Revelation - ప్రకటన గ్రంథము 17 | View All

1. ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;
యిర్మియా 51:13

1. And there came one of the seven angels that had the seven bowls, and spake with me, saying, Come hither, I will shew thee the judgment of the great harlot that sitteth upon many waters;

2. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.
యెషయా 23:17, యిర్మియా 51:7

2. with whom the kings of the earth committed fornication, and they that dwell in the earth were made drunken with the wine of her fornication.

3. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని
దానియేలు 7:7

3. And he carried me away in the Spirit into a wilderness: and I saw a woman sitting upon a scarletcoloured beast, full of names of blasphemy, having seven heads and ten horns.

4. ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.
యెహెఙ్కేలు 28:13, యిర్మియా 51:7

4. And the woman was arrayed in purple and scarlet, and decked with gold and precious stone and pearls, having in her hand a golden cup full of abominations, even the unclean things of her fornication,

5. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
దానియేలు 4:30

5. and upon her forehead a name written, MYSTERY, BABYLON THE GREAT, THE MOTHER OF THE HARLOTS AND OF THE ABOMINATIONS OF THE EARTH.

6. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా

6. And I saw the woman drunken with the blood of the saints, and with the blood of the martyrs of Jesus. And when I saw her, I wondered with a great wonder.

7. ఆ దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.

7. And the angel said unto me, Wherefore didst thou wonder? I will tell thee the mystery of the woman, and of the beast that carrieth her, which hath the seven heads and the ten horns.

8. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.
నిర్గమకాండము 32:33, కీర్తనల గ్రంథము 69:28, యెషయా 4:3, దానియేలు 7:3, దానియేలు 12:1

8. The beast that thou sawest was, and is not; and is about to come up out of the abyss, and to go into perdition. And they that dwell on the earth shall wonder, {cf15i they} whose name hath not been written in the book of life from the foundation of the world, when they behold the beast, how that he was, and is not, and shall come.

9. ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;

9. Here is the mind which hath wisdom. The seven heads are seven mountains, on which the woman sitteth:

10. మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.

10. and they are seven kings; the five are fallen, the one is, the other is not yet come; and when he cometh, he must continue a little while.

11. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.

11. And the beast that was, and is not, is himself also an eighth, and is of the seven; and he goeth into perdition.

12. నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు.
దానియేలు 7:24

12. And the ten horns that thou sawest are ten kings, which have received no kingdom as yet; but they receive authority as kings, with the beast, for one hour.

13. వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

13. These have one mind, and they give their power and authority unto the beast.

14. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
ద్వితీయోపదేశకాండము 10:17, దానియేలు 2:47

14. These shall war against the Lamb, and the Lamb shall overcome them, for he is Lord of lords, and King of kings; and they {cf15i also shall overcome} that are with him, called and chosen and faithful.

15. మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
యిర్మియా 51:13

15. And he saith unto me, The waters which thou sawest, where the harlot sitteth, are peoples, and multitudes, and nations, and tongues.

16. నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కు లేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.
లేవీయకాండము 21:9

16. And the ten horns which thou sawest, and the beast, these shall hate the harlot, and shall make her desolate and naked, and shall eat her flesh, and shall burn her utterly with fire.

17. దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.

17. For God did put in their hearts to do his mind, and to come to one mind, and to give their kingdom unto the beast, until the words of God should be accomplished.

18. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే.
కీర్తనల గ్రంథము 89:27

18. And the woman whom thou sawest is the great city, which reigneth over the kings of the earth.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Revelation - ప్రకటన గ్రంథము 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రకటన 17:1 – 17:3 ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న ... ... ... కూర్చుండిన యొక స్త్రీని చూచితిని
ఏడు ఉగ్రత పాత్రలు క్రుమ్మరించిన దేవ దూతలలో ఒకడు ఇక్కడికి రమ్ము అంటున్నాడు. యోహాను గారు ఆయా సందర్భాలలో అతడు దృష్టి సారించవలసిన ముఖ్యమైన విషయముల వైపుకు “రమ్ము” అని పిలువబడుట మనకు కనబడుచున్నది.
ప్రకటన 4వ అధ్యాయము ఆరంభములో యేసు ప్రభువు [మొదట వినిన స్వరముతో] యోహాను గారిని పరలోకములోనికి పిలుచుచూ “ఇక్కడికి ఎక్కి రమ్ము” అన్నారు.
ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలను విప్పుచున్నప్పుడు నాలుగు జీవులు “రమ్ము” అంటూ మొదటి నాలుగు ముద్రలు విప్పబడుటకు ముందు పిలిచినట్టు వ్రాయబడి యున్నది.
తిరిగి ఇప్పుడు మహావేశ్యకు చేయబడు తీర్పు చూపించుటకు “రమ్ము” అని ఆ ఏడుగురు దూతలలో ఒకడు పిలుచుట చూచుచున్నాము.
అలాగే ప్రకటన 21:9లో మరో దూత “ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱపిల్లయొక్క భార్యను నీకు చూపెదను” అని పిలిచినట్లు చదువగలము.
ఆత్మవశుడైన ఫిలిప్పు రధము దగ్గరకు పరుగెత్తికొనిపోయి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచున్న నపుంసకునితో నీవు చదువునది గ్రహించుచున్నావా? (అపో 8:30) అని అడుగుచున్నాడు. ప్రియ స్నేహితుడా, నీవునూ “రమ్ము” అని పిలువబడుచున్నావు, గ్రహించుచున్నావా. లోకమునకు అంతిమ తీర్పు, వధువు సంఘము సిద్దపరచబడి దేవుని సన్నిధి నుండి దిగివచ్చుట, వరుడు క్రీస్తు వివాహము యిత్యాది విషయములు ధ్యానించబోవుచున్నాము.
నాడు యోహాను గారితో వుండిన ఆత్మ దేవుడు నేడు మనతో నుండి నడిపించునుగాక. స్త్రీ సంఘమునకు సాదృశ్యము. ప్రకటన 13వ అధ్యాయములో కూడా ఒక స్త్రీని గూర్చి ధ్యానించాము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రిందచంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను (ప్రకటన 12:1). పరి. యోహాను గారు చూచుచున్న ఈ రెండవ స్త్రీ ఎవరు? ఇది కూడా సంఘమే.
పరిశుద్ధ సంఘము అంటే అది పరిమళ వాసన కలిగి వుండాలి, ధవళ వస్త్రము ధరించాలి అని సామాన్యముగా చెప్పవచ్చును. ఐతే ఈ స్త్రీ అనగా ఈ సంఘము ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై యున్నది. అపవిత్ర కార్యములు అందు జరుగుచున్నవి. దాని పేరులో మర్మమున్నది, ఐననూ దాని పేరు మహా పేరు లేక మహా బబులోను. “పేరు గొప్ప ఊరు దిబ్బ” – అన్న చందాన వున్నది సంఘము.
దర్శన కారునికి ఆశ్చర్యము గొలిపినది ఏమంటే, అది హత సాక్షుల సంఘము. దానిలో నమ్మకస్తులైన వారిని ఎవరినీ బ్రతుక నివ్వరు. అందుకేనేమో ఏసుక్రీస్తు – నేను సాతానును జయించాను అనరు; నేను లోకమును జయించియున్నాను అంటారు. ఈ అధ్యాయములో గొర్రెపిల్ల విజయము గూర్చి ధ్యానించుచున్నాము. ఆత్మ దేవుడు మనతోనుండి నడిపించును గాక. ఆమెన్

ప్రకటన 17:4 – 17:18 ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని ... ... ... ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే.
బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు (ప్రక 13:18). ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు (ప్రకటన 17:90). అట్లు ఆ పట్టణము ఎరుషలేము పట్టణమును భ్రమింప చేయుచున్నది ఎట్లనగా, యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు (కీర్త 125:2) అది వున్నది.
ఆత్మ జ్ఞానము చేత మాత్రమే దానిని గుర్తించ గలము. లేనియెడల అదే దైవికమైనదని నమ్మి మోసపోతాము, అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది (యాకో 3:17).
ప్రియులారా. అబద్ద క్రీస్తును విశ్వసించు ప్రజలు ఆయా భాషలు మాటలాడువారిలో నుండి వున్నారు. వారు చివరకు ఒకరికి ఒకరు విరోధులై దానిని ద్వేషించి విడిచి దాని నాశనమునకు కారకులైనట్టు గ్రహించ గలము. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణ మైనను ఏ యిల్లయినను నిలువదు (మత్త 12:25).
అది దేవుని సంకల్పమే. నేటికీ సువార్తకు చోటివ్వని ప్రజలు గల పట్టణాల గతి ఏమిటీ? యేసయ్య ముందుగానే చెప్పారు: ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను (మత్త 10:14,15).
పట్టణము లోకమునకు సాదృశ్యము. అది మహా పట్టణము మహా బబులోను. అవును ఒక్కసారి లోకమువైపు చూడు అది గొప్పగానే కనిపిస్తుంది. ఐతే దాని అంతము దుఃఖకరము. దానిమీదికి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అది ఎలా తీర్పు పొందినదో 18వ అధ్యాయములో ధ్యానము చేద్దాం. కృప మనకు తోడై యుండును గాక. ఆమెన్



Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |