Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే.
ఈ తరంవారు వాగ్దాన దేశాన్ని సమీపిస్తూ ఉండగా వారు ఒక నూతనమైన మనస్సుతో ఇకపై కొనసాగాలి. అందుకని సీనాయిలో వారి తండ్రులతో చేసిన ఒడంబడికను (నిర్గమ 19 అధ్యాయం) వీరితో మళ్ళీ స్థిరపరస్తున్నాడు.
2. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా
3. ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి.
4. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు.రోమీయులకు 11:8
యెషయా 29:10 రోమీయులకు 11:8. దీనికి కారణం వారి అపనమ్మకం, తిరుగుబాటుతనమే.
5. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.
6. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
ద్వితీయోపదేశకాండము 8:3.
7. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా
సంఖ్యాకాండము 21:21-24 సంఖ్యాకాండము 21:33 సంఖ్యాకాండము 21:35.
8. మనము వారిని హతము చేసి వారి దేశ మును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయుల కును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు.
సంఖ్యాకాండము 32:32-33.
9. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను.
ద్వితీయోపదేశకాండము 4:6.
10. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను,
11. నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు,
12. అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి,
ఈ ఒడంబడిక ఏమిటంటే తాను వారి దేవుడుగానూ, వారు తన ప్రజలుగానూ ఉంటారని (నిర్గమకాండము 6:6-7). ఇప్పుడు విశ్వాసులకు ఈ మహా భాగ్యం, గొప్ప దీవెనలూ ఉన్నాయి (2 కోరింథీయులకు 6:16 తీతుకు 2:14 1 పేతురు 2:9-10).
13. నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.
14. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను
15. ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
16. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
17. వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.
18. ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను.అపో. కార్యములు 8:23, హెబ్రీయులకు 12:15
ద్వితీయోపదేశకాండము 32:32. విగ్రహ పూజ, సృష్టికర్తయైన యెహోవాను తప్ప ఇతర దేవుళ్ళను పూజించడం విషంతో సమానం.
19. అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
విగ్రహపూజ, అబద్ధ దేవతార్చనల వల్ల దేవుని శాపం వస్తుందని తెలిసి కూడా మొండిగా, గర్వంతో, భయం లేకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో తాను దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానని తెలిసి కూడా ఆ విధంగానే చేసేవారికే ఈ హెచ్చరిక (1 సమూయేలు 2:25 2 దినవృత్తాంతములు 36:16 {Pro,1,24
20. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.ప్రకటన గ్రంథం 22:18
21. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపము లన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును.
22. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి
యెషయా 1:7 యెషయా 34:9 యెషయా 64:11 యిర్మియా 17:6 జెఫన్యా 2:9.
23. వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి
24. యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.
1 రాజులు 9:8 యిర్మియా 22:8.
25. మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి
2 రాజులు 17:9-23 2 దినవృత్తాంతములు 36:13-21.
26. తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి
27. గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.
దానియేలు 9:11.
28. యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
2 దినవృత్తాంతములు 7:20 కీర్తనల గ్రంథము 52:5 సామెతలు 2:22 ఎజ్రా 5:12-13.
29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.
అపో. కార్యములు 1:7. దేవుడు ఇంకా వెల్లడి చేయని విషయాలనేకం ఉన్నాయి. ఈ రహస్యాలు ఆయనవే అని గుర్తించి విడిచిపెట్టాలి. మనం ఆయన్ను తెలుసుకొని నమ్మి, ఆయనకు లోబడి, ఆయన్ను సేవించి, ప్రేమించి, ఆయనతో శాశ్వత కాలం సహజీవనం చేసేందుకు సిద్ధపడి ఉండడానికి మనకు అవసరమైన విషయాలన్నిటిన