Joshua - యెహోషువ 19 | View All

1. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.

1. And the second lot came forth for the children of Simeon by their kindreds: and their inheritance was

2. వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేరషెబషెబ మోలాదా

2. In the midst of the possession of the children of Juda: Bersabee and Sabee and Molada,

3. హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా

3. And Hasersual, Bala and Asem,

4. And Eltholad, Bethul and Harma,

5. బేత్లెబాయోతు షారూ హెను అనునవి,

5. And Siceleg and Bethmarchaboth and Hasersusa,

6. వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు.

6. And Bethlebaoth and Sarohen: thirteen cities, and their villages.

7. అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.

7. Ain and Remmon and Athor and Asan: four cities, and their villages.

8. దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.

8. And all the villages round about these cities to Baalath Beer Ramath to the south quarter. This is the inheritance of the children of Simeon according to their kindreds,

9. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.

9. In the possession and lot of the children of Juda: because it was too great, and therefore the children of Simeon had their possession in the midst of their inheritance.

10. మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.

10. And the third lot fell to the children of Zabulon by their kindreds: and the border of their possession was unto Sarid.

11. వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి

11. And it went up from the sea and from Merala, and came to Debbaseth: as far as the torrent, which is over against Jeconam.

12. శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి

12. And it returneth from Sarid eastward to the borders of Ceseleththabor: and it goeth out to Dabereth, and ascendeth towards Japhie.

13. అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.

13. And it passeth along from thence to the east side of Gethhepher and Thacasin: and goeth out to Remmon, Amthar and Noa.

14. దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.

14. And it turneth about to the north of Hanathon: and the outgoings thereof are the valley of Jephtahel,

15. కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.

15. And Cateth and Naalol and Semeron and Jedala and Bethlehem: twelve cities and their villages.

16. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.

16. This is the inheritance of the tribe of the children of Zabulon by their kindreds, the cities and their villages.

17. నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.

17. The fourth lot came out to Issachar by their kindreds.

18. వారి సరిహద్దు యెజ్రెయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను

18. And his inheritance was Jezrael and Casaloth and Sunem,

19. And Hapharaim and Seen and Anaharath,

20. ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు

20. And Rabboth and Cesion, Abes,

21. And Rameth and Engannim and Enhadda and Bethpheses.

22. అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

22. And the border thereof cometh to Thabor and Sehesima and Bethsames: and the outgoings thereof shall be at the Jordan: sixteen cities, and their villages.

23. వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

23. This is the possession of the sons of Issachar by their kindreds, the cities and their villages.

24. అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను.

24. And the fifth lot fell to the tribe of the children of Aser by their kindreds:

25. వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు

25. And their border was Halcath and Chali and Beten and Axaph,

26. అలమ్మేలెకు అమాదు మిషెయలు. పడమట అది కర్మెలు వరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి

26. And Elmelech and Amaad and Messal: and it reacheth to Carmel by the sea and Sihor and Labanath,

27. తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు

27. And it returneth towards the east to Bethdagon: and passeth along to Zabulon and to the valley of Jephthael towards the north to Bethemec and Nehiel. And it goeth out to the left side of Cabul,

28. ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.

28. And to Abaran and Rohob and Hamon and Cana, as far as the great Sidon.

29. అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.

29. And it returneth to Horma to the strong city of Tyre, and to Hosa: and the outgoings thereof shall be at the sea from the portion of Achziba:

30. ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.

30. And Amma and Aphec and Rohob: twenty-two cities, and their villages.

31. వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

31. This is the possession of the children of Aser by their kindreds, and the cities and their villages.

32. ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను.

32. The sixth lot came out to the sons of Nephtali by their families:

33. వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి

33. And the border began from Heleph and Elon to Saananim, and Adami, which is Neceb, and Jebnael even to Lecum: and their outgoings unto the Jordan:

34. అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.

34. And the border returneth westward to Azanotthabor, and goeth out from thence to Hucuca, and passeth along to Zabulon southward, and to Aser westward, and to Juda upon the Jordan towards the rising of the sun.

35. కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు

35. And the strong cities are Assedim, Ser, and Emath, and Reccath and Cenereth,

36. And Edema and Arama, Asor,

37. కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు

37. And Cedes and Edri, Enhasor,

38. ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అనునవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు.

38. And Jeron and Magdalel, Herem, and Bethanath and Bethsames: nineteen cities, and their villages.

39. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

39. This is the possession of the tribe of the children of Nephtali by their kindreds, the cities and their villages.

40. ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను.

40. The seventh lot came out to the tribe of the children of Dan by their families:

41. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా

41. And the border of their possession was Saraa and Esthaol, and Hirsemes, that is, the city of the sun.

42. ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను

42. Selebin and Aialon and Jethela,

43. అయ్యా లోను యెతా ఏలోను

43. Elon and Themna and Acron,

44. తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను

44. Elthece, Gebbethon and Balaath,

45. బాలాతా యెహుదు బెనేబెరకు

45. And Jud and Bane and Barach and Gethremmon:

46. గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను.

46. And Mejarcon and Arecon, with the border that looketh towards Joppe,

47. దానీయుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.

47. And is terminated there. And the children of Dan went up and fought against Lesem, and took it: and they put it to the sword, and possessed it, and dwelt in it, calling the name of it Lesem Dan, by the name of Dan their father.

48. వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

48. This is the possession of the tribe of the sons of Dan, by their kindreds, the cities and their villages.

49. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.

49. And when he had made an end of dividing the land by lot to each one by their tribes, the children of Israel gave a possession to Josue the son of Nun in the midst of them,

50. యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలోనివసించెను.

50. According to the commandment of the Lord, the city which he asked for, Thamnath Saraa, in mount Ephraim: and he built up the city, and dwelt in it.

51. యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీ యుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.

51. These are the possessions which Eleazar the priest, and Josue the son of Nun, and the princes of the families, and of the tribes of the children of Israel, distributed by lot in Silo, before the Lord at the door of the tabernacle of the testimony, and they divided the land.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదా పురుషులు తమ భూభాగంలోని నగరాలను విడిచిపెట్టడాన్ని ఎదిరించలేదు, వారు తమకు సరైన అర్హత కంటే ఎక్కువ సంపాదించారని వారు గ్రహించారు. నిష్కపటమైన విశ్వాసి, అనాలోచితంగా ఏదైనా సరికాని దాని నుండి ప్రయోజనం పొందినట్లయితే, ఫిర్యాదు లేకుండా ఇష్టపూర్వకంగా దానిని వదిలివేస్తాడు. ప్రేమ స్వార్థపూరితమైనది కాదు మరియు అది అనుచితంగా ప్రవర్తించదు. ప్రేమ ద్వారా లోతుగా నడిపించబడిన వారు తమ తోటి సహోదరులకు అవసరమైన సమయాల్లో ఆదుకోవడానికి తమ ఆస్తులను ఇష్టపూర్వకంగా వదులుకుంటారు. (1-9)

ఇజ్రాయెల్‌లోని ప్రతి తెగకు భూమిని కేటాయించిన సమయంలో, యాకోబు అందించిన ప్రవచనాత్మక ఆశీర్వాదాలు అసాధారణంగా నెరవేరాయి. వారి స్వంత ఎంపికల ద్వారా లేదా కాస్టింగ్ లాట్ల ద్వారా నిర్ణయించబడినా, పంపిణీ అనేది జాకబ్ ఊహించిన ఖచ్చితమైన పద్ధతి మరియు స్థానాలను అనుసరించింది. భవిష్యవాణి పదం అచంచలమైన మార్గదర్శిగా పనిచేస్తుంది, ఏది నమ్మాలో వెల్లడిస్తుంది మరియు దేవుని ప్రణాళికల యొక్క దైవిక స్వభావాన్ని కాదనలేని విధంగా ధృవీకరిస్తుంది. (10-16)

జాషువా విశేషమైన సహనాన్ని ప్రదర్శించాడు, తన కోసం ఏదైనా ఏర్పాటును కోరుకునే ముందు అన్ని తెగలు స్థిరపడే వరకు వేచి ఉన్నాడు. అతను వారి విజయవంతమైన ప్లేస్‌మెంట్‌ను చూసే వరకు వ్యక్తిగత లాభాలపై దృష్టి పెట్టకుండా ఉండాలని ఎంచుకున్నాడు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఉమ్మడి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, నాయకత్వ స్థానాల్లో ఉన్న వారందరికీ ఇది ఒక ఆదర్శప్రాయమైన పాఠంగా ఉపయోగపడుతుంది. ఇతరులకు మేలు చేయడానికి తీవ్రంగా శ్రమించే వారు పరలోక రాజ్యంలో-పైనున్న కనానులో వారసత్వాన్ని కోరుకుంటారు. అయినప్పటికీ, వారు తమ సహోదరులకు తమ సామర్థ్యాల మేరకు సేవ చేయాల్సిన బాధ్యతను నెరవేర్చే వరకు ఈ వారసత్వంలోకి ప్రవేశించడాన్ని ఆలస్యం చేయడం సముచితమని వారు అర్థం చేసుకున్నారు. ఈ స్వర్గపు ప్రతిఫలం కోసం వారు ఇతరులను కోరుకునేలా, శోధించేలా మరియు పొందేలా ప్రోత్సహించే వారి ప్రయత్నాల కంటే వారికి ఏదీ ఎక్కువ హామీ ఇవ్వదు. సమాంతరంగా, మన ప్రభువైన యేసు భూమిపై నివసించడానికి దిగి, వినయం కోసం ఆడంబరాన్ని విడిచిపెట్టి మరియు పేదరికాన్ని స్వీకరించడం ద్వారా ఈ నిస్వార్థ స్ఫూర్తికి ఉదాహరణ. మానవాళికి విశ్రాంతిని అందించినప్పటికీ, క్రీస్తు యొక్క మిషన్ స్వీయ-సంతోషకరమైనది కాదు కాబట్టి, అతను తన తల వంచడానికి ఎక్కడా లేదు. అతని విధేయత అతని మరణం ద్వారా తన ప్రజలందరికీ శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందే వరకు అతను తన వారసత్వాన్ని వాయిదా వేసాడు. ఇప్పుడు కూడా, విమోచించబడిన ప్రతి పాపి వారి పరలోక విశ్రాంతిని పొందే వరకు ఆయన తన మహిమను సంపూర్ణంగా పరిగణించడు. (17-51)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |