Judges - న్యాయాధిపతులు 9 | View All

1. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో నున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారి తోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను

1. Abimelech the son of Gideon went to Shechem. While there, he met with his mother's relatives

2. మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.

2. and told them to say to the leaders of Shechem, 'Do you think it would be good to have all seventy of Gideon's sons ruling us? Wouldn't you rather have just one man be king? Abimelech would make a good king, and he's related to us.'

3. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారు ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి;

3. Abimelech's uncles talked it over with the leaders of Shechem who agreed, 'Yes, it would be better for one of our relatives to be king.'

4. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.

4. Then they gave Abimelech seventy pieces of silver from the temple of their god Baal Berith. Abimelech used the silver to hire a gang of rough soldiers who would do anything for money.

5. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారులును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను.

5. Abimelech and his soldiers went to his father's home in Ophrah and brought out Gideon's other sons to a large rock, where they murdered all seventy. Gideon's youngest son Jotham hid from the soldiers, but he was the only one who escaped.

6. తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.

6. The leaders of Shechem, including the priests and the military officers, met at the tree next to the sacred rock in Shechem to crown Abimelech king.

7. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును.

7. Jotham heard what they were doing. So he climbed to the top of Mount Gerizim and shouted down to the people who were there at the meeting: Leaders of Shechem, listen to me, and maybe God will listen to you.

8. చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి

8. Once the trees searched for someone to be king; they asked the olive tree, 'Will you be our king?'

9. మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

9. But the olive tree replied, 'My oil brings honor to people and gods. I won't stop making oil, just to have my branches wave above the other trees.'

10. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా

10. Then they asked the fig tree, 'Will you be our king?'

11. అంజూరపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.

11. But the fig tree replied, 'I won't stop growing my delicious fruit, just to have my branches wave above the other trees.'

12. అటుతరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి

12. Next they asked the grape vine, 'Will you be our king?'

13. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

13. But the grape vine replied, 'My wine brings cheer to people and gods. I won't stop making wine, just to have my branches wave above the other trees.'

14. అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొద యొద్ద మనవిచేయగా

14. Finally, they went to the thornbush and asked, 'Will you be our king?'

15. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.

15. The thornbush replied, 'If you really want me to be your king, then come into my shade and I will protect you. But if you're deceiving me, I'll start a fire that will spread out and destroy the cedars of Lebanon.' After Jotham had finished telling this story, he said:

16. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.

16. My father Gideon risked his life for you when he fought to rescue you from the Midianites. Did you reward Gideon by being kind to his family? No, you did not! You attacked his family and killed all seventy of his sons on that rock. And was it right to make Abimelech your king? He's merely the son of my father's slave girl. But just because he's your relative, you made him king of Shechem.

17. అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించి యున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు

17. (SEE 9:16)

18. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల

18. (SEE 9:16)

19. నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక.

19. So, you leaders of Shechem, if you treated Gideon and his family the way you should have, then I hope you and Abimelech will make each other very happy.

20. లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి

20. But if it was wrong to treat Gideon and his family the way you did, then I pray that Abimelech will destroy you with fire, and I pray that you will do the same to him.

21. తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.

21. Jotham ran off and went to live in the town of Beer, where he could be safe from his brother Abimelech.

22. అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.

22. Abimelech had been a military commander of Israel for three years,

23. అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,

23. when God decided to punish him and the leaders of Shechem for killing Gideon's seventy sons. So God turned the leaders of Shechem against Abimelech.

24. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.

24. (SEE 9:23)

25. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారి నందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను.

25. Then they sent some men to hide on the hilltops and watch for Abimelech and his troops, while they sent others to rob everyone that went by on the road. But Abimelech found out what they were doing.

26. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి.

26. One day, Gaal son of Ebed went to live in Shechem. His brothers moved there too, and soon the leaders of Shechem started trusting him.

27. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా

27. The time came for the grape harvest, and the people of Shechem went into their vineyards and picked the grapes. They put the grapes in their wine-pits and walked on them to squeeze out the juice in order to make wine. Then they went into the temple of their god and threw a big party. There was a lot of eating and drinking, and before long they were cursing Abimelech.

28. ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతని కెందుకు దాసులము కావలెను?

28. Gaal said: Hamor was the founder of Shechem, and one of his descendants should be our ruler. But Abimelech's father was Gideon, so Abimelech isn't really one of us. He shouldn't be our king, and we shouldn't have to obey him or Zebul, who rules Shechem for him.

29. ఈ జనము నా చేతిలో ఉండిన యెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.

29. If I were the ruler of Shechem, I'd get rid of that Abimelech. I'd tell him, 'Get yourself an even bigger army, and we will still defeat you.'

30. ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలుమాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.

30. Zebul was angry when he found out what Gaal had said.

31. అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చి యున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపు చున్నారు.

31. And so he sent some messengers to Abimelech. But they had to pretend to be doing something else, or they would not have been allowed to leave Shechem. Zebul told the messengers to say: Gaal the son of Ebed has come to Shechem along with his brothers, and they have persuaded the people to let Gaal rule Shechem instead of you.

32. కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి,

32. This is what I think you should do. Lead your army here during the night and hide in the fields.

33. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను.

33. Get up the next morning at sunrise and rush out of your hiding places to attack the town. Gaal and his followers will come out to fight you, but you will easily defeat them.

34. అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెము మీద పడుటకు పొంచి యుండిరి.

34. So one night, Abimelech led his soldiers to Shechem. He divided them into four groups, and they all hid near the town.

35. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.

35. The next morning, Gaal went out and stood in the opening of the town gate. Abimelech and his soldiers left their hiding places,

36. గాలు ఆ జనులను చూచి జెబులుతో ఇదిగో జనులు కొండశిఖరముల మీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.

36. and Gaal saw them. Zebul was standing there with Gaal, and Gaal remarked, 'Zebul, that looks like a crowd of people coming down from the mountaintops.' 'No,' Zebul answered, 'it's just the shadows of the mountains. It only looks like people moving.'

37. గాలుచూడుము, దేశపు ఎత్తయిన ప్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.

37. But Zebul, look over there,' Gaal said. 'There's a crowd coming down from the sacred mountain, and another group is coming along the road from the tree where people talk with the spirits of the dead.'

38. జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా

38. Then Zebul replied, 'What good is all of your bragging now? You were the one who said Abimelech shouldn't be the ruler of Shechem. Out there is the army that you made fun of. So go out and fight them!'

39. గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.

39. Gaal and the leaders of Shechem went out and fought Abimelech.

40. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.

40. Soon the people of Shechem turned and ran back into the town. However, Abimelech and his troops were close behind and killed many of them along the way.

41. అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.

41. Abimelech stayed at Arumah, and Zebul forced Gaal and his brothers out of Shechem.

42. మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.

42. The next morning, the people of Shechem were getting ready to work in their fields as usual, but someone told Abimelech about it.

43. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీద పడి వారిని హతముచేసెను.

43. Abimelech divided his army into three groups and set up an ambush in the fields near Shechem. When the people came out of the town, he and his army rushed out from their hiding places and attacked.

44. అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంక సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.

44. Abimelech and the troops with him ran to the town gate and took control of it, while two other groups attacked and killed the people who were in the fields.

45. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.

45. He and his troops fought in Shechem all day, until they had killed everyone in town. Then he and his men tore down the houses and buildings and scattered salt everywhere.

46. షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.

46. Earlier that day, the leaders of the temple of El Berith at Shechem had heard about the attack. So they went into the temple fortress,

47. షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు

47. but Abimelech found out where they were.

48. అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.

48. He led his troops to Mount Zalmon, where he took an ax and chopped off a tree branch. He lifted the branch onto his shoulder and shouted, 'Hurry! Cut off a branch just as I did.'

49. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.

49. When they all had branches, they followed Abimelech back to Shechem. They piled the branches against the fortress and set them on fire, burning down the fortress and killing about one thousand men and women.

50. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.

50. After destroying Shechem, Abimelech went to Thebez. He surrounded the town and captured it.

51. ఆ పట్టణమునడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజమానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.

51. But there was a tall fortress in the middle of the town, and the town leaders and everyone else went inside. Then they barred the gates and went up to the flat roof.

52. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా

52. Abimelech and his army rushed to the fortress and tried to force their way inside. Abimelech himself was about to set the heavy wooden doors on fire,

53. ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.

53. when a woman on the roof dropped a large rock on his head and cracked his skull.

54. అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.

54. The soldier who carried his weapons was nearby, and Abimelech told him, 'Take out your sword and kill me. I don't want people to say that I was killed by a woman!' So the soldier ran his sword through Abimelech.

55. అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి.

55. And when the Israelite soldiers saw that their leader was dead, they went back home.

56. అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరులను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.

56. That's how God punished Abimelech for killing his brothers and bringing shame on his father's family.

57. షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజేసెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను.

57. God also punished the people of Shechem for helping Abimelech. Everything happened just as Jotham's curse said it would.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబీమెలెకు తన సహోదరులను చంపి రాజుగా చేయబడ్డాడు. (1-6) 
షెకెము ప్రజలు దేవుని మార్గనిర్దేశాన్ని కోరకుండా అబీమెలెకును తమ రాజుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. వారికి రాజు ఉండాలా వద్దా అనే దానిపై ఎటువంటి పరిశీలన లేదు మరియు సరైన అభ్యర్థి ఎవరనే దానిపై ఖచ్చితంగా ఆలోచించలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల చర్యలను మరియు వారు ఎదుర్కొనే పరీక్షలను ముందుగానే చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటే, వారి సంతోషం తరచుగా దుఃఖంతో కప్పబడి ఉండవచ్చు. కృతజ్ఞతగా, మనం భవిష్యత్తు గురించిన జ్ఞానం నుండి తప్పించబడ్డాము మరియు అది ఒక ఆశీర్వాదం. మరీ ముఖ్యంగా, మనం పాపం పట్ల అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన తప్పుడు చర్యలు మన కుటుంబాలకు దీర్ఘకాలిక మరియు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తాయి.

యోతాము షెకెమీయులను మందలించాడు. (7-21) 
చెట్లు తమలో తాము రాజును నియమించుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి వాటిని నాటిన ప్రభువుకు చెందినవి. అదేవిధంగా, ఇశ్రాయేలుకు మానవ రాజును స్థాపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభువు వారి అంతిమ పరిపాలకుడు. సమాజ శ్రేయస్సు కోసం ఫలవంతంగా సహకరించే వారు కేవలం ప్రతిష్టను కోరుకునే వారి కంటే జ్ఞానుల నుండి గౌరవం మరియు ప్రశంసలకు అర్హులు. కథలోని ఫలాలను ఇచ్చే చెట్లలో ప్రతి ఒక్కటి ఇతర చెట్ల కంటే ఎత్తుగా ఉండటానికి నిరాకరించడానికి లేదా మార్జిన్ సూచించినట్లుగా, "చెట్ల కోసం పైకి క్రిందికి వెళ్లడానికి" ఇలాంటి కారణాలను అందించింది. నాయకత్వ పదవిని చేపట్టడం గణనీయమైన శ్రమ మరియు బాధ్యతను కలిగి ఉంటుంది. ప్రజల విశ్వాసం మరియు అధికారం అప్పగించబడిన వారు తమ స్వంత ప్రయోజనాలు మరియు ప్రయోజనాల కంటే ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా, గౌరవం మరియు అధికార స్థానాలకు ఎదిగిన వారు తమ ప్రభావాన్ని మరియు ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే నిజంగా మంచి చేయాలని కోరుకునే వ్యక్తులు ఎక్కువగా ప్రభావం చూపుతారని భయపడతారు. యోతాము అబీమెలెకు మరియు బ్రాంబుల్ లేదా తిస్టిల్, కాల్చడానికి ఉద్దేశించిన పనికిరాని మొక్కల మధ్య పోలికను చూపాడు. ఈ విధంగా, అతను అబీమెలెక్ తన అధికారం మరియు నాయకత్వ సాధనలో అదే పనికిమాలిన వ్యక్తి అని నిందించాడు.

షెకెమీయులు అబీమెలెకుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. (22-29) 
అబీమెలెకు ఇప్పుడు తన తండ్రి తిరస్కరించిన సింహాసనాన్ని ఆక్రమించాడు. అయినప్పటికీ, ఈ స్పష్టమైన కీర్తి ఎంత క్షణికమైనది? కేవలం మూడు సంవత్సరాలు వేచి ఉండండి, మరియు ముళ్లపొర వాడిపోయి, అగ్నిలో దహించబడుతుందని సాక్ష్యమివ్వండి. దుర్మార్గుల శ్రేయస్సు నిజానికి తాత్కాలికమైనది మరియు మోజుకనుగుణమైనది. అబీమెలెకును సింహాసనంపై ఉంచినందుకు షెకెమ్ ప్రజలు వారి అన్యాయపు చర్యల యొక్క పరిణామాలను అనుభవిస్తారు, మరియు ఇప్పుడు వారు అతని స్వంత చేతులతో విధించిన అతని పాలన యొక్క భారాన్ని భరించారు.

అబీమెలెకు షెకెమును నాశనం చేస్తాడు. (30-49) 
ప్రస్తుతం తనను అగౌరవపరిచినందుకు షెకెమీయులపై ప్రతీకారం తీర్చుకోవాలని అబీమెలెకు ప్లాన్ చేశాడు. అయితే, దేవుని శిక్ష వారికి మాత్రమే కాదు, గిద్యోను కుమారుల హత్యలో వారి ప్రమేయం కూడా ఉంది. దేవుడు తన ప్రణాళికలను అమలు చేయడానికి వ్యక్తులను సాధనంగా ఉపయోగించినప్పుడు, వారి ఉద్దేశాలు అతని దైవిక ఉద్దేశ్యానికి భిన్నంగా ఉండవచ్చు. మోసం మరియు అసత్యాన్ని కనుగొనడానికి మాత్రమే విగ్రహాలను ఆశ్రయించే వారి వలె వారికి శ్రేయస్సును తీసుకురావాలని వారు ఆశించేది ఒక ఉచ్చు మరియు ఉచ్చుగా మారింది.

అబీమెలెకు చంపబడ్డాడు. (50-57)
దుష్టత్వానికి నాయకుడైన అబీమెలెకు షెకెమీయులను నాశనం చేశాడు. పాపులు సులభంగా మరియు విజయవంతమైన కాలాన్ని ఆస్వాదించవచ్చు, కానీ చివరికి, చెడు వారిని పట్టుకుంటుంది. దుష్టత్వం తాత్కాలికంగా వృద్ధి చెందినప్పటికీ, అది శాశ్వత విజయం కోసం ఉద్దేశించబడలేదు. మానవజాతి చరిత్ర, నిజాయితీగా వివరించినట్లయితే, తరచుగా ఈ అధ్యాయంలో వివరించిన సంఘటనలను పోలి ఉంటుంది. అధికార పోరాటాలు మరియు వైరుధ్యాల యొక్క అద్భుతమైన కథనాలు మానవులలో ప్రబలంగా ఉన్నాయి. కొందరిచే ప్రశంసించబడిన ఈ దృశ్యాలు, మానవ హృదయంలోని మోసపూరితత మరియు విపరీతమైన దుష్టత్వం, మానవ కోరికల శక్తి మరియు సాతాను ప్రభావం గురించి లేఖనాల బోధలను స్పష్టంగా వివరిస్తాయి. ప్రభూ, నీ సత్యాన్ని మరియు నీతిని మాకు అందించావు. మీ పవిత్రత, శాంతి మరియు ప్రేమ యొక్క ఆత్మ మాపై కుమ్మరించబడాలని మేము వినయంగా ప్రార్థిస్తున్నాము మరియు మీ పవిత్ర చట్టం మా హృదయాలలో లిఖించబడాలి.



Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |