హెచ్చరిక. హెబ్రీయులకు 2:1-4 నోట్ చూడండి. క్రీస్తు ద్వారా, క్రీస్తును గురించి దేవుడు వెల్లడించిన దివ్య సత్యానికి విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం గురించి చేస్తున్న హెచ్చరిక ఇది. “పాపాలు చేస్తూ ఉంటే”– స్థిరపడిపోయిన హృదయ స్థితినీ, జీవిత విధానాన్నీ ఈ మాట సూచిస్తున్నది. ఒక్క పాపకార్యం చేయడం కాదు. వారిలో ఎవరైనా ఈ స్థితిలో పడిపోతారని అనుకుంటున్నానని రచయిత చెప్పడం లేదు. “చేస్తూ ఉంటే” అంటున్నాడు (హెబ్రీయులకు 6:6 పోల్చి చూడండి). వ 39లో తాను ఎవరికి ఈ లేఖ రాస్తున్నాడో ఆ విశ్వాసులు ఇలాంటి దోషంలో పడరని తనకు గట్టి నమ్మకం ఉన్నట్టు రాశాడు (1 యోహాను 3:9-10 పోల్చి చూడండి). రచయిత ప్రత్యేకించి ఒక రకం పాపం గురించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది. విశ్వాసులు పాపం చేస్తే క్షమాపణ పొందవచ్చు (1 యోహాను 1:9; 1 యోహాను 2:1; 1 యోహాను 5:16). అయితే క్షమాపణ లేని పాపం ఒకటున్నది. ఇక్కడ ఆ పాపాన్ని వర్ణిస్తున్నాడు. అదేమిటంటే క్రీస్తును, ఆయన బలిని నిరాకరించడం, ఆయన రక్తంవల్ల కలిగిన క్రొత్త ఒడంబడికకు వీపు చూపడం, దేవుని ఆత్మ స్వరాన్ని పెడచెవిని బెట్టడం (వ 29). విశ్వాసులు ఒక్క పాపం చేస్తే వారు శాశ్వతంగా నశించిపోవచ్చునని నేర్పించేవారు ఉన్నారు. ఇది క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కనిపించే ఉపదేశం కాదు – మత్తయి 6:12; 1 యోహాను 1:9; 1 యోహాను 2:1. “సత్యాన్ని గురించి తెలుసుకొన్న తరువాత” అన్న రచయిత మాటల్ని గమనించండి. “పశ్చాత్తాపపడి, నమ్మకముంచిన తరువాత” అనడం లేదు అతడు. సత్యం గురించి మనకు తెలియ వచ్చు, అయినా పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మక ముంచడానికి మనం నిరాకరించవచ్చు. ఈ వచనంలో రచయిత మాట్లాడుతున్న పాపం అదేపనిగా నిరాకరిస్తూ ఉండడమే కావచ్చు. “పాపాలకోసం బలి ఉండదు”– ఎవరైనా క్రీస్తు బలిని నిరాకరిస్తే అతనికోసం మరి ఏ ఇతర బలినీ దేవుడు అంగీకరించడని స్పష్టమే.

27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
యెషయా 26:11

“తీర్పు”– హెబ్రీయులకు 9:27; అపో. కార్యములు 17:31; ప్రకటన గ్రంథం 20:11-15. “విరోధులను”– క్రీస్తును గురించీ ఆయన మానవ పాపం కోసం చేసిన ఒక్క బలి అర్పణ గురించీ దేవుడు తెలియజేసిన సత్యాన్ని ఉద్దేశ పూర్వకంగా తిరస్కరించేవాడు దేవునికి శత్రువు. యోహాను 7:7; యోహాను 15:18; రోమీయులకు 5:10; యాకోబు 4:4 పోల్చి చూడండి. “అగ్నిజ్వాలలు”– హెబ్రీయులకు 12:29; 2 థెస్సలొనీకయులకు 1:7; మత్తయి 3:10; మార్కు 9:42-48; లూకా 16:24; ప్రకటన గ్రంథం 20:14.

28. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.
ద్వితీయోపదేశకాండము 17:6, ద్వితీయోపదేశకాండము 19:15

హెబ్రీయులకు 2:2; ద్వితీయోపదేశకాండము 17:6-7. ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష విధించవలసిన పాపాలకోసం నిర్గమకాండము 21:36 చూడండి. దానికి ఉదాహరణ సంఖ్యాకాండము 15:30-35 చూడండి.

29. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
నిర్గమకాండము 24:8

30. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.
ద్వితీయోపదేశకాండము 32:35-36, కీర్తనల గ్రంథము 135:14

ద్వితీయోపదేశకాండము 32:35-36; కీర్తనల గ్రంథము 135:14.

31. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.

దేవుడు పవిత్రుడు, పాపాన్ని అసహ్యించుకుంటాడు. అపనమ్మకం తిరుగుబాటులను తప్పక శిక్షిస్తాడు గనుక ఇది భయంకరమైన విషయం. మనం గనుక దేవుని సత్యాన్ని స్వీకరించి దాన్ని అనుసరిస్తే, వ 19-25లో ఆయన చెప్పినట్టుగా చేస్తే దీని గురించి మనమేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

32. అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.

రచయిత హెబ్రీయులకు 6:9-12 లో భ్రష్టత్వం గురించి హెచ్చరించిన తరువాత చేసినట్టే ఇక్కడ కూడా చేస్తున్నాడు. వారు పాపవిముక్తి, రక్షణ పొందినవారనీ, 26-29లోని పాపం జరిగించరనీ తాను నమ్ముతున్నట్టు వారికి తెలియాలని అతని ఉద్దేశం. తమ క్రియల ద్వారా తమ నమ్మకాన్ని అలానే నిరూపిస్తూ నిబ్బరం కలిగి కొనసాగాలని అతడు కోరుతున్నాడు. బాధలు కలిగినప్పుడు వారిలో కనిపించిన స్థిరత్వం, క్రీస్తుకు చెందిన ఇతరుల పట్ల వారి ప్రేమ, క్రీస్తుకోసం అన్నిటినీ పోగొట్టుకోవడానికి వారు సిద్ధపడిన స్థితి ఇదంతా వారి నమ్మకం వాస్తవమైనది అనేందుకు రుజువు. “పోరాటం” (వ 32) – వ 26; అపో. కార్యములు 26:18; 2 కోరింథీయులకు 4:6; 2 తిమోతికి 3:12. “శాశ్వతమైన ఆస్తి” (వ 34) – హెబ్రీయులకు 6:12; మత్తయి 6:19-20; రోమీయులకు 8:17; 1 పేతురు 1:4.

33. ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.

34. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.

35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

“బహుమతి దొరుకుతుంది”– మత్తయి 19:28-30; ప్రకటన గ్రంథం 22:12.

36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

“ఓర్పు”– హెబ్రీయులకు 3:6, హెబ్రీయులకు 3:14; హెబ్రీయులకు 6:11; రోమీయులకు 3:3-5; రోమీయులకు 8:24-25; యాకోబు 1:2-4. అన్నిటినీ ఓర్చుకుంటూ పోతూ, ఏమి జరిగినా క్రీస్తులో నమ్మకాన్ని నిలుపుకుంటూ ఉండడమే ప్రతి విశ్వాసీ చేయవలసిన పని. వారు అలా చేస్తారన్న నమ్మకం రచయితకు ఉంది (వ 39).

37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.
హబక్కూకు 2:3-4

హబక్కూకు 2:3-4. రోమీయులకు 1:17; గలతియులకు 3:11 కూడా చూడండి. మనుషులు తనపై నమ్మకం పెట్టుకుంటే దేవుడు వారిని న్యాయవంతులుగా ఎంచుతాడు – రోమీయులకు 3:24-25, రోమీయులకు 3:28; రోమీయులకు 4:24; రోమీయులకు 5:1. న్యాయవంతుల జాబితాలోకి వచ్చిన తరువాత వారు విశ్వాస జీవితం ఆరంభిస్తారు. అది భూమిపై వారి జీవిత యాత్ర ముగిసేదాకా కొనసాగుతుంది (2 కోరింథీయులకు 5:7). హీబ్రూవారికి లేఖలో విశ్వాసం మూలంగా జీవించడం, అంతం వరకు విశ్వాసంలో కొనసాగడం గురించి రచయిత నొక్కి చెప్తూ వచ్చాడు.

38. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

“వెనక్కు తీస్తే”– హెబ్రీయులకు 6:6.

39. అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

“మనం”– అంటే క్రీస్తులో నిజ విశ్వాసులు (రచయితకు తాను విశ్వాసినని తెలుసు. తానెవరికైతే ఈ లేఖ రాస్తున్నాడో వారు కూడా విశ్వాసులనేందుకు చాలినంత సాక్ష్యాధారాలు కనిపించాయి – వ 32-34; హెబ్రీయులకు 6:11). వారు గనుక వెనక్కు తీస్తే దేవునికి ఆనందం కలగదు. అది వారికి నాశనమే కలిగిస్తుంది. అయితే దేవప్రేరణ గలిగిన ఈ రచయిత వారలా వెనక్కు తీయరని చెప్తున్నాడు. నిజ విశ్వాసులు సైతం వెనక్కు తీయవచ్చనీ, వ 26; హెబ్రీయులకు 2:3; హెబ్రీయులకు 3:12; హెబ్రీయులకు 6:6; హెబ్రీయులకు 12:25 లో చెప్పిన పాపాలు జరిగించి శాశ్వత నాశనానికి వెళ్లిపోవచ్చుననీ కొందరు వాదిస్తున్నారు. విశ్వాసులు అలా చేయరని ఈ లేఖ రచయిత సూచిస్తున్నాడు. నమ్మకం కొందరు ఊహించినదాని కన్నా ఎంతో ఎక్కువ బలప్రభావాలు గలదే. అది లోకం కన్నా బలమైనది (1 యోహాను 5:4). అది పర్వతాలను కదిలించగలదు, అసాధ్యమనిపించిన వాటిని సాధ్యం చేయగలదు (మత్తయి 17:20). అది అదృశ్యంగా ఉన్నవాటిని మనం చూచేలా చెయ్యగలదు (2 కోరింథీయులకు 4:18). అది మనుషులను పాపంనుంచి రక్షించి, ఆ స్థితిలోనే ఉంచేందుకు దేవుడు ఎన్నుకొన్న సాధనం (ఎఫెసీయులకు 2:8; 1 పేతురు 1:5). అందువల్ల అది ఆ పనికి అన్నిటికన్నా శ్రేష్ఠమైన సాధనం అయి ఉండాలి. దేవుడు తానే ఎన్నుకున్న సాధనం తన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉంటుందా? నమ్మకం క్రీస్తు తన విశ్వాసుల కోసం చేసిన ప్రత్యేక ప్రార్థనలోని ఒక ముఖ్యాంశం (లూకా 22:32). అలాంటప్పుడు అది ఫలించకుండా భంగమైపోతుందా? అలా జరగదన్న తన నిశ్చయతను ఈ లేఖ రచయిత తెలియజేస్తున్నాడు. క్రీస్తు నిజ విశ్వాసులు దేవుడు వారికి వాగ్దానం చేసిన అంతిమ రక్షణ వరకు నమ్మకంలో కొనసాగుతారు. తరువాతి అధ్యాయంలో నమ్మకానికి ఉన్న ప్రభావం గురించి కొంత వివరిస్తున్నాడు రచయిత.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Hebrews - హెబ్రీయులకు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పాపాన్ని తీసివేయడానికి త్యాగం యొక్క అసమర్థత, ఆ ప్రయోజనం కోసం క్రీస్తు త్యాగం యొక్క అవసరం మరియు శక్తి. (1-18) 

1-10
సీనాయ్ ఒడంబడిక యొక్క గుడారం మరియు శాసనాలు సువార్త యొక్క చిహ్నాలు మరియు ప్రాతినిధ్యాలు మాత్రమే అని అపొస్తలుడు ప్రదర్శించాడు. ప్రధాన పూజారులు అర్పించే నిరంతర త్యాగాలు క్షమాపణ మరియు మనస్సాక్షి శుద్ధీకరణ పరంగా ఆరాధకులకు పరిపూర్ణతను సాధించలేవని అతను ముగించాడు. ఏది ఏమైనప్పటికీ, "దేవుడు దేహంలో ప్రత్యక్షమయ్యాడు" అనేది బలి అర్పణగా మారినప్పుడు మరియు శపించబడిన చెట్టుపై అతని మరణం విమోచన క్రయధనంగా పనిచేసినప్పుడు, బాధపడ్డ వ్యక్తి యొక్క అనంతమైన విలువ అతని స్వచ్ఛంద బాధలను అపరిమితమైన విలువైనదిగా చేసింది. ప్రాయశ్చిత్త త్యాగానికి సమ్మతించే మరియు ఇష్టపూర్వకంగా పాపుల స్థానాన్ని ఆక్రమించగల వ్యక్తి అవసరం, మరియు క్రీస్తు ఈ అవసరాన్ని నెరవేర్చాడు. క్రీస్తు తన ప్రజల కోసం సాధించిన అన్నిటికీ మూలం దేవుని సార్వభౌమ సంకల్పం మరియు దయ. క్రీస్తు ప్రవేశపెట్టిన నీతి మరియు అర్పించిన త్యాగం శాశ్వతమైన శక్తిని కలిగి ఉంటుంది, అతని మోక్షం శాశ్వతమైనదని నిర్ధారిస్తుంది. ఈ మూలకాలు తమ వద్దకు వచ్చే వారందరినీ పరిపూర్ణం చేసే శక్తిని కలిగి ఉంటాయి, విధేయత కోసం బలం మరియు ప్రేరణలను పొందుతాయి, అలాగే ప్రాయశ్చిత్త రక్తం నుండి అంతర్గత సౌకర్యాన్ని అందిస్తాయి.

11-18
కొత్త ఒడంబడిక లేదా సువార్త యుగంలో, సంపూర్ణమైన మరియు అంతిమ క్షమాపణ సాధించబడుతుంది. ఇది కొత్త ఒడంబడికకు మరియు పాత ఒడంబడికకు మధ్య ముఖ్యమైన వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. పాత ఒడంబడికలో, త్యాగాలు తరచుగా పునరావృతం చేయబడాలి మరియు అప్పుడు కూడా, వారు భూసంబంధమైన విషయాల కోసం మాత్రమే క్షమాపణను అందించారు. దీనికి విరుద్ధంగా, కొత్త ఒడంబడిక ప్రకారం, అన్ని దేశాలకు మరియు అన్ని యుగాలకు ఆధ్యాత్మిక క్షమాపణను పొందేందుకు, మరణానంతర జీవితంలో శిక్ష నుండి వ్యక్తులను విడిపించేందుకు ఒకే త్యాగం సరిపోతుంది. దానికి సముచితంగా కొత్త ఒడంబడిక అని పేరు పెట్టారు. దేవుని కుమారుని త్యాగపూరిత ప్రాయశ్చిత్తానికి మానవ ఆవిష్కరణలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఎవరూ భావించకూడదు. కాబట్టి, విశ్వాసం ద్వారా ఈ త్యాగానికి సంబంధాన్ని వెతకడం మరియు విధేయతకు దారితీసే ఆత్మ యొక్క పవిత్రీకరణ ద్వారా మన ఆత్మలలో దాని నిర్ధారణను పొందడం మాత్రమే చర్య. ఈ విధంగా, మన హృదయాలలో వ్రాయబడిన చట్టంతో, మన సమర్థన గురించి మనకు హామీ ఇవ్వబడుతుంది మరియు దేవుడు మన పాపాలను ఇకపై గుర్తుంచుకోడు అని విశ్వసించవచ్చు.

యేసుక్రీస్తు ద్వారా దేవునికి విశ్వాసి యొక్క ప్రాప్తిలో పవిత్ర ధైర్యం మరియు విశ్వాసం మరియు పరస్పర ప్రేమ మరియు కర్తవ్యంలో స్థిరత్వం కోసం ఒక వాదన. (19-25) 
లేఖనం యొక్క ప్రారంభ విభాగాన్ని ముగించిన తర్వాత, అపొస్తలుడు జీవితంలోని ఆచరణాత్మక అంశాలకు సిద్ధాంతాన్ని వర్తింపజేయడం ప్రారంభించాడు. విశ్వాసులకు దేవుని సన్నిధికి ప్రత్యక్ష ప్రవేశం ఉంది కాబట్టి, వారు ఈ అధికారాన్ని ఉపయోగించుకోవడం సముచితం. క్రైస్తవులు అలాంటి ప్రాప్తిని అనుభవించే మార్గం యేసు రక్తం ద్వారా, అతను ప్రాయశ్చిత్త త్యాగం వలె అర్పించాడు. దయగల క్షమాపణతో అనంతమైన పవిత్రత యొక్క అమరిక పూర్తిగా గ్రహించబడలేదు, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మానవ స్వభావం మన పాపాల కోసం గాయపడి గాయపడుతుంది. స్వర్గానికి మార్గం సిలువ వేయబడిన రక్షకుని ద్వారా; అతని మరణం మన జీవితానికి మార్గంగా ఉపయోగపడుతుంది మరియు విశ్వసించే వారికి అతను విలువైనవాడు అవుతాడు. దేవునికి దగ్గరవ్వడం తప్పనిసరి; దూరం పాటించడం అంటే క్రీస్తుని నిర్లక్ష్యం చేయడం. స్వచ్ఛమైన నీటితో శరీరాన్ని కడగడం అనే సూచన చట్టం ప్రకారం నిర్దేశించబడిన ప్రక్షాళన ఆచారాలను సూచిస్తుంది. ఈ సందర్భంలో, బాప్టిజంలో నీటిని ఉపయోగించడం క్రైస్తవులకు వారి ప్రవర్తన స్వచ్ఛంగా మరియు పవిత్రంగా ఉండాలని రిమైండర్‌గా ఉపయోగపడుతుంది.
విశ్వాసులు తమ రాజీపడిన తండ్రి నుండి ఓదార్పు మరియు దయను అనుభవిస్తున్నప్పుడు, వారు జీవితంలోని ప్రతి అంశంలో తమ రక్షకుడైన దేవుని బోధలను ఉదాహరణగా చూపాలి. వారు ఒకరికొకరు ఎలా సేవ చేయగలరో పరిగణలోకి తీసుకోవాలని వారు ప్రోత్సహించబడ్డారు, ప్రత్యేకించి ఒకరినొకరు మరింత శక్తివంతంగా మరియు సమృద్ధిగా ప్రేమను ప్రదర్శించమని, అలాగే మంచి పనులలో నిమగ్నమవ్వాలని కోరారు. సెయింట్స్ యొక్క కమ్యూనియన్ ఒక విలువైన సహాయం మరియు ప్రత్యేకత, ఇది స్థిరత్వం మరియు పట్టుదలని పెంపొందించడం. రాబోయే ట్రయల్ సమయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, వాటిని ఎక్కువ శ్రద్ధ కోసం ప్రేరణగా ఉపయోగించడం. వ్యక్తులందరికీ విచారణ దినం ఆసన్నమైంది-వారి మరణ దినం.

మతభ్రష్టత్వం యొక్క ప్రమాదం. (26-31) 
మతభ్రష్టత్వానికి వ్యతిరేకంగా మరియు పట్టుదలకు అనుకూలంగా ఉన్న ఉపదేశాలు బలవంతపు కారణాలతో బలోపేతం చేయబడ్డాయి. ప్రశ్నలోని పాపం పూర్తిగా మరియు తిరిగి మార్చలేని పరిత్యాగాన్ని కలిగి ఉంటుంది, ఇక్కడ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మరియు దృఢ నిశ్చయంతో, ఏకైక రక్షకుడైన క్రీస్తును అసహ్యించుకుంటారు మరియు తిరస్కరించారు; ప్రత్యేకమైన పవిత్రమైన స్పిరిట్‌ను వ్యతిరేకించడం మరియు ప్రతిఘటించడం; మరియు సువార్తను తిరస్కరించండి మరియు త్యజించండి, మోక్షానికి ఏకైక మార్గం మరియు నిత్యజీవం యొక్క పదాలు. కొంతమంది అపఖ్యాతి పాలైన పాపులకు భూమిపై ఈ విధ్వంసం గురించి భయంకరమైన సూచన ఇవ్వబడుతుంది, దానితో పాటు దానిని భరించడం లేదా తప్పించుకోవడం గురించి నిరాశ భావన ఉంటుంది.
కనికరం లేకుండా మరణించే శిక్ష ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది, కానీ వారు తిరస్కరించిన దయ మరియు దయ ద్వారా దయతో నశించడం కంటే భయంకరమైనది ఏముంటుంది? దేవుని న్యాయమే కాదు, దుర్వినియోగం చేయబడిన అతని దయ మరియు దయ కూడా ప్రతీకారం కోరినప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమ పాపాల కోసం పశ్చాత్తాపపడే ఆత్మలు దయ నుండి మినహాయించబడతారని లేదా క్రీస్తు త్యాగం యొక్క ప్రయోజనాలను అంగీకరించడానికి ఇష్టపడే ఎవరైనా తిరస్కరించబడతారని ఇది సూచించదని స్పష్టం చేయడం చాలా ముఖ్యం. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో వారు ఏ విధంగానూ తిరస్కరించబడరు.

విశ్వాసుల బాధలు మరియు వారి పవిత్ర వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సాహం. (32-39)
ప్రారంభ క్రైస్తవులు గణనీయమైన పోరాటంలో నిమగ్నమై విభిన్నమైన బాధలను ఎదుర్కొన్నారు. క్రైస్తవ ఆత్మ, దాని నిస్వార్థ స్వభావంతో వర్ణించబడి, విశ్వాసులను కనికరం చూపడానికి, సందర్శించడానికి, సహాయం చేయడానికి మరియు ఇతరుల కోసం వాదించడానికి బలవంతం చేస్తుంది. భూసంబంధమైన రాజ్యంలో, ప్రతిదీ క్షణికమైనది-కేవలం నీడలు. నశించే భూసంబంధమైన ఆస్తులకు పూర్తి విరుద్ధంగా, స్వర్గంలోని సాధువుల శాశ్వతమైన ఆనందం శత్రువుల దాడులకు అతీతంగా ఉంటుంది. ఈ శాశ్వతమైన ఆనందం ఇక్కడ ఎదుర్కొన్న ఏవైనా నష్టాలు లేదా కష్టాలకు సమృద్ధిగా భర్తీ చేస్తుంది.
ప్రస్తుతం, సాధువుల సంతోషంలో ఎక్కువ భాగం వాగ్దానాలలోనే ఉంది. ఇది క్రైస్తవులు తమ భూసంబంధమైన పనులను పూర్తి చేయకుండా జీవించడాన్ని అంగీకరించడానికి సహనాన్ని పరీక్షిస్తుంది, దేవుని నిర్ణీత సమయంలో వారి ప్రతిఫలం కోసం వేచి ఉంది. మరణానంతరం, దేవుడు వారి బాధలన్నిటినీ తుదముట్టించడానికి మరియు వారికి జీవితపు కిరీటాన్ని ప్రసాదించడానికి త్వరగా వస్తాడు. క్రైస్తవుల ప్రస్తుత సంఘర్షణ తీవ్రంగా ఉన్నప్పటికీ, అది క్లుప్తంగా ఉంటుంది. అటువంటి చర్యలను అసంతృప్తితో చూస్తూ పట్టుదల లేని వారి నుండి ఉపరితలంపై ఉన్న వృత్తి మరియు కేవలం బాహ్య విధులతో దేవుడు ఎన్నటికీ సంతోషించడు. గతంలో ముఖ్యమైన పరీక్షల ద్వారా విశ్వాసపాత్రంగా ఉన్నవారు తమ విశ్వాసం మరియు సహనం యొక్క పరాకాష్టను-వారి ఆత్మల మోక్షాన్ని పొందే వరకు విశ్వాసం ద్వారా జీవించడం కొనసాగించినప్పుడు వారికి అదే దయను అందించడానికి ఎదురుచూడడానికి కారణం ఉంది. విశ్వాసంతో జీవించడం మరియు విశ్వాసంతో చనిపోవడం మన ఆత్మలకు శాశ్వతమైన భద్రతను నిర్ధారిస్తుంది.



Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |