Deuteronomy - ద్వితీయోపదేశకాండము 29 | View All

1. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే.

1. These {are} the words of the covenant which the LORD commanded Moses to make with the children of Israel in the land of Moab, besides the covenant which he made with them in Horeb.

2. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా

2. And Moses called to all Israel, and said to them, Ye have seen all that the LORD did before your eyes in the land of Egypt to Pharaoh, and to all his servants, and to all his land;

3. ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి.

3. The great temptations which thy eyes have seen, the signs, and those great miracles:

4. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు.
రోమీయులకు 11:8

4. Yet the LORD hath not given you a heart to perceive, and eyes to see, and ears to hear, to this day.

5. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.

5. And I have led you forty years in the wilderness: your clothes have not become old upon you, and thy shoe hath not become old upon thy foot.

6. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

6. Ye have not eaten bread, neither have ye drank wine or strong drink: that ye might know that I {am} the LORD your God.

7. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా

7. And when ye came to this place, Sihon the king of Heshbon, and Og the king of Bashan, came out against us to battle, and we smote them:

8. మనము వారిని హతము చేసి వారి దేశ మును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయుల కును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు.

8. And we took their land, and gave it for an inheritance to the Reubenites, and to the Gadites, and to the half-tribe of Manasseh.

9. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను.

9. Keep therefore the words of this covenant, and do them, that ye may prosper in all that ye do.

10. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను,

10. Ye stand this day all of you before the LORD your God; your captains of your tribes, your elders, and your officers, {with} all the men of Israel,

11. నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు,

11. Your little ones, your wives, and thy stranger that {is} in thy camp, from the hewer of thy wood to the drawer of thy water:

12. అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి,

12. That thou shouldst enter into covenant with the LORD thy God, and into his oath, which the LORD thy God maketh with thee this day:

13. నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.

13. That he may establish thee to-day for a people to himself, and {that} he may be to thee a God, as he hath said to thee, and as he hath sworn to thy fathers, to Abraham, to Isaac, and to Jacob.

14. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను

14. Neither with you only do I make this covenant and this oath;

15. ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.

15. But with {him} that standeth here with us this day before the LORD our God, and also with {him} that {is} not here with us this day:

16. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.

16. (For ye know how we have dwelt in the land of Egypt; and how we came through the nations which ye passed by;

17. వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.

17. And ye have seen their abominations, and their idols, wood and stone, silver and gold, which {were} among them:)

18. ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను.
అపో. కార్యములు 8:23, హెబ్రీయులకు 12:15

18. Lest there should be among you man, or woman, or family, or tribe, whose heart turneth away this day from the LORD our God, to go {and} serve the gods of these nations; lest there should be among you a root that beareth gall and wormwood;

19. అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.

19. And it should come to pass, when he heareth the words of this curse, that he should bless himself in his heart, saying, I shall have peace, though I walk in the imagination of my heart, to add drunkenness to thirst:

20. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.
ప్రకటన గ్రంథం 22:18

20. The LORD will not spare him, but then the anger of the LORD and his jealousy shall smoke against that man, and all the curses that are written in this book shall lie upon him, and the LORD shall blot out his name from under heaven.

21. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపము లన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును.

21. And the LORD shall separate him to evil out of all the tribes of Israel according to all the curses of the covenant that are written in this book of the law:

22. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి

22. So that the generation to come of your children that shall arise after you, and the stranger that shall come from a distant land, shall say, when they see the plagues of that land, and the sicknesses which the LORD hath laid upon it;

23. వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి

23. {And that} the whole land of it is brimstone, and salt, {and} burning, {that} it is not sown, nor doth it bear, nor doth any grass grow in it, like the overthrow of Sodom, and Gomorrah, Admah, and Zeboim, which the LORD overthrew in his anger and in his wrath:

24. యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

24. Even all the nations shall say, Why hath the LORD done thus to this land? what {meaneth} the heat of this great anger?

25. మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి

25. Then men shall say, Because they have forsaken the covenant of the LORD God of their fathers, which he made with them when he brought them forth from the land of Egypt:

26. తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి

26. For they went and served other gods, and worshiped them, gods which they knew not, and which he had not given to them:

27. గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.

27. And the anger of the LORD was kindled against this land, to bring upon it all the curses that are written in this book:

28. యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.

28. And the LORD rooted them out of their land in anger and in wrath, and in great indignation, and cast them into another land, as {it is} this day.

29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

29. The secret {things belong} to the LORD our God: but those {things which are} revealed {belong} to us, and to our children for ever, that we may do all the words of this law.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 29 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మోషే ఇజ్రాయెల్ యొక్క దయలను జ్ఞాపకార్థం పిలుస్తాడు. (1-9) 
దేవుడు మన కోసం గతంలో చేసిన అన్ని మంచి పనులను మనం గుర్తుంచుకోవాలి మరియు ఆయన మన నుండి కోరిన వాటిని చేయమని ప్రోత్సహించడానికి ఇప్పుడు ఆయన మనకు చేస్తున్న మంచి పనులను గుర్తుంచుకోవాలి. మనం విషయాలను వినడం, చూడడం మరియు అర్థం చేసుకోవడం దేవుడు ఇచ్చిన బహుమతి. మనకు ఉన్నదంతా ఆయన నుండి. కొంతమందికి చాలా డబ్బు మరియు ఆస్తులు ఉన్నాయి, కానీ దేవుని గురించి తెలియదు లేదా పట్టించుకోరు. మనం దేవునికి కృతజ్ఞతతో ఉండాలి మరియు ఆయన మనల్ని ఏమి చేయమని కోరితే అది చేయాలి ఎందుకంటే ఆయన మనకు చాలా మంచిగా ఉన్నాడు.

తమ దుర్మార్గంలో తమను తాము పొగిడేవారిపై దైవిక కోపం. (10-21) 
దేవుడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేసాడు, అది అతనిని విశ్వసించడం మరియు అతని బోధనలను అనుసరించడం అంటే ఏమిటో చూపిస్తుంది. ప్రజలు యేసు గురించిన సువార్తను ఇతరులతో ఎలా పంచుకోవాలో కూడా ఈ వాగ్దానం సూచిస్తుంది. యేసును విశ్వసించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఆయనకు చెందినవారని చూపించాలి మరియు ఆయన మార్గాలను అనుసరించాలి. భగవంతుడిని నమ్మని వారు ఆయనకు దూరమవుతున్నారని వివరించారు. ఎప్పుడైతే మనుషులు దేవుణ్ణి విశ్వసించక, సజీవంగా లేని వస్తువులను ఆరాధిస్తారో, అప్పుడే చెడు జరగడం మొదలవుతుంది. కొన్నిసార్లు ప్రజలు తమ వద్ద ఉండకూడని వస్తువులను కోరుకోవడం వల్ల ఇలా చేయడానికి శోదించబడతారు. ఈ వ్యక్తులు విషపూరిత వస్తువులను ఉత్పత్తి చేసే మొక్కల వంటివారు. ఊరికే వదిలేస్తే ఎక్కడికక్కడ వ్యాపించే కలుపు మొక్కలు లాంటివి. దెయ్యం ఇది సరైందేనని అనిపించవచ్చు, కానీ అది నిజంగా ఎంత చెడ్డదో చివరికి ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా, దేవుడి శిక్ష నుండి తాము సురక్షితంగా ఉన్నామని వారు ఇప్పటికీ భావిస్తారు. అయితే దేవుడు తనను అనుసరించని వారిని శిక్షిస్తాడని బైబిల్‌లో ఒక హెచ్చరిక ఉంది. ఇది నిజంగా భయానకంగా ఉంది మరియు మనమందరం దేవుని మార్గాలను అనుసరించడానికి జాగ్రత్తగా ఉండాలి. 

యూదు దేశం యొక్క నాశనము. (22-28) 
భగవంతుడిని కాకుండా ఇతర వస్తువులను పూజిస్తే వారి దేశం నాశనం అవుతుంది. దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పిన వ్యక్తులు ఆయన నియమాలను నిజంగా పాటించనప్పుడు ఇది ఇంతకు ముందు జరిగింది. దేవుడు మనకు పాఠం నేర్పడానికి మాత్రమే ఇలా చేస్తాడు మరియు ఎందుకు అర్థం చేసుకోవడం మరియు దాని నుండి నేర్చుకోవడం ముఖ్యం. మోషే ధర్మశాస్త్రం పాపం చేసే వ్యక్తులను శిక్షిస్తుంది, కానీ వారు క్షమించి, యేసును విశ్వసిస్తే, వారు క్షమించబడతారు మరియు వారి దేశంలో శాశ్వతంగా ఉండగలరు. ఎందుకంటే దేవుడు వారిని రక్షిస్తాడు. 

రహస్య విషయాలు దేవునికి చెందినవి. (29)
మోసెస్ మరియు సెయింట్ పాల్ ఇద్దరూ యూదుల మతాన్ని కొంతమంది ఎలా నమ్మరు అనే దాని గురించి మాట్లాడారు. నిజజీవితంలో ఇలా జరగడం చూసి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. రోమీయులకు 11:33 మనం దేవుని రహస్యాలన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నించకూడదు, కానీ దేవుడు ఇప్పటికే మనకు తెలియజేసిన వాటిని నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. మంచి జీవితాన్ని గడపడానికి దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చాడు, మిగతావన్నీ మనం తెలుసుకోవలసిన అవసరం లేదు. బైబిల్ మనకు మంచి జీవితాన్ని గడపడానికి మరియు సంతోషంగా ఉండటానికి సహాయం చేయడానికి ఉద్దేశించబడింది, కాబట్టి అది మనకు బోధించే వాటిని అనుసరించడంపై దృష్టి పెట్టాలి. బైబిలు మనకు బోధిస్తున్నదానిపై ఆధారపడి జీవించడం ద్వారా మనం ఓదార్పును మరియు ఆనందాన్ని పొందవచ్చు. 



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |