1. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
1. ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు.
2. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
2. అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్టు యాకోబు గమనించాడు.
3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
3. అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
4. కనుక యాకోబు తన గొర్రెలు, మేకలు మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు.
5. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
5. రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు.
6. మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.
6. నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు.
7. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
7. అయితే మీ తండ్రి నన్ను మోసం చేసాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటి నుండి దేవుడు నన్ను కాపాడాడు.”
8. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.
8. “ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి.
9. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
9. కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.
10. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
10. “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఎదవుతోన్న మగ మేకలన్నీ మచ్చలు, చారలు గలవేనని నేను చూశాను.
11. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
11. కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత “యాకోబూ!” అన్నాడు. ‘చిత్తం’ అన్నాను నేను.”
12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని
12. “ఆ దేవదూత అన్నాడు: “చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్టు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. కొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను.
13. నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
13. బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోసావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేసావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.”
14. అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?
15. అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
16. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తర మియ్యగా
16. మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేసాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”
17. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
17. అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు.
18. కనాను దేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.
18. అప్పుడు వాళ్లు, అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు.
19. లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.
19. ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.
20. యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను.
20. సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేసాడు. అతడు వెళ్లిపోతున్నట్టు లాబానుతో చెప్పలేదు.
21. అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
21. యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.
22. యాకోబు పారిపోయినట్టు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది.
23. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
23. కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు.
24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
24. ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయ్యి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.
25. మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసికొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.
26. అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?
26. యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేసావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు?
27. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
27. నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి.
28. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టు కొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
28. కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని.
29. మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.
29. నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు.
30. నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరిన యెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా
30. నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్టు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”
31. యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని
31. యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను.
32. ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.
32. అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.
33. లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.
33. కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు.
34. రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.
34. రాహేలు తన ఒంటె సామాగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.
35. ఆమె తన తండ్రితో తమ యదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.
35. “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను రుతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.
36. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమ నేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?
36. అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేసాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది?
37. నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.
37. నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్టు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు.
38. ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.
38. ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేసాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి గూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి గూడా నేను తినలేదు.
39. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
39. ఎప్పుడైనా సరే అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను.
40. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.
40. పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది.
41. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.
41. 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేసాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14సంవత్సరాలు నేను నీకు పని చేసాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేసాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు.
42. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
42. అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేసాడు.”
43. అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారుల నైనను నేనేమి చేయగలను.
43. యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు.
44. కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
44. కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”
45. యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
45. కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్టు సూచనగా దాన్ని నిలువబెట్టాడు.
46. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
46. మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయుమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేసారు.
47. ఆ స్థలానికి యగర్ శాహదూత అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు అని పేరు పెట్టాడు.
48. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
48. “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.
49. అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
49. అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యోహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.
50. మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
50. అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు.
51. మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.
51. ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ.
52. హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
52. మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు.
53. ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వికుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.” యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేసాడు.
54. యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.
54. అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు.
55. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.
55. మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన యింటికి వెళ్లిపోయాడు.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
యాకోబు రహస్యంగా బయలుదేరాడు. (1-21)
బైబిల్ కుటుంబాల గురించి మరియు వారి జీవితాలను ఎలా గడుపుతుంది అనే దాని గురించి చాలా మాట్లాడుతుంది, అయితే ఇది చాలా కాలం క్రితం ప్రపంచంలో జరిగిన పెద్ద సంఘటనల గురించి ఎక్కువగా మాట్లాడదు. మంచిగా ఉండాలో, దేవుణ్ణి ప్రేమించాలో, ఇతరులకు ఎలా సహాయం చేయాలో బైబిలు ప్రజలకు బోధిస్తోంది. కొందరు వ్యక్తులు నిజంగా స్వార్థపరులు మరియు ఇతరులను బాధపెట్టినప్పటికీ, తమ గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. ఇది మంచిది కాదు మరియు అసూయ మరియు ఇతర చెడు విషయాలకు దారి తీస్తుంది. కొంతమంది డబ్బు మరియు వస్తువుల గురించి చాలా శ్రద్ధ వహిస్తారు, ఇది చెడు విషయాలకు కూడా దారి తీస్తుంది. ఒకరికొకరు దయగా ఉండటం ముఖ్యం మరియు ఎల్లప్పుడూ మన గురించి ఆలోచించకూడదు. కొన్నిసార్లు మనం సంతోషంగా లేనప్పుడు, మనం అసూయపడవచ్చు లేదా ఇతరులతో వాదించవచ్చు. కానీ మనల్ని సంతోషపరిచే అంశాలు ఉన్నాయి, మనం మొదటి స్థానంలో ఉండటానికి ప్రయత్నించాలి. మనం కదిలినప్పుడల్లా, దేవుడు మనతో ఏమి చేయమని చెప్పాడో గుర్తుంచుకోవాలి మరియు అతను మనతో ఉంటాడని నమ్మాలి. మనం భయానక పరిస్థితులను ఎదుర్కోవచ్చు, కానీ మనం దేవునికి సన్నిహితంగా ఉన్నట్లు భావించిన సమయాల గురించి ఆలోచిస్తే మనకు మంచి అనుభూతి కలుగుతుంది. మరియు మనం దేవునికి చేసిన వాగ్దానాలను గుర్తుంచుకోవాలి మరియు వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
లాబాను యాకోబును వెంబడించాడు. (23-35)
చెడ్డ వ్యక్తుల ప్రవర్తనను దేవుడు నియంత్రించగలడు, వారు తనను నిజంగా ప్రేమించకపోయినా. కొన్నిసార్లు, చెడ్డ వ్యక్తులు మంచిగా నటిస్తారు కాబట్టి వారు బాగా కనిపిస్తారు. లాబాను తన వస్తువులను "దేవతలు" అని పిలవడానికి వెర్రివాడు ఎందుకంటే అవి దొంగిలించబడతాయి. శత్రువులు మన వస్తువులను దొంగిలించవచ్చు, కానీ వారు దేవునిపై మనకున్న నమ్మకాన్ని తీసివేయలేరు. తాను చేయని పనులకు లాబాను యాకోబును నిందించాడు. సహాయం కోసం దేవుడిని అడగడం ఫర్వాలేదు, కానీ మనం ఇంకా గౌరవంగా ఉండాలి. రాచెల్ తన తండ్రి వస్తువులను దొంగిలించినప్పుడు, అది చాలా తప్పు. నాహోర్ కుటుంబం విగ్రహాలను ఆరాధించే స్థలాన్ని విడిచిపెట్టినప్పటికీ, వారు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించారు. ఇది తాము దేవుణ్ణి నమ్ముతామని చెప్పుకునే వ్యక్తులు వంటిది, కానీ మంచి లేని ఇతర విషయాలను కూడా నమ్ముతారు.
జెఫన్యా 1:5 కొందరు వ్యక్తులు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెబుతారు, కానీ వారు నిజంగా డబ్బు మరియు వస్తువులపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వారు దేవునికి బదులుగా పూజించే విగ్రహాలు లేదా వస్తువులను కలిగి ఉండవచ్చు. ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని నిమగ్నమైనప్పుడు, వారు దేవుడికి బదులుగా ప్రపంచాన్ని ఆరాధించినట్లే. వారు దేవునికి బదులుగా వస్తువులను ఆరాధించే వ్యక్తులతో సమయాన్ని వెచ్చిస్తే, వారు కూడా అలా చేయడం ప్రారంభించవచ్చు.
లాబాన్ ప్రవర్తనపై యాకోబు ఫిర్యాదు. (36-42)
యాకోబు తన భార్య కుటుంబంలో భాగం కావడానికి చాలా కష్టమైన విషయాలను ఎదుర్కొన్నాడు. అతను వాటన్నిటినీ భరించడానికి ఇష్టపడితే, దేవుని కుటుంబంలో భాగం కావడానికి మనం ఏమి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి? యాకోబు తన తండ్రి మరియు తాత గౌరవించే దేవుణ్ణి అదే దేవుడిగా గౌరవించాడు, అయినప్పటికీ అతను దేవుడు గుర్తించబడేంత ముఖ్యమైనవాడు అని అతను భావించలేదు. అబ్రాహాము చనిపోయినప్పటికీ అతడు దేవుణ్ణి అబ్రాహాము మరియు ఇస్సాకు దేవుడు అని పిలిచాడు, ఎందుకంటే ఇస్సాకు ఇప్పటికీ దేవుణ్ణి చాలా గౌరవించాడు.
గలీద్లో వారి ఒడంబడిక. (43-55)
లాబాను యాకోబు సరైనవా లేదా తప్పు అని చెప్పలేకపోయాడు, కాబట్టి అతను దాని గురించి ఇక మాట్లాడదలుచుకోలేదు. కానీ లాబాన్ వారు స్నేహితులు కావాలని సూచించాడు మరియు యాకోబు అంగీకరించాడు. అప్పట్లో పేపర్, పెన్నులు లేని కారణంగా ఈ క్షణాన్ని గుర్తు చేసుకునేందుకు రాళ్ల కుప్పను తయారు చేశారు. వారు ఒకరికొకరు శాంతియుతంగా ఉన్నారని చూపించడానికి వారు దేవునికి బహుమతి కూడా సమర్పించారు. మనం దేవునితో శాంతిని నెలకొల్పినప్పుడు, మన స్నేహంలో మనకు నిజమైన ఓదార్పు ఉంటుంది. పూర్వకాలంలో అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా స్నేహితులుగా మారేవారు. సమూహం ప్రత్యేక విందు నుండి రొట్టెలు తిన్నారు. కలిసి తిని, తాగుతూ స్నేహితులుగా ఉంటామని వాగ్దానం చేశారు. దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాడు మరియు ఎవరు తప్పు చేసినా పర్యవసానాలను ఎదుర్కొంటారు. వారు తమ వాగ్దానం చేసిన ప్రదేశానికి "సాక్షుల కుప్ప" అని పేరు పెట్టారు. వారు వాదించినప్పటికీ, వారు మంచి నిబంధనలతో విషయాలు ముగించారు. కొన్నిసార్లు, దేవుడు మనం అనుకున్నదానికంటే దయగా ఉంటాడు మరియు మనం ఊహించని విధంగా మనకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి నమ్మడం ముఖ్యం.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |