Judges - న్యాయాధిపతులు 11 | View All

1. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.

1. Now Jephthah the Gileadite was a mighty man of valor, but he [was] the son of a harlot; and Gilead begot Jephthah.

2. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి యింట నీకు స్వాస్థ్యము లేదనిరి.

2. Gilead's wife bore sons; and when his wife's sons grew up, they drove Jephthah out, and said to him, 'You shall have no inheritance in our father's house, for you [are] the son of another woman.'

3. యెఫ్తా తన సహోదరుల యొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితో కూడ సంచరించుచుండెను.

3. Then Jephthah fled from his brothers and dwelt in the land of Tob; and worthless men banded together with Jephthah and went out [raiding] with him.

4. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా

4. It came to pass after a time that the people of Ammon made war against Israel.

5. అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున

5. And so it was, when the people of Ammon made war against Israel, that the elders of Gilead went to get Jephthah from the land of Tob.

6. గిలాదు పెద్దలు టోబుదేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.

6. Then they said to Jephthah, 'Come and be our commander, that we may fight against the people of Ammon.'

7. అందుకు యెఫ్తా మీరు నాయందు పగపట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నాయొద్దకు రానేల? అని గిలాదు పెద్దలతో చెప్పెను.

7. So Jephthah said to the elders of Gilead, 'Did you not hate me, and expel me from my father's house? Why have you come to me now when you are in distress?'

8. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితివిు; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసిన యెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారి వవుదువని యెఫ్తాతో అనిరి.

8. And the elders of Gilead said to Jephthah, 'That is why we have turned again to you now, that you may go with us and fight against the people of Ammon, and be our head over all the inhabitants of Gilead.'

9. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయినమీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా

9. So Jephthah said to the elders of Gilead, 'If you take me back home to fight against the people of Ammon, and the LORD delivers them to me, shall I be your head?'

10. గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి.

10. And the elders of Gilead said to Jephthah, 'The LORD will be a witness between us, if we do not do according to your words.'

11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.

11. Then Jephthah went with the elders of Gilead, and the people made him head and commander over them; and Jephthah spoke all his words before the LORD in Mizpah.

12. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా

12. Now Jephthah sent messengers to the king of the people of Ammon, saying, 'What do you have against me, that you have come to fight against me in my land?'

13. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.

13. And the king of the people of Ammon answered the messengers of Jephthah, 'Because Israel took away my land when they came up out of Egypt, from the Arnon as far as the Jabbok, and to the Jordan. Now therefore, restore those [lands] peaceably.'

14. అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి యిట్లనెను

14. So Jephthah again sent messengers to the king of the people of Ammon,

15. యెఫ్తా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.

15. and said to him, 'Thus says Jephthah: 'Israel did not take away the land of Moab, nor the land of the people of Ammon;

16. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.

16. 'for when Israel came up from Egypt, they walked through the wilderness as far as the Red Sea and came to Kadesh.

17. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ­ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.

17. 'Then Israel sent messengers to the king of Edom, saying, 'Please let me pass through your land.' But the king of Edom would not heed. And in like manner they sent to the king of Moab, but he would not [consent.] So Israel remained in Kadesh.

18. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.

18. 'And they went along through the wilderness and bypassed the land of Edom and the land of Moab, came to the east side of the land of Moab, and encamped on the other side of the Arnon. But they did not enter the border of Moab, for the Arnon [was] the border of Moab.

19. మరియఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపినీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా

19. 'Then Israel sent messengers to Sihon king of the Amorites, king of Heshbon; and Israel said to him, 'Please let us pass through your land into our place.'

20. సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములో బడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను.

20. 'But Sihon did not trust Israel to pass through his territory. So Sihon gathered all his people together, encamped in Jahaz, and fought against Israel.

21. అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాసీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని

21. 'And the LORD God of Israel delivered Sihon and all his people into the hand of Israel, and they defeated them. Thus Israel gained possession of all the land of the Amorites, who inhabited that country.

22. అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.

22. 'They took possession of all the territory of the Amorites, from the Arnon to the Jabbok and from the wilderness to the Jordan.

23. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువ కుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా?

23. 'And now the LORD God of Israel has dispossessed the Amorites from before His people Israel; should you then possess it?

24. స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.

24. 'Will you not possess whatever Chemosh your god gives you to possess? So whatever the LORD our God takes possession of before us, we will possess.

25. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా?

25. 'And now, [are] you any better than Balak the son of Zippor, king of Moab? Did he ever strive against Israel? Did he ever fight against them?

26. ఇశ్రాయేలీయులు హెప్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?

26. 'While Israel dwelt in Heshbon and its villages, in Aroer and its villages, and in all the cities along the banks of the Arnon, for three hundred years, why did you not recover [them] within that time?

27. ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.

27. 'Therefore I have not sinned against you, but you wronged me by fighting against me. May the LORD, the Judge, render judgment this day between the children of Israel and the people of Ammon.' '

28. అయితే అమ్మోనీయులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొన లేదు.

28. However, the king of the people of Ammon did not heed the words which Jephthah sent him.

29. యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.

29. Then the Spirit of the LORD came upon Jephthah, and he passed through Gilead and Manasseh, and passed through Mizpah of Gilead; and from Mizpah of Gilead he advanced [toward] the people of Ammon.

30. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల

30. And Jephthah made a vow to the LORD, and said, 'If You will indeed deliver the people of Ammon into my hands,

31. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.

31. then it will be that whatever comes out of the doors of my house to meet me, when I return in peace from the people of Ammon, shall surely be the LORD's, and I will offer it up as a burnt offering.'

32. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని
హెబ్రీయులకు 11:32

32. So Jephthah advanced toward the people of Ammon to fight against them, and the LORD delivered them into his hands.

33. అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరామీము వరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.

33. And he defeated them from Aroer as far as Minnith -- twenty cities -- and to Abel Keramim, with a very great slaughter. Thus the people of Ammon were subdued before the children of Israel.

34. యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు.

34. When Jephthah came to his house at Mizpah, there was his daughter, coming out to meet him with timbrels and dancing; and she [was his] only child. Besides her he had neither son nor daughter.

35. కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా

35. And it came to pass, when he saw her, that he tore his clothes, and said, 'Alas, my daughter! You have brought me very low! You are among those who trouble me! For I have given my word to the LORD, and I cannot go back on it.'

36. ఆమె నా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితో ననెను.

36. So she said to him, 'My father, [if] you have given your word to the LORD, do to me according to what has gone out of your mouth, because the LORD has avenged you of your enemies, the people of Ammon.'

37. మరియు ఆమె - నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా

37. Then she said to her father, 'Let this thing be done for me: let me alone for two months, that I may go and wander on the mountains and bewail my virginity, my friends and I.'

38. అతడు పొమ్మని చెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడ పోయి కొండలమీద తన కన్యా త్వమునుగూర్చి ప్రలాపించెను.

38. So he said, 'Go.' And he sent her away [for] two months; and she went with her friends, and bewailed her virginity on the mountains.

39. ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.

39. And it was so at the end of two months that she returned to her father, and he carried out his vow with her which he had vowed. She knew no man. And it became a custom in Israel

40. ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.

40. [that] the daughters of Israel went four days each year to lament the daughter of Jephthah the Gileadite.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యెఫ్తా మరియు గిలాదీయులు. (1-11) 
ప్రజలు తమ స్వంత యోగ్యత ద్వారా ఏదైనా ప్రతికూల అవగాహనలను అధిగమించగలిగినంత కాలం, వారి తల్లిదండ్రుల కోసం విమర్శించకూడదు. దేవుడు ఇశ్రాయేలును క్షమించాడు మరియు అదే విధంగా, యెఫ్తా క్షమించాలని ఎంచుకున్నాడు. ఇశ్రాయేలీయులకు మరింత శిక్షగా అమ్మోనీయులు విజయం సాధించడానికి దేవుడు న్యాయబద్ధంగా అనుమతించగలడని గ్రహించి, అతను తన విజయం గురించి నమ్మకంతో ప్రగల్భాలు పలకడు. అలాగని తనపై అచంచల విశ్వాసం కూడా లేదు. అతను విజయం సాధిస్తే, అతను విజయాన్ని తన చేతుల్లోకి అందించడానికి ప్రభువు దానిని ఆపాదిస్తాడు, విజయానికి అంతిమ మూలంగా దేవుని వైపు చూడాలని తన తోటి దేశస్థులకు గుర్తుచేస్తాడు. క్రీస్తు ద్వారా మోక్షాన్ని కోరుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. అతను మిమ్మల్ని రక్షిస్తే, ఆయన మిమ్మల్ని పరిపాలించనివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అతను ఇతర నిబంధనలపై మోక్షాన్ని అందించడు. అతను ఆనందాన్ని కలిగిస్తే, మిమ్మల్ని పవిత్రంగా చేయడానికి మీరు అతన్ని అనుమతిస్తారా? అతను మీకు సహాయకుడిగా మారినట్లయితే, మీరు ఆయనను మీ అధిపతిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? యెఫ్తా ఒక చిన్న ప్రాపంచిక గౌరవం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లే, క్రీస్తు జయించిన వారికి జీవిత కిరీటాన్ని వాగ్దానం చేసినప్పుడు మనకు ఎదురయ్యే ఇబ్బందులను బట్టి మన క్రైస్తవ ప్రయాణంలో మనం నిరుత్సాహపడాలా?

అతను శాంతిని చేయడానికి ప్రయత్నిస్తాడు. (12-28) 
మన సృష్టికర్తగా మనం దేవునికి గౌరవం మరియు గౌరవాన్ని ప్రదర్శించడానికి ఒక మార్గం ఏమిటంటే, ఆయన మనకు ఇచ్చే ఆస్తులను సరైన పద్ధతిలో ఉపయోగించడం. మనం ఆయన నుండి ఈ ఆశీర్వాదాలను పొందాలి, ఆయన ఉద్దేశాల కోసం వాటిని ఉపయోగించుకోవాలి మరియు అతను దాని కోసం పిలిచినప్పుడు వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. యెఫ్తా సందేశం మొత్తం మోషే పుస్తకాలతో అతనికి ఉన్న పరిచయాన్ని సూచిస్తుంది. అతని వాదన తార్కికమైనది మరియు అతని అభ్యర్థన సహేతుకమైనది. దృఢమైన మరియు ధైర్యమైన విశ్వాసం ఉన్నవారు శాంతిని కోరుకునే అవకాశం ఉంది మరియు దానిని పొందేందుకు హృదయపూర్వక ప్రయత్నాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ, దురాశ మరియు ఆశయంతో నడిచే వ్యక్తులు తరచుగా తమ ఉద్దేశాలను న్యాయమైన ముసుగుతో మారువేషంలో ఉంచుతారు, శాంతియుత తీర్మానాలను వ్యర్థం చేస్తారు.

యెఫ్తా ప్రతిజ్ఞ. అతను అమ్మోనీయులను ఓడించాడు. (29-40)
యెఫ్తా యొక్క ప్రతిజ్ఞ నేర్చుకోవలసిన అనేక కీలకమైన పాఠాలను అందిస్తుంది:
1. నిజమైన మరియు భక్తిగల విశ్వాసుల హృదయాలలో కూడా, అపనమ్మకం మరియు సందేహం యొక్క జాడలు ఇంకా మిగిలి ఉండవచ్చు.
2. దేవునికి మన ప్రమాణాలు ఆయన నుండి అనుగ్రహాన్ని పొందేందుకు ఒక సాధనంగా ఉపయోగించకూడదు; బదులుగా, వారు మన కృతజ్ఞత మరియు భక్తిని వ్యక్తం చేయాలి.
3. అనవసరమైన మరియు సమస్యాత్మకమైన పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతిజ్ఞ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మరియు వివేకంతో ఉండాలి.
4. ఒకసారి మనం గంభీరంగా దేవునికి ఏదైనా ప్రమాణం చేస్తే, అది సాధ్యమైనది మరియు చట్టబద్ధమైనది అయితే, అది కష్టమైన మరియు భారమైనదిగా నిరూపించబడినప్పటికీ మనం దానిని నెరవేర్చాలి.
5. పిల్లలు విధేయతతో మరియు ఆనందంగా ప్రభువులో తమ తల్లిదండ్రులకు లోబడాలి.

యెఫ్తా తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ఏమి చేశాడనే దాని ప్రత్యేకతలు అనిశ్చితంగా ఉన్నాయి; అయినప్పటికీ, అతను తన కుమార్తెను దహనబలిగా అర్పించలేదని నమ్ముతారు, అలాంటి త్యాగం దేవుడికి అసహ్యకరమైనది. బదులుగా, ఆమె వివాహం చేసుకోకుండా మరియు తన కుటుంబం నుండి విడిగా ఉండటానికి పవిత్రం చేయబడి ఉండవచ్చు. నేర్చుకొన్న పండితులను విభజించిన మరియు సందేహాన్ని కలిగించిన పవిత్ర చరిత్రలోని ఈ మరియు ఇతర సవాలు భాగాల గురించి, అనవసరమైన గందరగోళం అవసరం లేదు. కృతజ్ఞతగా, మన మోక్షానికి అవసరమైనది స్పష్టంగా ఉంది, దేవునికి ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ బోధకు సంబంధించి క్రీస్తు వాగ్దానాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా మరియు ఈ పరలోక బోధకుని నుండి వినయంతో మార్గనిర్దేశం చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైనంత వరకు ప్రతి ప్రకరణంలోని సత్యాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది.



Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |