Deuteronomy - ద్వితీయోపదేశకాండము 3 | View All
Study Bible (Beta)

1. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా

1. And so we turneden, and stieden bi the weie of Basan; and Og, the kyng of Basan, yede out ayens vs with his puple, to fiyte in Edrai.

2. యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను.

2. And the Lord seide to me, Drede thou not hym, for he is bitakun in thin hond, with al his puple, and his lond; and thou schalt do to hym, as thou didist to Seon, kyng of Ammoreis, that dwellide in Esebon.

3. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు.

3. Therfor oure Lord God bitook in oure hondis also Og, kyng of Basan, and al his puple; and we han smyte hym `til to deeth,

4. ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగురాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి.

4. and wastiden alle the citees `of him in o tyme; no town was that ascapide vs; `we destrieden sixti citees, al the cuntrei of Argob, of the rewme of Og in Basan.

5. ఆ పురములన్నియు గొప్ప ప్రాకార ములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి.

5. Alle the citees weren strengthid with hiyest wallis, and with yatis and barris; with out townes vnnoumbrable, that hadden not wallis.

6. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;

6. And we diden awey thilke men, as we diden to Seon, kyng of Esebon; and we losten ech citee, and men, and wymmen, and litle children;

7. వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసికొంటిమి.

7. forsothe we token bi prey beestis, and the spuylis of citees.

8. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.

8. And we token in that tyme the lond fro the hond of twey kyngis of Ammorreis, that weren biyonde Jordan, fro the stronde of Arnon `til to the hil of Hermon,

9. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.

9. `which hil Sidonyes clepen Sarion, and Ammorreis clepen Sanyr.

10. మైదానమందలి పురములన్నిటిని బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి.

10. We tooken alle the citees that weren set in the pleyn, and al the lond of Galaad, and of Basan, `til to Selcha and Edray, citees of the rewme of Og, in Basan.

11. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

11. For Og aloone, kyng of Basan, was left of the generacioun of giauntis; and his yrun bed is schewid, which is in Rabath, of the sones of Amon, and hath nyne cubitis of lengthe, and foure cubitis of breede, at the mesure of a cubit of mannus hond.

12. అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

12. And we weldiden in that tyme the lond, fro Aroer, which is on the `brynke of the stronde of Arnon, `til to the myddil paart of the hil of Galaad; and Y yaf the citees `of hym to Ruben and Gad.

13. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని.

13. Forsothe Y yaf the tother part of Galaad, and al Basan, of the rewme of Og, to the half lynage of Manasses, and al the cuntrei of Argob. Al Basan was clepid the lond of giauntis.

14. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.

14. Jair, `sone of Manasses, weldide al the cuntrey of Argob, `til to the lond of Gesuri and of Machati; and he clepide bi his name Basan Anothiair, that is, the townes of Jair, til in to present dai.

15. మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.

15. Also Y yaf Galaad to Machir; and to the lynagis of Ruben and of Gad Y yaf the lond of Galaad, `til to the strond of Arnon, the myddil of the stronde,

16. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును

16. and of the endis `til to the stronde of Jeboth, which is the terme of `the sones of Amon.

17. కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రము వరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

17. And Y yaf the pleyn of the wildernesse `til to Jordan, and the termes of Cenereth `til to the see of deseert, which see is moost salt, at the rotis of the hil of Phasga, ayens the eest.

18. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నధ్దులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను.

18. And Y comaundide to you in that tyme, and seide, Youre Lord God yyueth to you this lond in to erytage;

19. అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును, విశ్రాంతినిచ్చువరకు,

19. alle ye stronge men, without wyues and litle children and beestis, be maad redi, and `go ye bifor youre brithren, the sones of Israel. For Y knowe that ye han many beestis, and tho schulen dwelle in citees whiche Y yaf to you,

20. అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీ కిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.

20. til the Lord yyue reste to youre brithren, as he yaf to you, and til thei also welden the lond `which the Lord schal yyue to hem biyonde Jordan; thanne ech man schal turne ayen in to his possessioun which Y yaf to you.

21. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని మీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యముల నన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.

21. Also Y comaundid to Josue in that tyme, and seide, Thin iyen sien what thingis youre Lord God dide to these twei kyngis; so he schal do to alle rewmes, to whiche thou schalt go; drede thou not hem.

22. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.

22. And Y preiede the Lord in that tyme,

23. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.

23. and seide, Lord God, thou hast bigunne to schewe to thi seruaunt thi greetnesse, and strongeste hond,

24. ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు?

24. for noon other God is ether in heuene, ether in erthe, that mai do thi werkis, and may be comparisound to thi strengthe.

25. నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా

25. Therfor Y schal passe, and schal se this beeste lond biyende Jordan, and this noble hil and Liban.

26. యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియయెహోవా నాతో ఇట్లనెనుచాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.

26. And the Lord was wrooth to me for you, nethir he herde me, but seide to me, It suffisith to thee; speke thou no more of this thing to me.

27. నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.

27. `Stye thou in to the hiynesse of Phasga, and caste aboute thin iyen to the west, and north, and south, and eest, and biholde, for thou schalt not passe this Jordan.

28. యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.

28. Comaunde thou to Josue, and strengthe thou and coumforte hym; for he schal go bifore this puple, and he schal departe to hem the lond, which thou schalt se.

29. అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.

29. And we dwelliden in the valey ayens the temple of Phegor.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
బాషాను రాజు ఓగ్ విజయం. (1-11) 
ఓగ్ అనే శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడు, అతను సీహోన్ అనే మరొక వ్యక్తికి జరిగిన చెడు విషయాల నుండి హెచ్చరికలను వినలేదు. ఓగ్ అతను నిజంగా బలవంతుడని మరియు శాంతిని కోరుకోవడం లేదని అనుకున్నాడు. సీహోనుకు జరిగిన దాని నుండి అతను నేర్చుకోలేదు కాబట్టి, అతను కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. ఇతరులకు చెడు విషయాలు జరిగినప్పుడు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, తద్వారా మనం వారి తప్పుల నుండి నేర్చుకోగలము మరియు అదే వాటిని మనం చేయకుండా నివారించవచ్చు. 

గిలియడ్ మరియు బాషాను దేశం. (12-20) 
చాలా కాలం క్రితం, రూబేనీయులు, గాదీయులు మరియు మనష్షే యొక్క సగం తెగ ప్రజలు ఈ దేశంలో నివసించడానికి వచ్చారు. వారు అక్కడ నివసించడానికి కొన్ని నియమాలకు అంగీకరించారు. మనమందరం కనెక్ట్ అయ్యాము మరియు ఒకే సమూహంలో భాగమైనందున ఇతర వ్యక్తులు ఎలా చేస్తున్నారో ఆలోచించడం మరియు మనకు వీలైనప్పుడు వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

మోషే జాషువాను ప్రోత్సహిస్తున్నాడు. (21-29)
మోషే జాషువా తన తర్వాత అతని స్థానంలోకి రావడానికి సహాయం చేసి ప్రోత్సహించాడు. దేవుణ్ణి సేవించిన వృద్ధులు మతంలో ప్రారంభమైన యువకుల కోసం చేయవలసినది ఇదే. దేవుడు చేసిన మరియు వాగ్దానం చేసిన అన్ని మంచి పనులను మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మన పక్షాన ఉంటే మనపై ఎవరూ గెలవలేరు. మన నాయకుడిని నమ్మి అనుసరించకుంటే అగౌరవం చూపిస్తాం. మిగిలిన ఇశ్రాయేలీయుల కంటే ముందుగా తాను కనానుకు వెళ్లవచ్చా అని మోషే దేవుణ్ణి అడిగాడు, అయితే దేవుడు మన కోసం కోరుకుంటున్నాడని మనం నిజంగా విశ్వసించే వాటిని మాత్రమే అడగాలని అతనికి తెలుసు. దేవుడు మోషే ప్రార్థనకు దయ మరియు శిక్షల మిశ్రమంతో జవాబిచ్చాడు మరియు కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలను విన్నప్పటికీ మనం కోరిన వాటిని సరిగ్గా ఇవ్వడు. దేవుడు మనం కోరుకున్నది ఇవ్వకపోయినా, ఆయన ప్రేమ వల్ల అది లేకుండా మనం సంతోషంగా ఉంటే, అది కూడా అంతే మంచిది. లోకంలో మనకు కావాల్సినవన్నీ లేకపోయినా దేవుడు మన తండ్రిగా, స్వర్గం మన ఇల్లుగా ఉంటే చాలు. దేవుడు మోషేకు అక్కడ నివసించలేనప్పటికీ, కనాను అనే ప్రదేశాన్ని చూడమని వాగ్దానం చేశాడు. కొన్నిసార్లు మనం స్వర్గాన్ని దూరం నుండి మాత్రమే చూడగలం, కానీ అది సరే. దేవుడు మోషేకు ప్రత్యామ్నాయ నాయకుడిని ఇచ్చాడు, ఇది యేసు బోధలను అనుసరించే ప్రజలకు ఓదార్పునిస్తుంది. మనకు స్వర్గం మీద ఆశ ఉంటే చాలు. మనం దేవుని ప్రణాళికను అంగీకరించాలి మరియు ఆయన కోరుకోని వాటిని కోరుతూ ఉండకూడదు. 



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |