Peter I - 1 పేతురు 1 | View All
Study Bible (Beta)

1. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్‌ జ్ఞానమునుబట్టి,

2. ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.

4. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను.

5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

యోబు 23:10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

కీర్త 66:10 దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

యెషయా 48:10 నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని

జెకర్యా 13:9 ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

మలాకీ 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.

8. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,

9. అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

10. మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,

11. వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.

కీర్త 22:1-31 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారునేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారునా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావునీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడిఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరురాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే.భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరుఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

12. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

లేవీ 11:44 నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.

లేవీ 19:2 మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.

లేవీ 20:7 కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

2దిన 19:7 యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

కీర్త 28:4 వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము. వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము.

కీర్త 62:12 ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.

కీర్త 89:26 నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.

సామె 17:3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.

సామె 24:12 ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.

యెషయా 59:18 ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.

యెషయా 64:8 యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

యిర్మియా 3:19 నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెదననుకొని యుంటిని. నీవునా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?

యిర్మియా 17:10 ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

యెషయా 52:3 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి.

21. మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు,

22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

దాని 6:26 నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును.

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

యెషయా 40:6-8 ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియైయున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నదియెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

యెషయా 40:6-8 ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియైయున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నదియెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Peter I - 1 పేతురు 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలుడు క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రత్యేక ప్రయోజనాల కోసం ఆశీర్వదిస్తాడు. (1-9) 
ఈ లేఖ పెద్ద సంఖ్యలో విశ్వాసుల కోసం ఉద్దేశించబడింది, వివిధ నగరాలు లేదా దేశాలలో తమను తాము అపరిచితులుగా గుర్తించే వ్యక్తులు, దేశాల అంతటా చెదరగొట్టారు. ఈ విశ్వాసులు తమ మోక్షాన్ని తండ్రి ఎంచుకున్న ప్రేమ, కుమారుని విమోచన మరియు పరిశుద్ధాత్మ పవిత్రీకరణకు ఆపాదించమని కోరారు, వారు ఎవరి పేరులో బాప్టిజం పొందారో త్రియేక దేవునికి మహిమను ఇస్తారు. ప్రపంచం తరచుగా అనిశ్చిత వస్తువులతో ఆశను అనుబంధిస్తుంది, ఎందుకంటే ప్రాపంచిక ఆశలు ఇసుకపై నిర్మించిన నిర్మాణాల మాదిరిగానే అస్థిరమైన పునాదులపై ఆధారపడి ఉంటాయి. లౌకిక మనస్తత్వంలో మునిగిపోయిన వారిలో స్వర్గం కోసం ఆశ తరచుగా గుడ్డి మరియు నిరాధారమైన ఊహాగానాలు.
దీనికి విరుద్ధంగా, సజీవంగా ఉన్న దేవుని పిల్లల నిరీక్షణ శక్తివంతంగా మరియు చైతన్యవంతంగా ఉంటుంది-దాని వస్తువులో మాత్రమే కాకుండా దాని రూపాంతర ప్రభావంలో కూడా ఉంటుంది. ఈ ఆశ ఆపద సమయాల్లో ఉత్తేజాన్నిస్తుంది మరియు ఓదార్పునిస్తుంది, సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు అధిగమించడానికి విశ్వాసులకు శక్తినిస్తుంది. వీటన్నింటికీ మూలం దయ, గొప్పది మరియు అనేకమైనది. మోక్షానికి సంబంధించిన ఈ గ్రౌన్దేడ్ ఆశ చురుకైన మరియు సజీవ శక్తిగా మారుతుంది, విశ్వాసి యొక్క ఆత్మలో విధేయతను నడిపిస్తుంది. క్రైస్తవ ఆనందానికి మూలం వారి కోసం కేటాయించబడిన శాశ్వతమైన సంతోషం-అక్షరమైన, నిష్కళంకమైన మరియు క్షీణించని వారసత్వం కోసం ఎదురుచూడటంలో ఉంది.
లోపాలు మరియు లోపాలతో గుర్తించబడిన భూసంబంధమైన ఆస్తిలా కాకుండా, పరలోక సంపదలు కలుషితం కాకుండా ఉంటాయి. ప్రాపంచిక వస్తువులు అనిశ్చితంగా మరియు నశ్వరమైనవి, క్షేత్ర పుష్పాల యొక్క అస్థిరమైన అందాన్ని పోలి ఉంటాయి. గొప్ప విలువ పరలోక రాజ్యాలలో నివసిస్తుంది మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఈ వారసత్వంపై ఎవరి హృదయాలను ఉంచారో వారు నిజంగా ధన్యులు. దేవుడు తన ప్రజలకు కృపను ప్రసాదించడమే కాకుండా వారిని మహిమ కొరకు కాపాడుతాడు. ప్రతి విశ్వాసికి సంతోషించడానికి కారణం ఉంటుంది, వారి ముఖం మరియు ప్రవర్తనలో వ్యక్తమవుతుంది.
ప్రభువు బాధలలో సంతోషించనప్పటికీ, అతని తెలివైన ప్రేమ తరచుగా తన ప్రజల హృదయాలను బహిర్గతం చేయడానికి మరియు చివరికి వారికి మంచిని తీసుకురావడానికి పరీక్షలను నిర్దేశిస్తుంది. అగ్నిలో తగ్గిపోయే బంగారంలా కాకుండా, విశ్వాసం దృఢంగా మారుతుంది మరియు పరీక్షలు మరియు కష్టాల ద్వారా గుణించబడుతుంది. బంగారం నశిస్తుంది మరియు పాడైపోయే వస్తువులను మాత్రమే పొందగలదు, కానీ విశ్వాసం యొక్క విచారణ ప్రశంసలు, గౌరవం మరియు కీర్తికి దారి తీస్తుంది.
ఈ వాస్తవికత ప్రస్తుత బాధల నేపథ్యంలో ఓదార్పునిస్తుంది. విశ్వాసులు క్రీస్తు యొక్క శ్రేష్ఠత మరియు ప్రేమను విశ్వసించమని ప్రోత్సహించబడతారు, హృదయంలో ఒక అగ్నిని రగిలించారు, అది ఆయనకు ప్రేమ యొక్క త్యాగం అవుతుంది. దేవుని మహిమ మరియు మన సంతోషం యొక్క ఐక్యత ఇప్పుడు ఒకదానిని తీవ్రంగా వెదకడం వలన ఆత్మ ఇకపై చెడుకు లోబడి లేనప్పుడు మరొకదానిని పొందేలా చేస్తుంది. ఈ నిరీక్షణ యొక్క ఖచ్చితత్వం చాలా లోతైనది, విశ్వాసులు దీనిని ఇప్పటికే అందుకున్నట్లుగా ఉంది.

క్రీస్తు ద్వారా రక్షణ గురించి ప్రాచీన ప్రవచనంలో ముందే చెప్పబడింది. (10-12)
ప్రవక్తల ఆలోచనలో ప్రధాన దృష్టి యేసుక్రీస్తు. క్రీస్తు యొక్క బాధలు మరియు తదుపరి మహిమలను వారి అన్వేషణ మొత్తం సువార్త యొక్క సమగ్ర అవగాహనను అందించింది. సారాంశంలో, క్రీస్తు యేసు మన నేరాలకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడని మరియు మన సమర్థనను పొందేందుకు పునరుత్థానం చేయబడాడని సువార్త ప్రకటిస్తుంది. దేవుడు, తన జ్ఞానంలో, మన అభ్యర్థనలకు ప్రతిస్పందించడం కంటే మన అవసరాలను తీర్చడానికి మొగ్గు చూపుతాడు.
ప్రవక్తల బోధనలు అపొస్తలుల బోధనలతో సంపూర్ణంగా సరిపోతాయి, రెండూ ఒకే దేవుని ఆత్మ నుండి ఉద్భవించాయి. సువార్త ఆత్మ యొక్క పరిచర్యగా పనిచేస్తుంది మరియు దాని ప్రభావం ఆయన ప్రభావం మరియు ఆశీర్వాదంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, రక్షణ బోధలను కలిగి ఉన్న లేఖనాలను శ్రద్ధగా పరిశీలిద్దాం.

అందరూ పవిత్ర సంభాషణకు ప్రోత్సహించబడ్డారు. (13-16) 
ప్రయాణీకులు, రన్నర్‌లు, యోధులు మరియు కార్మికులు తమ తమ పనుల్లో సంసిద్ధత కోసం తమ వస్త్రాలను సేకరించినట్లే, క్రైస్తవులు కూడా తమ మనస్సులను మరియు ప్రేమను సిద్ధం చేసుకోవాలి. అప్రమత్తంగా మరియు నిగ్రహంతో ఉండండి, ఆధ్యాత్మిక ప్రమాదాలు మరియు శత్రువుల నుండి రక్షించండి. చర్యలలో మాత్రమే కాకుండా అభిప్రాయాలలో కూడా సంయమనం పాటించండి, స్వీయ-తీర్పులో వినయాన్ని ప్రదర్శించండి. దేవుని దయపై దృఢమైన మరియు సంపూర్ణమైన విశ్వాసం మన బాధ్యతలను నెరవేర్చడంలో మన హృదయపూర్వక ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది.
పవిత్రత అనేది ప్రతి క్రైస్తవుని ఆకాంక్ష మరియు బాధ్యత రెండూ. ఇది జీవితంలోని అన్ని కోణాల్లోనూ, ప్రతి సందర్భంలోనూ మరియు ప్రజలందరితో పరస్పర చర్యలలోనూ వ్యాపించి ఉండాలి. ప్రత్యేకించి, మనలను శోధించే పాపాలకు వ్యతిరేకంగా మనం జాగ్రత్తగా మరియు ప్రార్థనతో ఉండాలి. దేవుని వ్రాతపూర్వక వాక్యం ఒక క్రైస్తవుని జీవితానికి అత్యంత విశ్వసనీయమైన మార్గదర్శిగా పనిచేస్తుంది, ప్రతి అంశంలో పవిత్రతను కొనసాగించమని మనకు నిర్దేశిస్తుంది. దేవుడు తాను రక్షించిన వారిని పవిత్రం చేస్తాడు.

వారి సూత్రాలు, అధికారాలు మరియు బాధ్యతలకు తగినవి. (17-25)
తండ్రిగా దేవునిపై విశ్వాసం మరియు న్యాయమూర్తిగా ఆయన పట్ల భక్తితో కూడిన భయం పరిపూరకరమైనవి; దేవుడ్ని న్యాయమూర్తిగా పరిగణించడం వల్ల తండ్రిగా ఆయన పట్ల మన మెప్పుదల పెరుగుతుంది. విశ్వాసులు తప్పు చేస్తే, దేవుడు వారిని సరిదిద్దవచ్చు. కాబట్టి, క్రైస్తవులు ఆయన వాగ్దానాలకు దేవుని విశ్వసనీయతను ప్రశ్నించకూడదు లేదా ఆయన కోపానికి భయపడి లొంగిపోకూడదు. బదులుగా, వారు ఆయన పవిత్రతకు తగిన గౌరవం చూపాలి. జాగ్రత్త లేని ధైర్యంగల విశ్వాసి సాతాను కుట్రలకు సులభంగా బలైపోతాడు. మరోవైపు, నిరుత్సాహపరుడైన విశ్వాసి, ప్రయోజనాలను ఉపయోగించుకునే ధైర్యం లేకుంటే, లొంగిపోయే అవకాశం ఉంది.
మానవాళి యొక్క విముక్తి క్రీస్తు యొక్క విలువైన రక్తం ద్వారా సాధించబడింది. ఆచార సమర్థనలతో సంబంధం లేకుండా, బహిరంగంగా పాపం చేయడమే కాకుండా ఉత్పాదకత లేని సంభాషణలు కూడా ముఖ్యమైన ప్రమాదాలను కలిగిస్తాయి. పూర్వీకులు అలా చేశారనే కారణంతో ఒక నిర్దిష్ట మార్గంలో జీవించి చనిపోవాలనే సంకల్పాన్ని అంటిపెట్టుకుని ఉండటం మూర్ఖత్వం. దేవుడు తన ప్రజలకు అలాంటి కృపను బయలుపరచడానికి చాలా కాలం ముందు వారి కోసం ప్రత్యేక అనుగ్రహాన్ని ముందుగా నిర్ణయించాడు. కాంతి యొక్క స్పష్టత, విశ్వాసం యొక్క బలపరిచేటటువంటి మరియు ఆర్డినెన్సుల యొక్క సమర్థత క్రీస్తు ఆగమనం నుండి అధిక సౌకర్యాన్ని అందించాయి. క్రీస్తునందు విశ్వాసము విశ్వాసులను ఆయన ప్రస్తుత మహిమతో ఏకం చేస్తుంది, ఆయన ఎక్కడ ఉన్నారో వారు కూడా ఉంటారని నిర్ధారిస్తుంది యోహాను 14:3
ఆత్మ తన కోరికలు మరియు భోగాలను విడిచిపెట్టాలంటే, అది శుద్ధి చేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో నాటబడిన దేవుని వాక్యం ఆధ్యాత్మిక జీవితానికి సాధనంగా పనిచేస్తుంది, విధిని ప్రేరేపిస్తుంది మరియు ఆత్మ యొక్క స్వభావాలు మరియు ఆప్యాయతలలో పూర్తి పరివర్తనను ప్రభావితం చేస్తుంది, చివరికి శాశ్వత జీవితానికి దారి తీస్తుంది. పునరుద్ధరించబడిన ఆధ్యాత్మిక మనిషికి భిన్నంగా, సహజమైన మనిషి యొక్క వ్యర్థతను గమనించండి. అతని జీవితం మరియు పతనం గడ్డిని పోలి ఉంటాయి, ఇది త్వరగా వాడిపోతుంది మరియు వాడిపోతుంది. మనం పవిత్రమైన, సజీవమైన పదాన్ని వినాలి, స్వీకరించాలి మరియు ప్రేమించాలి, దానిని కోల్పోకుండా అన్నింటినీ పణంగా పెట్టాలి. ఈ పదం ఇక్కడ మన ఏకైక సంపదగా మన హృదయాలలో ప్రతిష్టించబడాలి, విశ్వాసుల కోసం వేచి ఉన్న పరలోక నిధి యొక్క హామీ హామీ.



Shortcut Links
1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |