Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీ పితరు లతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీన పరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.
ఈ వచనాలు మనకు ఉత్తమ సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. మత్తయి 4:4 లో యేసు క్రీస్తు ఈ వచనాల్లో కొంత భాగాన్ని ఉదహరించాడు. దేవుని పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం భక్తికీ నమ్మకానికీ సహాయకరమని 2వ వచనం సూచిస్తుంది. ద్వితీయోపదేశకాండము 5:15 ద్వితీయోపదేశకాండము 7:18 ద్వితీయోపదేశకాండము 9:7 ద్వితీయోపదేశకాండము 15:15 ద్వితీయోపదేశకాండము 16:3 ద్వితీయోపదేశకాండము 16:12 ద్వితీయోపదేశకాండము 24:9 ద్వితీయోపదేశకాండము 24:22 ద్వితీయోపదేశకాండము 32:7. ద్వితీయోపదేశకాండం అంటే దేవుని పనులను జ్ఞాపకం చేసే పుస్తకం. అనేక చోట్ల వారు ఏమిటో, దేవుడు వారి పట్ల జరిగించిన దేమిటో గుర్తుచేసుకోవడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెపుతున్నది. దేవుడు తన ప్రజలకు సీనాయి ఎడారిలో దారి చూపడంలో అనేకమైన సత్‌ప్రయోజనాలున్నాయి – వారికి అణుకువ కలిగించడం (వ 2,3), వారిని పరీక్షించడం (వ 2,16), వారి హృదయ స్థితి వెల్లడి చెయ్యడం (వ 2), దేవునివాక్కు విని దాని ప్రకారం నడుచుకోవడంలోనే మనిషికి నిజమైన జీవం కలుగుతుందన్న అతి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని వారికి అర్థమయ్యేలా చెయ్యడం (వ 3), వారు శక్తిమంతులై భక్తిపరులై విధేయులైన పిల్లలుగా మారాలని వారి మేలుకోసమే వారిని శిక్షలో పెట్టడం (వ 5) – ఇదంతా ఆయనకు వారిమీద ఉన్న గొప్ప ప్రేమవల్లే. ఇంత ధన్యకరమైన ఫలితాలను కలిగించడంలో తోడ్పడ్డ ఎడారి అనుభవాలకు స్వాగతం చెప్పుకోవాలి. ఈనాడు కూడా ఈ ఎడారి లోకంలో గుండా దేవుడు తన విశ్వాసులను తీసుకువెళ్ళడం ద్వారా అదే పని చేస్తున్నాడు (హెబ్రీయులకు 12:1-13). విశ్వాసులకు ఈ జీవితంలో జరిగేదంతా ఈ కారణం వల్లే.
2. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.
3. ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.మత్తయి 4:4, లూకా 4:4, 1 కోరింథీయులకు 10:3
4. ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
5. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొనిహెబ్రీయులకు 12:7
6. ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను.
7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.
8. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.
9. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.
10. నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.
సమృద్ధిగా సకల సౌభాగ్యాలూ ఉండడం కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా అతిశయం, హృదయ కాఠిన్యం ఇలాంటి స్థితిలో అలవడతాయి (సామెతలు 30:8-9 హోషేయ 13:6 మత్తయి 13:22 మార్కు 10:22-23 ప్రకటన గ్రంథం 3:17-18). సంపదలు గలిగి దేవుణ్ణి మరచిపోవడం కన్నా పేదరికంలో విశ్వాసంతో జీవించడం ఎంతో మిన్న.
11. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని
12. మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,
13. నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు
14. నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
15. తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్య ములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,
16. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.
నిర్గమకాండము 16:15.
17. అయితే మీరుమా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.
18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.
19. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.
ఇస్రాయేల్‌వారు విగ్రహారాధకులైపోతే, వారికి ముందు ఆ దేశంలో నివసించినవారికి జరిగినట్టే వీరికి కూడా నాశనం తప్పదు.
20. నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.