Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
ఈ ఒక్క భాష ఏమిటో తెలియదు.
2. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
బబులోను నగరం నిర్మించిన ప్రాంతం పేరు షీనారు. ఇది ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఉంది.
3. మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
4. మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
దేవుడు ఆదికాండము 9:1 లో ఇచ్చిన ఆజ్ఞకు ఈ బాబెలు నిర్మాణం వ్యతిరేకం. 4వ వచనంలోని వారి మాటల్ని బట్టి ఆ నగరాన్ని కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం వారి అహంభావం, తమను ఘనపరచుకోవాలనే మిడిసిపాటు అని అర్థమౌతున్నది. తరువాతి కాలంలో ఇదే ప్రదేశంలో నెబుకద్నెజరు ఒక బ్రహ్మాండమైన నగరాన్ని కట్టించాడు. తన శక్తియుక్తుల గురించి అతడు బడాయిలు చెప్పుకోవడానికి ఇది కారణమైంది (దానియేలు 4:30). లేఖనంలో బబులోను అనే పేరు సాధారణంగా మనిషి గర్వానికీ దేవుని పట్ల అతడి తిరస్కార భావానికీ సంబంధించినది (యెషయా 47:8 యిర్మియా 50:24 యిర్మియా 29:32 దానియేలు 4:30 దానియేలు 5:1-4 ప్రకటన గ్రంథం 17:4-6 ప్రకటన గ్రంథం 18:7). బబులోను విగ్రహారాధనకూ అబద్ధ మతానికి దేవుని ప్రజలను హింసించే ధోరణికీ కేంద్రం. “బాబెలు” అనే పేరుకు రెండు అర్థాలు ఉండవచ్చు. చాలామంది అభిప్రాయం ప్రకారం బహుశా “దేవుని ద్వారం” అని అర్థం ఉండవచ్చు. కట్టించబూనుకున్నవారు ఈ విధంగా తప్పుగా తలంచి ఉండవచ్చు. బాబెలు అనే పదం “గందరగోళం” అనే అర్థాన్నిచ్చే హీబ్రూ పదం నుంచి కూడా తీసుకురావచ్చు. దేవుని ద్వారం అని మనుషులు గొప్పలు చెప్పుకున్నది దేవుని దృష్టిలో కేవలం గందరగోళంగా ఉంది. మానవుడు సాధించానని గర్వపడుతున్న వాటన్నింటినీ దేవుడు చివరికి నాశనం చేసి వారి గర్వాన్ని మట్టి కరిపిస్తాడు (లేవీయకాండము 26:18-19 సామెతలు 15:25 సామెతలు 16:18 యెషయా 2:17-22 యెషయా 25:11 యిర్మియా 13:9 యిర్మియా 49:16 దానియేలు 4:37 జెఫన్యా 2:8-10 యాకోబు 4:6 1 పేతురు 5:5 ప్రకటన గ్రంథం 18:7-8).
5. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
“దిగివచ్చాడు”– ఆదికాండము 18:21 నోట్ చూడండి.
6. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు.
మరో విధంగా చెప్పాలంటే దేవునికీ భూమిపై ఆయన సంకల్పాలకూ వ్యతిరేకంగా వాళ్ళు తమను తామే అత్యున్నతంగా గొప్ప చేసుకుంటారన్నమాట.
7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
8. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి.
వాళ్ళు ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా కోరుకున్నారు. అయితే దేవుని ఉద్దేశంలో ఇది మంచిది (వ 4; ఆదికాండము 9:1). తిరుగుబాటు చేసే మనుషులను లెక్కచేయకుండా దేవుడు తన ఉద్దేశాలను తప్పక నెరవేర్చుకుంటాడు.
9. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
కీర్తనల గ్రంథము 92:9 లూకా 1:51. మనిషి గర్వం అవిధేయతల మూలంగా నానా విధాల భాషలు కలిగాయి. అనేక శతాబ్దాలుగా ఈ నాటికీ భాషా సమస్య ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది!
10. షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.లూకా 3:34-36
ఇస్రాయేల్ షేము సంతతి. ఈ వంశావళితో ఇస్రాయేల్ చరిత్ర ఆరంభం అవుతున్నది. బైబిల్లో ఇటుతరువాత ఎక్కువ భాగం ఈ చరిత్రే కనిపిస్తుంది. మానవత మరోసారి రెండు భాగాలయింది. దేవుడు లోకానికి గొప్ప సంగతులను నేర్పించడానికి షేము సంతతివారిని ఎన్నుకున్నాడు. అన్ని జాతులకూ గొప్ప దీవెనలు కలగాలని ఇందులో దేవుని ఉద్దేశం.
11. షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
12. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
13. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
14. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
15. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
16. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
హీబ్రూ అనే పదం ఏబెరు అనే పేరునుంచి వచ్చి ఉండవచ్చు.
17. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
18. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
19. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
20. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
21. రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
22. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
23. సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
24. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
25. నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
26. తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
27. తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.
28. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
“ఊర్”– బబులోను దేశంలోని ఒక పెద్ద పట్టణం. చంద్ర దేవతారాధనకూ ఇతర విగ్రహపూజలకూ ఇది కేంద్రం (యెహోషువ 24:2).
29. అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
30. శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
31. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
“హారాను”– ప్రస్తుతం టర్కీ దేశంలో సిరియా సరిహద్దు దగ్గర ఉన్న ఒక పట్టణం.
32. తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.